22 సెప్టెంబర్ 1978
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.
నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ "ప్రేమ".
ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ...
కృతజ్ఞతలతో
మీ
చిరంజీవి🙏🙏🙏
#బై బర్త్ చిరంజీవి ఫ్యాన్🙏 # మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ #😎మెగాస్టార్ ఫ్యాన్స్ #🤩నా ఫేవరెట్ హీరో🤩 #🎞️సినిమా ప్రపంచం