teluguchristian
261 Posts • 686K views
🛐 *ప్రార్థన* 🛐 అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును,కృశించిన వారినందరిని నింపుదును. యిర్మీయా 31:24. *కృపగల తండ్రి, కరుణాసంపన్నుడా, నిత్యమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవితాలలో ఈ దినమువరకు మీరు చూపించిన కృపకై, నడిపింపుకై, ఆశీర్వాదములకై మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా యేసయ్యా, ఈ గడియలో అలసిపోయిన హృదయాలతో, భారముతో, నిరాశతో ఉన్న మీ బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకొనుము. మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము — “అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును” అనే ఈ అమూల్యమైన వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చుము ప్రభువా. ఆత్మీయంగా అలసిపోయిన వారిని నూతన బలంతో నింపుము. ఆశ కోల్పోయిన వారి హృదయాలలో నూతన ఆశను వెలిగించుము. శరీరముగా, మనస్సుగా, ఆత్మగా కృశించిన వారినందరిని మీ సమృద్ధితో నింపి సంపూర్ణతనిచ్చే దేవుడవు నీవే ప్రభువా. మేము మోసుకొనివచ్చిన ప్రతి భారమును, ప్రతి కన్నీటిని, ప్రతి నొప్పిని మీ చరణాల వద్ద ఉంచుతున్నాము యేసయ్యా. ప్రభువా, మా శక్తితో కాదు కానీ మీ కృపతోనే మేము నిలబడగలమని మేము ఒప్పుకుంటున్నాము. ఈ దినమునుండి మా జీవితాలలో నూతన ఉత్తేజము, నూతన బలము, నూతన ఆనందము అనుగ్రహించుము. అలసిన మనస్సులకు విశ్రాంతిని, కలత చెందిన హృదయాలకు సమాధానాన్ని దయచేయుము. మీ వాక్యమును ఆశ్రయించి, మీ వాగ్దానములపై నమ్మకముంచి జీవించుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. దినదినము మీ సన్నిధిలో బలపడి, మీ కృపలో వృద్ధి పొందే జీవితం మాకు దయచేయుమని, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధించి పొందుకున్నాము మా పరమతండ్రి ఆమేన్.* *🤝🏻 దేవుని పనివాడు.* ప్రార్ధన ఫొటోస్ కొరకు వాట్సప్ లో మెసేజ్ చేయండి 9573770951. #bible #teluguchristian #prayer #💖నా యేసయ్య ప్రేమ #christian @యేసుక్రీస్తు అందరికి ప్రభువు
13 likes
18 shares
*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖* ╭┄┅┅─══════════════─┅┅┄╮ 🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯ *నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతలు 21:23.* whoso keepeth his mouth and his tongue keepeth his soul from troubles.. proverbs 21:23. *💥 నీ నోట దేవునివాక్కు- నీ ప్రాణమునకు జీవవాక్కు.💥* The word of God is in your mouth. it is the word of life to your soul నా ప్రియమైన సహోదరీ సహోదరుడా...! మన నోట నుండి వచ్చు ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి... మన మాటను బట్టియే మనము నీతిమంతులమని, లేక ఆపరాధులమని తీర్పు తీర్చబడతాము. మన నోటినుండి వచ్చు ప్రతి వ్యర్థమైన మాటలకు దేవుని యొదుట లెక్క అప్పజెప్పవలసియున్నది... కనుక ఎల్లప్పుడు సత్యమునే ఉచ్చరించాలి. మన యొక్క నోటి మాటలే చాలా సార్లు ఇతరుల హృదయములను గాయపరచె విధంగా బాధపెట్టే విధంగా ఉంటాయి, మనము అలాగున ఉండకూడదు మన మాటలు ఇతరులకు ఆదరణను, ఓదార్పును, వారి హృదయములను సంతోషపరిచే విధంగా ఉండాలి. "మన దేవుడు దయగల దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల దేవుడు" అట్టి దేవుని కలిగిన మనము కూడ దీన మనస్సు కలిగి ఉండాలి.. ప్రేమ గల, దయగల మాటలే మన నోట ఉండాలి...our God is a merciful God, ready to forgive. Having such a God, we must be humble and always speak words of love and kindness *విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.