P.Venkateswara Rao
435 views • 5 days ago
#పాలిటిక్స్🚏
*సేమ్… అప్పటి చంద్రబాబు పసుపు- కుంకుమ బాటలోనే మోడీ, నితిశ్…❗*
September 26, 2025🎯
పార్టీ నుంచి వోటరుకు ఇంత అని రేటు పెట్టి కొనుగోలు చేయడం పాత పద్ధతి… పక్కాగా ఖజానా నుంచే డబ్బులు బహిరంగంగానే చెల్లించి ప్రలోభపెట్టడం కొత్త పద్ధతి… ఈ పద్ధతి ప్రభావం పక్కాగా ఉండాలంటే ఎన్నికలకు కాస్త ముందుగా ప్రవేశపెట్టాలి…
ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరపెట్టినా సరే, ఇది ఆల్రెడీ అమల్లో ఉన్న పథకం అని చెప్పేయాలి… మళ్లీ మధ్యలో నాయకులు, కార్యకర్తలు కమీషన్లు తినకుండా… నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయాలి… పెద్ద ఎత్తున ప్రచారం, మీడియాలో వార్తలు, హడావుడి… ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదనే పేరు కూడా…
అవును, చివరకు మోడీ, నితిశ్ కూడా ఇప్పుడదే బాట… బయటికి ఏం చెబుతున్నా… బీహార్లో గెలుపు కోసం నానా పాట్లూ పడుతున్నది అక్కడ ఎన్డీయే ప్రభుత్వం… ఆల్రెడీ పెన్షన్ల పెంపు, 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు వంటివి ప్రకటించగా… తాజాగా 7500 కోట్లు ఖర్చయ్యే మరో పేద్ద పథకాన్ని ప్రారంభించారు…
ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన దీని పేరు… ఈరోజు మోడీ ప్రారంభించాడు… రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి నేరుగా పది వేల చొప్పున బదిలీ చేస్తుంది ప్రభుత్వం… ఎందుకయ్యా అంటే..? మహిళల స్వావలంబన, స్వయంఉపాధి కార్యక్రమాల కోసం అట… పది వేలతో స్వయంఉపాధి వ్యాపారాలు..!!
అబ్బే, ఇంతేకాదు… ఈ డబ్బుతో ఎవరైతే ఆరు నెలల్లో సక్సెస్ఫుల్గా స్వయంఉపాధి కార్యక్రమాలు, వ్యాపారాలు చేపడతారో, డెవలప్ అవుతారో… సమీక్షించి వాళ్లకు 2 లక్షల వరకూ భవిష్యత్తులో రుణంగా అందిస్తారట… ప్రతి కుటుంబంలో ఓ మహిళకు ఈ పది వేల సాయం… ఇది మళ్లీ చెల్లించేపని లేదు… వన్ టైమ్ సాయం… ఇక కృతజ్ఙతతో ఎన్డీయేకు వోట్లేసి తమ బాధ్యత నెరవేర్చాలన్నమాట…
కర్నాటక, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో సూపర్ సిక్స్ల పేరిట వాగ్దానాలు చేసి… వాటి అమలుకు నానా తిప్పలూ పడుతున్నాయి ప్రభుత్వాలు… సిలిండర్లు, ఉచిత విద్యుత్తు, ఫ్రీ బస్సు ఎట్సెట్రా… మోడీ, నితిశ్ ఇంకాస్త జోరు చూపిస్తున్నారన్నమాట… జీవిక దీదీ స్వయంసహాయ సంఘాల్లోని మహిళలకు ఈ పదివేల పంపిణీ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు…
నిజానికి మోడీకి జనాకర్షక విధానాలు పెద్దగా నచ్చవు… ఫ్రీ పందేరాలు ఇష్టపడడు… కానీ బీహార్లో పరిస్థితి టైటుగా ఉంది… అక్కడ గెలవకపోతే ఆ ప్రభావం దేశమంతా పడే ప్రమాదం కూడా ఉంది… అందుకని ఇక గేట్లు తెరిచేశారన్నమాట… అన్నట్టు, బీహార్లో మహిళా వోటర్ల సంఖ్యే ఎక్కువ…
మీకు గుర్తుందా..? సేమ్… 2019 ఎన్నికలకు ముందు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఉచితంగా పదేసి వేలను పసుపు కుంకుమ పథకం కింద ఇచ్చాడు… మూడు విడతలుగా… ఇప్పడు మోడీ కూడా అదే బాట… ఐతే చెప్పుకోవాల్సింది ఏమిటంటే..?
ఇలాంటి నగదు పంపిణీలను ప్రభుత్వం ఏ పేర్లతో ప్రవేశపెట్టినా చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడు… జగన్ అయితే చెప్పనక్కర్లేదు… బటన్లు నొక్కుతూ ఎడాపెడా భిన్న వర్గాలకు నగదు పంపిణీ చేస్తూ పోయాడు… ఈసారి జగన్ చంద్రబాబును మించిన దారుణ వోటమిని ఎదుర్కున్నాడు… ఎన్నికలకు ముందు జరిగే ఏ వోటర్ల ప్రలోభ పథకమైనా ఎదురుతన్నడం ఖాయమని గత అనుభవాలు చెబుతున్నాయి… ప్చ్, నితిశ్, మోడీలకు ఇది తెలిసినట్టు లేదు..!!
15 likes
10 shares