
Sekhar Digitals - 9603197203
@sekhardigitals
Reporter & Digital's Studio
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్
తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయల వజ్రాల యజ్ఞోపవీతం.. హైదరాబాద్ భక్తుడు నిలోఫర్ టీ దుకాణం యజమాని బాబూరావు సమర్పణ. గత నెలలో దర్శనానికి వచ్చినప్పుడు యజ్ఞోపవీతం తెస్తావా అని దేవుడు అడిగినట్టే వినిపించింది.. అందుకే నెల రోజుల్లో వజ్రాలతో చేయించి తెచ్చామని చెప్పారు.
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
*ముమ్మిడివరం పిడిఎస్ బియ్యం పట్టివేత కలకలం*
*సివిల్ సప్లై డైరెక్టరుపై.1.50 లక్షల డిమాండ్ ఆరోపణ*
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన పిడిఎస్ బియ్యం పట్టివేత ఘటన పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారితీసింది. హై స్కూల్ సెంటర్ సమీపంలోని ఒక బియ్యం దుకాణంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు.
తనిఖీ సందర్భంగా రెండు బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ వ్యవహారం బయటికి వెళ్లకుండా చూసేందుకు డైరెక్టరు వెంట ఉన్న వ్యక్తి రూ.1,50,000 డిమాండ్ చేశాడని దుకాణ యజమాని ఆరోపిస్తూ ఈ విషయాన్ని ముమ్మిడివరం చాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఛాంబర్ సభ్యులు వెంటనే దుకాణానికి చేరుకుని డైరెక్టరుతో ఘర్షణకు దిగారు. ఇది రేషన్ బియ్యం అవునా కాదా అన్నది మీరు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ప్రధాన రహదారి పక్కనే దుకాణం ఉండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తరువాత పరిస్థితిని సమీక్షించిన ఛాంబర్ సభ్యుల మధ్యస్థంతో దుకాణదారుడు—సివిల్ సప్లైస్ డైరెక్టర్ మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం.
ఈ సంఘటనతో ముమ్మిడివరం ప్రాంతంలో పిడిఎస్ బియ్యం పట్టివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్
*ముమ్మిడివరంలో పీడీఎస్ బియ్యం పట్టివేత*
ముమ్మిడివరం - నగర పంచాయతీ పరిధిలోని ఒక బియ్యం దుకాణంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఆ దుకాణంలో రెండు బస్తాలు రేషన్ బియ్యం గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్కు సివిల్ సప్లై డైరెక్టర్కు మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పోలీసుల రంగ ప్రవేశం. డైరెక్టర్కు చాంబర్ ఆఫ్ కామర్స్ కు మధ్య జరుగుతున్న చర్చలు.
#📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
ఆర్టీసీలో అప్రెంటిస్ కొరకు దరఖాస్తుల స్వీకరణ ఐటిఐ చదివిన వారు అప్లై చేయగలరు.
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్
APUS INFO — AP ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026
✅ ఫిబ్రవరి 23 – మొదటి సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – I
✅ ఫిబ్రవరి 24 – రెండో సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – II
✅ ఫిబ్రవరి 25 – మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – I
✅ ఫిబ్రవరి 26 – రెండో సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – II
✅ ఫిబ్రవరి 27 – మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ – I
✅ ఫిబ్రవరి 28 – రెండో సంవత్సరం హిస్టరీ / బోటనీ పేపర్ – II
✅ మార్చి 2 – మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – I
✅ మార్చి 3 – రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – IIA / సివిక్స్ – II
✅ మార్చి 5 – మొదటి సంవత్సరం జూలాజీ / మ్యాథ్స్ – IB
✅ మార్చి 6 – రెండో సంవత్సరం జూలాజీ – II / ఎకనామిక్స్ – II
✅ మార్చి 7 – మొదటి సంవత్సరం ఎకనామిక్స్ – I
✅ మార్చి 9 – రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – IIB
✅ మార్చి 10 – మొదటి సంవత్సరం ఫిజిక్స్ – I
✅ మార్చి 11 – రెండో సంవత్సరం ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – II
✅ మార్చి 12 – మొదటి సంవత్సరం కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – I
✅ మార్చి 13 – రెండో సంవత్సరం ఫిజిక్స్ – II
✅ మార్చి 14 – మొదటి సంవత్సరం సివిక్స్ – I
✅ మార్చి 16 – రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – II
✅ మార్చి 17 – మొదటి సంవత్సరం కెమిస్ట్రీ – I
✅ మార్చి 18 – రెండో సంవత్సరం కెమిస్ట్రీ – II
✅ మార్చి 20 – మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – I
✅ మార్చి 23 – రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – II
✅ మార్చి 24 – మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – I
#🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
ఈ అమ్మాయి పేరు గుబ్బల జ్యోత్స్న, ముక్తేశ్వర గ్రామము, అయినవిల్లి మండలం. అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ నందు మొదటి సంవత్సరం B. Com చదువుతున్నది. ఈరోజు ఉదయం కాలేజీకి బయలుదేరింది. కానీ కాలేజీకి వెళ్లలేదని తెలిసి, చుట్టుపక్కల గల ప్రాంతాలలో వెతికినను ఈ అమ్మాయి ఆచూకీ తెలియ రాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ నమోదు చేయబడింది..
