*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷అక్టోబర్ 2🌷🌷*
*"ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను " (ఎఫెసీ. 4:13)*
దేవుడు తన ప్రణాళిక చొప్పున విశ్వాసుల యొక్క ఆత్మీయ పరిపక్వత నిమిత్తమై సంఘమునకు ఐదంతల వరములనిచ్చెను (ఎఫెసీ. 4: 11-16), పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఆయన అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు మరియు ఉపదేశకులను ఇచ్చెను. ఆ రీతిగా విశ్వాసులు పరిపక్వతకు తీసికొని రాబడగలరు. విశ్వాసుల ఎదుగుదల నిమిత్తము ఈ వరములన్నియు పనిచేయుట అవసరమై యున్నది. అపొస్తలులు సువార్త ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వరములన్నియు బయలు పరచబడుటను అపొ. కా. 14:21-23; 15:32; 20: 28-36 లలో చూచుదుము. మొట్టమొదటిగా అపొస్తలుడు, మరియు అతని జతపని వారి ద్వారా సువార్త అధికారంతో ప్రకటించబడెను. మరియు వారు వారిని కట్టి, విశ్వాసమందు స్థిరపరచుటకు కొంతకాలము వరకు వారితో ఉండ గలిగిరి. కావున విశ్వాసులు కాపరత్వము పొంది, పరిపక్వతకు తీసికొని రాబడిరి. తరువాత ప్రతి స్థలములో పెద్దలను నియమించిరి. "మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలని ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్ధన చేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి" ( అపొ. కా. . 14:23). కావున వారు ఎంతో ప్రార్ధించి, ప్రభువు యొద్ద వేచియుండిన పిమ్మట పెద్దలుగా ఉండుటకు ఎవరు తగినవారని కనుగొన గలిగిరి. 1 పేతురు 5 వ అధ్యాయము ద్వారా పెద్దలు ఏలాగున పనిచేయవలెనో చూచుదుము.
మొట్టమొదటిగా పెద్దలుగా ఏర్పరచబడినవారు ఎంతో దీనులై యుండవలెను. "తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచ బడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించు చున్నాను” ( 1 పేతురు 5:1) అపొస్తలుడైన పేతురు, తాను ఒక పెద్దనని వారితో చెప్పుచున్నాడు. ఆలాగున అతడు ఎంతో దీన స్థానమును తీసికొనుచున్నాడు . ఒక వ్యక్తి నిజముగా దీనుడుగా ఉంటేనే తప్ప, అతడు తన మందను పోషించలేడు. తమను బట్టి తాము గర్వించు వారు, స్వయం మహిమను వెదకువారు పెద్దలుగా పనిచేయలేరు.
రెండవదిగా, పేతురు క్రీస్తు యొక్క శ్రమలను గూర్చిన సాక్షినని చెప్పుచున్నాడు (1 వ.వ) ఒక వ్యక్తి పెద్దగా ఉండవలెనని కోరుచున్న యెడల అతడు సువార్త నిమిత్తము కొంత శ్రమ, కష్టము, హింస ద్వారా వెళ్ళవలెను. ఏ కాపరులైతే శ్రమల ద్వారా వెళ్ళు దురో వారు రాబోవు శ్రమలను భరించు గలుగుదురు..
మూడవదిగా, పేతురు తనను గురించి బయలు పరచ బడబోవు మహిమలో పాలివాడనని చెప్పుకొనుచున్నాడు (1 వ.వ) పేతురుకు ప్రభువు యొక్క రెండవ రాకడ యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత గలదు. ప్రభువైన ఏసుక్రీస్తును మన రక్షకుని గా అంగీకరించి నప్పుడు, మనము ఏడు అంతల ఆత్మీయ పాలి భాగత్వము లోనికి ప్రవేశించుదుము. కావున తమ పరలోక పిలుపు, పరిచర్య యొక్క స్పష్టమైన పరలోక ప్రత్యక్షత గలవారే పెద్దలు.
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