పత్రికా ప్రకటన
రాజమహేంద్రవరం, తేది:20.7.2025
*ప్రజల భాగస్వామ్యం తోనే ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యం*
*ప్లాస్టిక్ వద్దు కాటనే ముద్దు"*
*"ప్లాస్టిక్ భూతం, పర్యావరణానికి హాని"*
- జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి*
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడానికి ప్రజలంతా కలిసి రావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం *స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర (ఎస్ఏఎస్ఏ) కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం లోని వై జంక్షన్ నుంచి సుబ్రహ్మణ్యం మైదానం వరకు జరిగిన "ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం" ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ.... ప్రతినెల ఒక్కో థీమ్ తో కార్యక్రమం ఎస్ ఎ ఎస్ ఎ కార్యక్రమాన్ని చేపడు తున్నామన్నారు. జూలై నెలలో "ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం" (End use of plastic) అనే ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పర్యావరణానికి సంబంధించి జరిగే అనర్ధాలు పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టినా, ప్లాస్టిక్ వినియోగాన్ని ఆశించిన మేర తగ్గించలేక పోతున్నామన్నారు. ఇకనైనా ఈ అంశంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇటువంటి కార్యక్రమాలు విజయ వంతమవుతుంద న్నారు చెప్పారు. బయటికి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు కాక జ్యూట్ బ్యాగులను, కాటన్ బ్యాగు లను వెంట తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ ను వినియోగిస్తున్న వారిపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ తనిఖీలు నిర్వహించి, జరిమానాలు విధిస్తోందని చెప్పారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన వస్తువులను మెప్మా ద్వారా అందుబాటు లో ఉంచినట్లు చెప్పారు. ఇటీవల రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు లభించిందని, ఈ అవార్డు మనకి రావడంతో మన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రమాణాలు మరింతగా పెరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్.వి. రామలింగేశ్వర్ మాట్లాడుతూ... ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వినియోగించ కుండా వెనక్కి తిరిగి ఇచ్చేస్తే వారికి నగరపాలక సంస్థ ప్రోత్సాహక బహుమతిని అందజేస్తుందని చెప్పారు. దీనికోసం జాంపేట జంక్షన్, వి ఎల్ పురం, దానవాయి పేటలో ప్రత్యేక ఔట్లెట్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వివిధ శాఖల సిబ్బంది "ప్లాస్టిక్ వద్దు కాటనే ముద్దు",
"ప్లాస్టిక్ భూతం, పర్యావరణ హాని" అనే నినాదాలతో రూపొందించిన ప్లకార్డులను చేబూని ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యాక్రమం లో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్.వి. రామలింగేశ్వర్
ఆర్ ఎం సి ఆరోగ్యాధికారిణి డా వి. వినూత్న, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
#East Godavari #rajahmundry #గోదావరి # మన రాజమండ్రి #❤️