కావున ఈ అమ్మాయి ఆచూకీ ఎవరికైనా తెలిసి ఉంటే
అమలాపురం టౌన్ పి. ఎస్
Ci.. 9440796561
SI... 8143579127
లకు తెలియజేయవలెను
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
అలీ పై అనుమానంతో....
ఇంటికి నిప్పు పెట్టిన భర్త
కట్టుకున్న భార్యపై అనుమానం తో ఇంటికి నిప్పు పెట్టి చంపాలనే ప్రయత్నం చేశాడు ఒక ప్రబద్ధుడు. వివరాల్లోకెళ్తే... అమలాపురం పట్నం నల్లా వీధికి చెందిన జంగా శివ (సురేష్) గురువారం రాత్రి భార్య పై అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టి చంపాలని ప్రయత్నం చేసాడు. పోలేరమ్మ గుడి సందులో వున్న ఆమె తల్లి ఇంటికి వెళ్లింది. భార్య విజయ దుర్గా భవానీ పిల్లల తో నిద్రిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి అర్ధరాత్రి 1 గంట సమయo లో పెట్రోల్ పోసి అత్తవారింటికి నిప్పు పెట్టాడు.
భార్య ఫిర్యాదు మేరకు కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై కిషోర్ బాబు తెలిపారు. నిందితుడు పోలీస్ అదుపులో ఉన్నట్లు తెలిసింది.
#📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్
ఫోక్స్ కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష 5000 జరిమానా..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపిన వివరాలు ప్రకారం..
అయినవిల్లి మండలం ఐనవెల్లిలంక గ్రామానికి చెందిన ముత్తబత్తుల సతీష్ కు శిక్ష ఖరారు చేసిన కాకినాడ ఫోక్సు కోర్టు జడ్జి కె శ్రీదేవి...
7..8..2018 నా అదే గ్రామంలో 15 ఏళ్ల చిన్నారికి చిన్నారిపై అత్యాచారం చేశాడని తల్లిదండ్రులు అయినవిల్లి పోలీసులను ఆశ్రయించారు.
ఏడు సంవత్సరాల విచారణ అనంతరం ఈరోజు శిక్ష ఖరార్ అయింది.. పబ్లిక్ ప్యాసిక్యూటర్ కే వెంకటరత్నం పి శ్రీనివాసరావు వాదించారు. కోర్టులో సాక్షాలు సమర్పించిన పోలీస్ సిబ్బంది నీ జడ్జి అభినందించారు...
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
*వినాయకుని సన్నిధిలో సినీనటుడు సాయి శ్రీనివాస్..*
అయినవిల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్..
తన తండ్రి బెల్లంకొండ సురేష్ గారి పేరున 50 వేల కొబ్బరికాయలు మొక్కుకున్న సాయి శ్రీనివాస్
అందులో భాగంగా 10వేల కొబ్బరికాయలు మొక్కు చెల్లించుకున్న సాయి శ్రీనివాస్
సాయి శ్రీనివాస్ కు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ప్రధాన అర్చకులు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
పి.గన్నవరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻
కాసులిస్తే..ఒకలా..! లేకుంటే మరొకలా..!!
పుట్ట గొడుగుల్లా అక్రమ లే-అవుట్లు..
చర్యలలో తేడాలెందుకు.. తేల్చి చెప్పాలి..
అవినీతిమయంగా ముమ్మిడివరం నగర పంచాయితీ టౌన్ ప్లానింగ్.. మున్సిపల్ అధికారుల తీరుపై సర్వత్రా ఆరోపణలు.












