ఏకాదశి శుభాకాంక్షలు
14 Posts • 54K views
పుణ్యసమయం : ఉదయం 6.07 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు ___________________________________________ కన్యసంక్రాంతి అంటే సూర్యుడు కన్యారాశిలో #సంక్రమణం💐🎂 #కన్య సంక్రమణం #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #ఏకాదశి శుభాకాంక్షలు సంక్రమణం చేసే సమయం. సంకల్పం చెప్పుకునేటప్పుడు మనం మొదటిగా సంవత్సరం పేరు చెప్పుకుంటాం. తరువాత 44 అయనం, రుతువు, మాసం, పక్షం, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వరకూ ఇ) ఆరోజుకు, ఆ సమయానికి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెబుతాం. ఈ వరుసలో ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు అయనాలను నిత్యం మనం చెప్పుకుంటాం. ఇవి రెండూ సూర్యసంచారాన్ని బట్టి కర్కాటక, మకర రాశుల్లో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఏర్పడతాయి. మిగిలిన పన్నెండు సంక్రమణ కాలాలు కూడా పవిత్రమైన పుణ్యసమయాలను కలిగినవే. ప్రతి సంక్రాంతి ఏర్పడడానికి ముందు వెనుకల కాలంలో ఈ పుణ్యసమయం ఉంటుంది. ఈ సమయాల్లో దశవిధ దానాలు చేస్తే అక్షయ పుణ్యాలు లభిస్తాయి. వీటితో పాటు శక్తికొద్దీ షోడశదానాలు, గుమ్మడికాయ, నువ్వులు, ఆయా రుతువులలో లభించే శాకాలను కూడా దానంగా ఇవ్వవచ్చు. ప్రత్యేకించి కన్యసంక్రాంతికి వస్త్రదానం శ్రేష్టం. వెండి కూడా ఇవ్వవచ్చు. ___________________________________________ HARI BABU.G ___________________________________________ #🔯దోష పరిహారాలు🔯 .
15 likes
13 shares
ఇందిరా ఏకాదశి : ఇందిరా ఏకాదశినాడు ఉపవాసం, జాగరణ చేసినట్లయితే పితృదేవతలు తరిస్తారు. అశ్వమేధయాగంతో సమానమైన ఫలం కలిగిన ఏకాదశి ఇది. సత్యయుగంలో మాహిష్మతీ రాజ్యాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పాలించేవాడు. ధనధాన్య, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిన ఆయన విష్ణుభక్తుడు. ఒకసారి నారద మహర్షి ఆయనకు దర్శనమిచ్చి, యమలోకంలో బాధలు పడుతున్న ఇంద్రసేనుని పితరులను గురించి తెలియచేశాడు. అప్పుడు ఇందిరా ఏకాదశి వ్రతం చేయడం ద్వారా ఇంద్రసేనుడు తన పితరులకు సద్గతులు కలిగించాడు. సాధారణంగా ఏకాదశీ వ్రతవిధానంలో ఉపవాస, జాగరణలుంటాయి. ద్వాదశి ఘడియలు ముగియకముందే అన్నసంతర్పణ చేసి, ఆ తరువాత భోజనం చేయాలి. అయితే ఇందిరా ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశినాడు మాత్రం పితృతర్పణం, పిండప్రదానం కూడా విధిగా చేయాలి. __________________________________________ #📅 చరిత్రలో ఈ రోజు #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #ఏకాదశి #ఏకాదశి శుభాకాంక్షలు
21 likes
16 shares