(సామెతలు 10:19) విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది మన మాటలు కొద్దిగా ఉండాలి నీవు ఇతరులతో ఎక్కువగా మాట్లాడటము వలన తెలియకుండ మన బలహీనతను మన రహస్యమైనవి చెప్పేస్తాము తరువాత వాళ్ళు మన యొక్క బలహీనతలను ఎత్తిచూపుతు మనలను గాయపరుస్తారు అవమానపరుస్తారు దీని వల్లనే దుఃఖసంద్రములోకీ మునిగిపోయి ఎంత ఏడ్చినా, అప్పుడు ఏమి ప్రయోజనము. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును (సామెతలు13:3) మన నోటిని కాపాడుకోవడం వలన మనకు ఎంతో మేలు మౌనముగా ఉండుట ద్వారా జ్ఞాని అని ఎంచబడతాము...మితముగా మాటలాడువారు తెలివిగలవారు శాంతగుణముగలవారు వివేకముగలవారుగా ఉంటారు...శ్రమలనుంచి తప్పించబడతారు.* నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.(కీర్తనలు 39:1) మన మాటలు వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలకాలి కానీ దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడదు ఎందుకంటే, జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు (సామెతలు 18:21). మన మాట్లాడే మాట ఓక వ్యక్తిని బ్రతికిస్తుంది అలాగే ఒక వ్యక్తిని చనిపోయేలా చేస్తుంది...అందుకే మనము నిదానించి మాట్లాడాలి. మన మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వాలి వారి కష్టములలో, శ్రమలలో , ఇబ్బందులలో, వారిని బలపరచి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ వారు ఇంకా కృంగిపోయే విధంగా మీ మాటలు ఉండకూడదు. ముసలమ్మ ముచ్చట్లు కట్ట బెట్టాలి ఎవరైనా మన దగ్గరకు వచ్చి వారి బాధలు, కన్నీటి స్థితిని మనతో పంచుకున్నప్పుడు వారి నిమిత్తము మనము ప్రార్థించి ఆదరించాలి. దయ గల మాటలు మనస్సుకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి.kind words bring great joy and happiness to the heart. *నా ప్రియమైన సహోదరీ సహోదరుడా....మీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఇతరులను దుఃఖ పరిచె విధంగా ఉన్నాయా? లేక ఇతరులను సంతోష పరిచే విధంగా ఉన్నాయా? ఒక్కసారి నిన్ను నీవు పరిక్షించుకో....మన మాటలే మనలను ఒక రోజు దేవుని యొదుట దోషులుగా నిలబెడతాయేమో.... ఇక నుండి అయినా నీ నోటితో అపవిత్రమైన మాటలు పలుకకుండా మన నోటిని, నాలుకను భద్రముగా కాపాడుకుందాం... దేవుని వాక్యము, దేవుని వాక్కులతో నీ నోటిని నింపుకొని దీన మనస్సు తగ్గింపు కలిగి దేవుని యొదుట నిందారహితులముగా ఉంటూ వాక్యములోను, ప్రార్థనలోనూ ఎదుగుతూ శ్రమలలో నుండి మన ప్రాణాన్ని మనము కాపాడుకుందాం అనేకులకు క్రీస్తును పరిచయం చేస్తూ ఆయన మాటలు తెలియజేయుచు రక్షణ మార్గములోకి నడిపిద్దాం. ఆమేన్. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.