#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
🌸ఓం వ్యాసదేవాయ నమః🌸
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹*
*50. ఓం పరమజ్ఞాన ప్రదాయై నమః*
నేను దేహాన్ని కాదని తెలిపి, పరాభక్తిని ప్రసాదించినప్పుడు ఇక్కడ నేను ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి.
తనను మించినది మరేదీ లేనిది పరమజ్ఞానం. దేనిని తెలుసుకొన్న పిదప మరల ఈ ప్రపంచంలో తెలుసుకోదగినది మరొకటి లేదో అదే పరమజ్ఞానం. దానిని గూర్చి పరమాత్మ భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో వివరించారు.
పరమాత్మ కంటె వేరైనది ప్రపంచంలో లేనే లేదు. అంతా పరమాత్మ స్వరూపమే. పంచభూతాల సారం పరమాత్మే. సమస్త ప్రాణికోటులకు బీజ భూతుడు పరమాత్మే. (బీజం మాం సర్వభూతానాం విద్ధి). మాయచే ఆవరింపబడిన వారు ఈ సత్యాన్ని తెలుసుకోవటం లేదు.
భగవంతుని సేవించే వారు నాలుగు విధాలు. 1. ఆర్తుడు (ఆపదలో ఉన్నవాడు), 2. జిజ్ఞాసువు (పరమాత్మను తెలుసుకొనగోరే వాడు), 3. అర్థార్థి (సంపద కోరుకొనేవాడు), 4. జ్ఞాని (ఆత్మ జ్ఞానం గలవాడు). ఈ నలుగురిలో ఆత్మజ్ఞానం గలవాడు శ్రేష్ఠుడు. జ్ఞానియే తనకు మిక్కిలి ఇష్టుడని పరమాత్మ చెపుతున్నారు. జ్ఞానికి నిత్య యుక్తత్వం, ఏకభక్తి ఉంటాయి. సర్వ కాల సర్వావస్థలలో పరమాత్మతో కూడి ఉండుటయే నిత్య యుక్తత్వం. ఏకైక పరమాత్మయందు మాత్రమే భక్తి కలిగి ఉండుట ఏకభక్తి.
ఇంద్రియ నిగ్రహం, వాసనా క్షయం, ఆత్మానాత్మ వివేకం, నిది ధ్యాసన మొదలైనవి జ్ఞానయజ్ఞం అవుతాయి. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా జ్ఞానం యోగంగా మారుతుంది. జ్ఞానం కర్మలన్నింటిని భస్మీపటలం చేస్తుంది.
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే । 4.38
జ్ఞానం కన్న పవిత్రమైనది మరి లేదు. ఇట్టి పవిత్రమైన పరమజ్ఞానం నాకు ప్రసాదిస్తున్న గీతామాతకు వినమ్రతతో వందనం చేస్తున్నాను.
జై గురుదేవ్ 🙏