
Sekhar Digitals - 9603197203
@sekhardigitals
Reporter & Digital's Studio
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢
*పి.గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. ఏ పార్టీలో చేరబోతున్నాను అనేది త్వరలోనే వెల్లడిస్తానన్న మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు..*
అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు..
తన రాజీనామాను ఆమోదించలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు లేక..
తను ఏ పార్టీలో చేరబోతున్నాం అనేది త్వరలోనే చెబుతానన్న పి.గన్నవరం మాజీ శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు..
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్
బంగాళాఖాతంలో బలహీనపడిన తీవ్ర వాయుగుండం
*రెండు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన..*
నెల్లూరు,తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం..
*తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు..*
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక...
దక్షిణ కోస్తా పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరిక..
ఉత్తరకోస్తాలోని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక
కాకినాడలో రెండో ప్రమాద హెచ్చరిక
___________________________
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మహిపాల చెరువు సమీపంలో కాంక్రీట్ మిక్సింగ్ లారీ తిరగబడింది. దీంతో హైడ్రాలిక్ తో లారీని తిరిగి నిలబెట్టారు..
#📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻
వైద్యుడి నిర్లక్ష్యం.. సర్జరీ చేసి బ్లెడును లోపలే వదిలేసి..!
తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి సర్జరీ చేసి బ్లెడును లోపలే వదిలేసిన వైద్యుడు
నొప్పితో విపరీతంగా బాధ పడడంతో ఎక్స్‌రే తీసిన వైద్యులు
విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వైద్యుడు, నర్సుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం
వైద్యుడు, నర్సు సస్పెండ్
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం(సి.హెచ్.సి)సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఎయిడ్స్ నియంత్రణ యూనిట్ అయిన ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐ.సి.టి.సి) మరియు ఎం.జి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్(ఆర్.ఆర్.సి) సంయుక్త ఆధ్వర్యంలో “ఎయిడ్స్ దినోత్సవ” అవగాహన ర్యాలీ, మానవహారం మరియు ఎయిడ్స్ వ్యాధిపై ప్రమాణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై సమాచారం తెలుసుకొని సురక్షితంగా ఉండాలని ఈ సంవత్సరం అంశం అయిన “హెచ్.ఐ.వి. పరీక్ష చేయించుకోండి, సమాచారం తెలుసుకోండి, సురక్షితంగా ఉండండి” పై ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది ఆర్.ఆర్.సి వాలంటీర్స్ మరియు విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై నినాదాలుతో ర్యాలి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన ర్యాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్ స్టేషన్ వరకు సాగింది, అక్కడ మానవహారం నిర్వహించి, వైద్య సిబ్బంది, విద్యార్థులచే ఎయిడ్స్ వ్యాధి పై ప్రతిజ్ఞ చెయ్యడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ వై.లోకేష్, డా.ఎన్.నితీష్ కుమార్, డా.ఎ.నిఖిత, డా.జి.కుమార్, ఐ.సి.టి.సి.కౌన్సిలర్ ఎం.దుర్గాప్రసాద్, టెక్నీషియన్ ఆర్.అనిల్ కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.లక్ష్మి ప్రశాంతి, ఆర్.ఆర్.సి. కోఆర్డినేటర్ కె. శ్రీనివాసరావు, ఆసుపత్రి సిబ్బంది ఆర్.దుర్గాబాయి, కె. మంగతయారు, ఎన్.సత్యనారాయణ, మీరాసాహెబ్, సంపూర్ణ, భారతి, రమణి, మెర్సీ, బాలాజీ, అధ్యాపకులు కె.దుర్గాప్రసాద్, యు.కిరణ్ కుమార్,అలెర్ట్ మరియు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కె.వెంకటేశ్వరరావు, కె.కార్తీక్ వైద్య సిబ్బంది, ఎ.ఎన్.ఎం.లు ఆశ వర్క్, ఆర్.ఆర్.సి వాలంటీర్స్ విద్యార్థులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 ..
*100 రూపాయల స్టాంపులు కొరత ముమ్మిడివరం*
ముమ్మిడివరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో 100 రూపాయలు స్టాంపులకు కొరత ఏర్పడి కొంతమంది స్టాంపు వెండర్లు వాటిని బ్లాక్లో విక్రయిస్తున్నారు.
ప్రతి రిజిస్ట్రేషన్ కు వంద రూపాయలు స్టాంపులు అవసరం కావడంతో దానిని అసరాగా చేసుకుని కొందరు *వెండర్లు 100 రూపాయలు స్టాంపును 200కు విక్రయిస్తున్నారు.* సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసి స్టాంపులు అమ్మకాలు జరపవలసి ఉన్న అధికారులు స్టాంపులు కోసం వెళ్లిన వారిని వండర్ల వద్ద తీసుకోవాలని సూచిస్తున్నారు. వంద రూపాయలు స్టాంపులు సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి వేండర్లకు సప్లై చేయవలసి ఉండగా గత కొంతకాలంగా దానిని నిలుపుదల చేయటంతో కొరత ఏర్పడింది. జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో తగినంత స్టాంపులు నిలవ ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో వాటిని సబ రిజిస్టర్ కార్యాలయాలకు సప్లై చేయటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే వంద రూపాయలు *స్టాంపులు విడుదల చేసి బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.*
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
అధికారుల తీరు పై కౌన్సిల్ ఆగ్రహం..
ముమ్మిడివరం నగర పంచాయతీ సాధారణ నిధుల గల్లంతుపై చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు అధికారుల తీరు పై ద్వజమెత్తారు.
*కమిషనర్ పై చైర్మన్ తీవ్ర ఆగ్రహం*
నగర పంచాయతీ కౌన్సిల్ హాలు నందు చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. తొలుత 8 అంశాలతో కూడిన అజెండా మరియు 10 అంశాలతో కూడిన టేబుల్ అజెండాను ప్రవేశపెట్టి చర్చించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ప్రవీణ్ కుమార్ గత ఆరు నెలల కాలంలో మున్సిపాలిటీ ఖాతా నిధుల బుక్ రిజిస్టర్ నిల్వకి, అజెండా లో చూపిన నిల్వకి *సుమారు రూ. 10లక్షలు వేత్యాసం ఉండటంతో చైర్మన్ గట్టిగా నిలదీశారు.* ఆ రూ.10 లక్షల నిధులు ఏమైయ్యాయో అధికారులు సమాధానం చెప్పాలంటూ కౌన్సిల్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ దశ లో చైర్మన్ కలుగజేసుకుని, రికార్డులను సమావేశానికి రప్పించి,గత 6 నెలలుగా రికార్డులలో నమోదు చేయకపోవడాన్ని సభ్యులకు చూపించారు. అలాగే అజెండా లో చూపించిన రూ. 56 లక్షల నిల్వలకు, సిస్టమ్ ఖాతాలో చూపిస్తున్న రూ. 46 లక్షల నిల్వలకు మధ్యన రూ.10 లక్షలు నిధులు వ్యత్యాసం ఉండటంతో రికార్డులన్నింటిని చైర్మన్ స్వాధీనం చేసుకుని ఆడిట్ అధికారులకు అప్పగిస్తాం అని చెప్పడంతో కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.తదుపరి 17వ వార్డు కౌన్సిలర్ బొంతు సత్య శ్రీనివాస్ అజెండా లోని 17వ అంశంలో జంగిల్ క్లియరెన్స్ పనులకు కేటాయించిన నిధులకు, అదనంగా సాధారణ నిధులను కేటాయించాలనే తీర్మానం పై చర్చిస్తూ ఇప్పటి వరకు ఎన్ని గంటలకు ఎంత ఎస్టిమేషన్ రూపొందించారు. ఎక్కడెక్కడ ఎన్ని గంటలు యంత్రాలతో పనులు నిర్వహించారో వివరించాలని ఇంజనీరింగ్ అధికారిని నిలదీశారు. ఎఇ శ్రీనివాస్ వివరణనిస్తూ 300 గంటలకి ఎస్టిమేషన్ రూపొందించి,ఇప్పటికి 240 గంటల పనులు పూర్తి చేసి 13 వార్డులలో జంగిల్ క్లియరెన్స్ ప్రక్రియ చేపట్టాగా,ఇంకా 7 వార్డులలో చేయాల్సి ఉందన్నారు. దీనిపై కౌన్సిలర్లు స్పందిస్తూ జంగిల్ క్లియరెన్స్ పనుల సమాచారం తెలపకుండా 10 గంటల పని చేసినా కిలోమీటర్లు మీటర్ పని జరగక పోవడమే కాకుండా, ప్రజా ధనం దూర్వినియోగం చేయడమేనని ఆరోపించారు.లైసెన్స్డ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ఒక బిల్డింగ్ కి అనుమతి తీసుకుని, పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నా అధికారులు చోధ్యం చూస్తున్నారని దుయ్యాబట్టారు. అనంతరం వార్డులలో విధి లైట్లు, శానిటేషన్ సక్రమ నిర్వహణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. కౌన్సిల్ సమావేశానికి వివిధ శాఖల అధికారుల గైర్హజరు పై సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, సచివాలయం సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻
*జంగిల్ క్లియరెన్స్ నిధుల దుర్వినియోగం సభ్యుల ఆరోపణ..*
ముమ్మిడివరం పంచాయతీ పరిధిలోని 20 వార్డుల్లో జంగిల్ క్లియరెన్స్ పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని
17వవార్డు కౌన్సిలర్ బొంతు సత్యశ్రీనివాస్ ప్రశ్నించడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం చోటు
చేసుకుంది.
ఇటీవల జంగిల్ క్లియరెన్స్ పేరుతో 240 గంటలు పనిచేసినట్లు నమోదు చేశారని..
*క్షేత్ర స్థాయిలో పనులు తూతూమంత్రంగా చేసి పనిగంటలు పెంచారన్నారు.*
అజెండా ప్రతుల్లో గత ఆరు నెలలుగా ముగింపు, ప్రారంభ నిల్వ ఒకేలా చూపుతున్నారని..
సభను తప్పుదోవ పట్టించే విధంగాఎందుకు చేస్తున్నారని *కమిషనర్ పి. రవివర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు.*
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰జాతీయం/అంతర్జాతీయం
నిధులు దుర్వినియోగమంటూ సభ్యుల ఆందోళన
ముమ్మిడివరం - నగర పంచాయతీ సమావేశం
*కమిషనర్ పై చైర్మన్ తీవ్ర ఆగ్రహం..*
*రికార్డులు స్వాధీనం చేసుకున్న చైర్మన్*
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పెంపు.
డిసెంబరు 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన విద్యాశాఖ.
వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు మొదట ఈ నెల 30 గడువుగా నిర్ణయించినప్పటికీ, విద్యాశాఖ దాన్ని పొడిగించింది.
డిసెంబరు 7 నుంచి 9 వరకు రూ.50 అపరాధ రుసుముతో, 10 నుంచి 12 వరకు రూ.200 అపరాధ రుసుముతో, 13 నుంచి 15 వరకు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.
హాల్ టికెట్‌లో పేరు లేదా ఇతర వివరాలు తప్పుగా నమోదైతే, వాటిని సవరించుకోవడానికి డిసెంబరు 16 నుంచి 20 వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా తెలిపారు.












