ఈ సంవత్సరమంతా హ్యాపీగా ఉండాలంటే… ఇదొక్క పని చేస్తే చాలు…
#newyear2026 #Welcome2026 #newyearwishes #goodvibes #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status
#🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ #Happynewyear 😃🎉🎊
పూణేకు చెందిన ప్రసాద్ నారాయణ్ అనే వ్యక్తి, ఒక కార్పొరేట్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తూనే, చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే లక్ష్యంతో ‘ద పవర్ ఆఫ్ వన్’ (The Power of One) ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను నడుపుతున్నారు. 2016లో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ఆయన దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ… వారి కలలను నిజం చేస్తున్నారు. ఫీజులు చెల్లించడమే కాకుండా, విద్యార్థులకు స్వయంగా కెరీర్ గైడెన్స్ మరియు మెంటార్‌షిప్ ప్రోగ్రామ్స్ వంటివి నిర్వహిస్తూ వారిని ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా, దాతలు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా విద్యార్థుల చదువులకు అందే వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ ట్రస్ట్ ప్రత్యేకత.
#TALRadioTelugu #ThePowerOfOne #EducationForAll #RealLifeHeroes #TALRadio #GoodNews #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status
ఢిల్లీ అగ్నిమాపక శాఖ మనుషుల ప్రాణాలను కాపాడడంతో పాటు, ఆపదలో ఉన్న మూగజీవాల పాలిట కూడా రక్షణగా నిలుస్తోంది. 2025 నవంబర్ నాటికి సుమారు 6,712 జంతువులను మరియు పక్షులను సురక్షితంగా రక్షించి అరుదైన రికార్డు నెలకొల్పింది. గత ఏడాదితో పోలిస్తే జంతువుల రెస్క్యూ కోసం వచ్చే కాల్స్ సంఖ్య 11 శాతం పెరిగినప్పటికీ, సిబ్బంది వేగంగా స్పందించి కాపాడుతున్నారు. అగ్నిప్రమాదాలు, బోనుల్లో చిక్కుకోవడం లేదా ఇతర ప్రమాదకర పరిస్థితుల నుండి ఈ మూగజీవాలను కాపాడటంలో DFS ముందుంటోంది.
#TALRadioTelugu #DelhiFireService #AnimalRescue #SavingVoicelessLives #HeroesInUniform #CompassionInAction #WildlifeRescue #AnimalWelfare #FirefightersHeroes #KindnessMatters #TALRadio #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాజర్షి షా దివ్యాంగ చిన్నారుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా AI ల్యాబ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ఇంటరాక్టివ్, సెన్సరీ లెర్నింగ్ మెథడ్స్ వంటి కొత్త టీచింగ్ మెథడ్స్ ను ప్రవేశపెట్టారు. ఈ ఏఐ సిస్టమ్ ద్వారా పిల్లలు కేవలం చూసి నేర్చుకోవడమే కాకుండా, సెన్సార్ల సాయంతో పాఠాలను సులభంగా అర్థం చేసుకునే వీలుంటుంది. సుమారు 15 లక్షల రూపాయలతో, ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్, జిల్లాలోని సుమారు 2,000 మందికి పైగా దివ్యాంగ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వనుంది.
#TALRadioTelugu #AILab #InclusiveEducation #SpecialNeedsEducation #EdTechIndia #AIforGood #DisabilityInclusion #AccessibleLearning #SensoryLearning #InteractiveEducation #Telangana #Adilabad #InnovationInEducation #FutureOfLearning #EducationForAll #TALRadio #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status
ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల కరణ్ కుమార్, ‘ఫినోబాడి’ (Finobadi) అనే స్టార్టప్ ద్వారా వ్యర్థాల నిర్వహణలో సరికొత్త మార్పు తీసుకొచ్చాడు. 2023 నుండి 2025 మధ్య కాలంలో ఏకంగా 450 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేసి, 70 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించారు. డిజిటల్ వెయింగ్ మెషీన్లను ఉపయోగించి, వారి ఆదాయాన్ని 30% వరకు పెంచడమే కాకుండా, ప్రతి 100 కిలోల రీసైక్లింగ్‌కు ఒక మొక్క చొప్పున ఇప్పటివరకు 3,318 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో తన బాధ్యతను నెరవేరుస్తున్నారు.
