బుధ, గురువుల అనుకూలత.. ఈ రాశులకు ధన యోగాలు పట్టబోతున్నాయ్..!
Money Astrology 2025: ఈ నెల(అక్టోబర్) 3వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బుధుడు తులా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, తన స్వక్షేత్ర, మిత్రక్షేత్రాల తర్వాత బుధుడు బలంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించేది తన మిత్ర క్షేత్రమైన తులా రాశిలోనే. తుల వంటి సమతూకమైన రాశిలో బుద్ధి కారకుడు బుధుడు శుభ ఫలితాలనే ఎక్కువగా ఇస్తాడు. పైగా తులా రాశి బుధుడిని మిథున రాశి నుంచి గురువు వీక్షించడం వల్ల బుధుడు ఎక్కువగా ధన యోగాలు పట్టించడం జరుగుతుంది. మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు దాదాపు ప్రతి విషయంలోనూ చక్రం తిప్పే అవకాశం ఉంది.