కాంగ్రెస్
1K Posts • 2M views
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జారె 📅 15.09.2025 (సోమవారం) అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా విధానం, వసతులు, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన నాణ్యత వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, నాణ్యమైన విద్య అందించి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల విషయంలో చిన్నపాటి అలసత్వం కూడా వహించరాదని సిబ్బందిని ఆదేశించిన ఎమ్మెల్యే గారు, పాఠశాలలో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
10 likes
13 shares
*బీసీ ధర్నాలో సందేశాత్మక పాటతో ఆకట్టుకున్న ఎమ్మెల్యే జారె* 06.08.2025 - బుధవారం బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ జరుగుతున్న మహా ధర్నాలో అశ్వారావుపేట ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సందేశాత్మక పాటను ఆలపించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్
11 likes
12 shares