#TALRadioTelugu #wastemanagement #recycling #finobadi #youthentrepreneur #socialimpact #greeninitiative #sustainability #environmentprotection #startupindia #climateaction #circulareconomy #ecofriendly #inspiration #TALRadio #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ పరిసర గ్రామాల్లో పులుల దాడులు, తరచూ సంభవించే కార్చిచ్చుల (Forest Fires) మధ్య భయం భయంగా గడిపే ఈ ప్రాంతంలో చిన్నారులే ఇప్పుడు అడవికి అసలైన రక్షకులుగా మారుతున్నారు. పర్యావరణవేత్త భావనా మీనన్ నేతృత్వంలోని 'ప్రకృతి కి పాఠశాల' ద్వారా శిక్షణ పొందిన ఈ 'జూనియర్ ఫైర్ వాచర్స్'.. కేవలం అగ్ని ప్రమాదాలను ఆర్పడమే కాకుండా, అవి రాకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పులుల పట్ల ద్వేషాన్ని తగ్గించి, వన్యప్రాణులతో కలిసి జీవించడం (Co-existence) ఎలాగో పెద్దలకు చెబుతున్న ఈ బుజ్జి నేతలు.. భావి తరాలకు పర్యావరణ పరిరక్షణలో రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారు.
#TALRadioTelugu #JuniorFireWatchers #BandhavgarhTigerReserve #ForestProtection #ChildChangemakers #WildlifeConservation #CoexistenceWithNature #EnvironmentalEducation #NatureHeroes #SaveOurForests #InspiringIndia #TALRadio #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status
చిన్నారుల వ్యాక్సినేషన్ ప్రక్రియలో వంద శాతం ఫలితాలను సాధించడం కోసం యూపీలోని ఫతేపూర్ జిల్లా యంత్రాంగం ఒక స్మార్ట్ ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే 'స్మార్ట్ వ్యాక్సినేషన్ ట్రాకింగ్ సిస్టమ్'ను అందుబాటులోకి తెచ్చి, చిన్నారుల టీకాల పనితీరును రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా ఏఎన్ఎంల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించడమే కాకుండా, ఏఐ ఆధారిత వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా తల్లిదండ్రులకు టీకా సమయాన్ని కూడా గుర్తుచేస్తుంది.
#TALRadioTelugu #SmartHealthcare #ChildVaccination #AIinHealth #DigitalIndia #PublicHealthInnovation #VaccinationDrive #HealthTech #GoodGovernance #AIForGood #IndiaInnovates #GoodNews #TALRadio #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న కరువును తరిమికొట్టేందుకు ఐఎఫ్ఎస్ అధికారి వినీత్ కుమార్ మరియు ఆయన భార్య రూపక్ యాదవ్ ఒక అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టారు. 'అనంత నీరు సంరక్షణం' ప్రాజెక్ట్ పేరుతో, సుమారు 400 మంది గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ, పూర్తిగా ఎండిపోయి చెత్తాచెదారంతో నిండిపోయిన 11 నీటి వనరులను తిరిగి పునరుద్ధరించారు. కేవలం రూ. 10-15 లక్షల బడ్జెట్‌తోనే అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి, కోట్లాది లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసేలా చెరువులను తీర్చిదిద్దారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించడమే కాకుండా, చెరువుల చుట్టూ 7,000 మొక్కలను నాటి ఆ ప్రాంతాన్ని ఒక పచ్చని ఒయాసిస్సులా మార్చేశారు. వీరి కృషి వల్ల భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీళ్లు పడటంతో స్థానిక రైతులు మళ్లీ సాగు బాట పడుతున్నారు.
#TALRadioTelugu #WaterConservation #DroughtRelief #AnantapurProject #CommunityEffort #RainwaterHarvesting #PondRestoration #SustainableFarming #GreenOasis #GroundwaterRecharge #TreePlantation #RuralDevelopment #InspiringStories #EnvironmentProtection #IFSInitiative #VillageTransformation #GoodNews #TALRadio #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ ప్రాంతంలో దాదాపు 15,000 మంది సీనియర్ సిటిజన్‌లు ఉల్లాస్ (ULLAS - న్యూ ఇండియా లిటరసీ) పరీక్షకు హాజరై అందరికీ ఆదర్శంగా నిలిచారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం, 2030 నాటికి దేశంలో 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యాన్ని బలంగా ముందుకు తీసుకువెళుతోంది. సీనియర్ సిటిజన్‌లు చదువుకునే వయస్సు దాటినా, నేర్చుకోవాలనే తపనతో పరీక్షకు హాజరై, లిటరసీ అనేది కేవలం యువతకే కాదు, ప్రతి ఒక్కరికీ ముఖ్యమని నిరూపించారు.
#TALRadioTelugu #ULLAS #NewIndiaLiteracy #NEP2020 #LifelongLearning #SeniorCitizens #LiteracyForAll #EducationForEveryone #AgeIsJustANumber #InspiringIndia #LearningNeverStops #TALRadio #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్