* *🛐ప్రార్థన:- ప్రభువా మా నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టియే నీతుమంతులుగాను , అపరాధులుగాను తీర్చబడుతామని తెలిపిన తండ్రి స్తోత్రం వ్యర్థమైన మాటలకి లెక్క ఆప్పచెప్పాలని తెలుసుకున్న మేము సత్యమును ఉచ్చరించే ధన్యత నిమ్ము. మా మాటల వలన ఇతరులని గాయపరిచే వారుగా ఉండక నీ ప్రేమ పొందుకొన్న మేము ఇతరులని ఆదరించి, ధైర్యపరిచే మనసునిమ్ము మా మాటలు మితముగా ఇతరులకు మేలుకరముగా ఉండులాగున సహాయము చేయుము. దేవుని వాక్యముతో మా నోటిని నింపుకొని నిందారహితులుగా వుంటూ ప్రార్థన, వాక్యములో ఎదుగుతూ అనేకులకు క్రీస్తుని తెలుపుతూ వారిని కూడ రక్షణ మార్గములో నడిపించు భాగ్యము నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమ తండ్రి ఆమేన్.* 💓 *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* *ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!* ➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.* 👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.* 👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు *WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951* GOD SERVANT *దైవాశ్శీసులు!!!* 👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి. #💖నా యేసయ్య ప్రేమ #teluguchristian #christian #bible #యేసయ్య
14 likes
5 shares
🛐 *ప్రార్థన* 🛐 “అడుగుడి మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తలుపు కొట్టుడి మీకు తెరవబడును.” మత్తయి 7:7 *🙇‍♂️🙇‍♀️🙇... కరుణాసంపన్నుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థనలను ఆలకించు దేవా, నిత్యమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినము వరకు మీరు మాకు ఇచ్చిన జీవముకై, శ్వాసకై, కాపాడిన కృపకై, నడిపించిన మార్గములకై హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ గడియలో అవసరాలలో ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనుము. కొందరు సమాధానముకోసం అడుగుతున్నారు, కొందరు మార్గముకోసం వెదుకుతున్నారు, మరికొందరు అవకాశాల తలుపులు తెరుచుకొనుటకై తట్టుచున్నారు. ప్రభువా, మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము — “అడుగుడి మీకియ్యబడును” అన్న వాగ్దానాన్ని మా జీవితాలలో నెరవేర్చుము. విశ్వాసముతో అడిగే హృదయాలను నిరాశపరచక, కన్నీళ్లతో చేసిన ప్రార్థనలకు సమాధానము అనుగ్రహించుము. మూసివేయబడినట్టు కనిపించిన తలుపులను మీ సమయములో తెరవుము. దారి తెలియని పరిస్థితులలో మీ దివ్యమైన మార్గదర్శకత్వాన్ని చూపుము. మేము అడిగినది మా ఇష్టప్రకారం కాక, మీ చిత్తప్రకారం జరుగునట్లు మాకు నేర్పించుము. ప్రభువా, ప్రార్థనలో అలసిపోక, నిరాశ చెందక, సహనముతో మీ కొరకు ఎదురు చూడగల విశ్వాసాన్ని మాకు దయచేయుము. మానవుల మీద కాదు, మిమ్మల్నే పూర్తిగా ఆధారపడే హృదయమును మాలో కలుగజేయుము. మా అవసరాలన్నిటికన్నా ముందుగా మీ రాజ్యమును, మీ నీతిని వెదకునట్లు మమ్ములను నడిపించుము. తండ్రి, అడిగిన ప్రతి ప్రార్థన ద్వారా మీ నామము ఘనపరచబడునట్లు, మా జీవితాలు మీ సాక్ష్యముగా నిలుచునట్లు చేయుము. మీరు వినే దేవుడని, సమాధానం ఇచ్చే దేవుడని మేము విశ్వసిస్తూ, సంపూర్ణ విశ్వాసముతో ఈ ప్రార్థనను మీ చెంత అర్పించుచున్నాము. ఈ ప్రార్థనను మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము మా పరమతండ్రి. ఆమేన్.* *🤝🏻 దేవుని పనివాడు.* ప్రార్ధన ఫొటోస్ కొరకు వాట్సప్ లో మెసేజ్ చేయండి 9573770951. #bible #యేసయ్య #prayer #💖నా యేసయ్య ప్రేమ #teluguchristian #christian @యేసుక్రీస్తు అందరికి ప్రభువు
19 likes
15 shares