@ మన సంస్కృతి @
58 Posts • 12K views
చంద్ర శేఖర్
2K views 14 days ago
#🇮🇳 మన దేశ సంస్కృతి #📜బతుకమ్మ కథలు🪔 #బతుకమ్మ శుభాకాంక్షలు #బతుకమ్మ #@ మన సంస్కృతి @ *_𝕝𝕝ॐ𝕝𝕝 21/09/2025 - బతుకమ్మ పండుగ : 1వ రోజు - ఎంగిలిపూల బతుకమ్మ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *_ఎంగిలి పువ్వుల బతుకమ్మ_* *≈≈≈━❀꧁ 🔆 ꧂❀━≈≈≈* బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలాంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు, ఇచ్చుకుంటారు.
15 likes
29 shares
చంద్ర శేఖర్
7K views 14 days ago
#@ మన సంస్కృతి @ #బతుకమ్మ #బతుకమ్మ శుభాకాంక్షలు #📜బతుకమ్మ కథలు🪔 #🇮🇳 మన దేశ సంస్కృతి *_𝕝𝕝ॐ𝕝𝕝 21/09/2025 - భాద్రపద అమావాస్యా - బతుకమ్మ పండుగ ప్రారంభం 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *_బతుకమ్మ పండుగ_* *━❀꧁ 🔆 ꧂❀━* *బతుకమ్మ పండుగ ఎలా మొదలైందో తెలుసా..?* ఈ రోజుతో తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ మొదలు కానుంది. ఒక మనిషికి, పకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదియ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి సేదతీరేవాడు. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక పకృతితో ఎలా కలుస్తాడు. బతుకమ్మ పండగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి పకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం. ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది: ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదలు కారాదనీ, కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు. ఈ పండుగను తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను ఆరాధించడం ఆనవాయితీ. *_తొమ్మిది రూపాల బతుకమ్మల పేర్లు_* 1. ఎంగిలిపూల బతుకమ్మ 2. అటుకుల బతుకమ్మ 3. ముద్దపప్పు బతుకమ్మ 4. నాన బియ్యం బతుకమ్మ 5. అట్ల బతుకమ్మ 6.అలిగిన బతుకమ్మ 7. వేపకాయల బతుకమ్మ 8. వెన్నముద్దల బతుకమ్మ 9. సద్దుల బతుకమ్మ (చివరిరోజు) 🌹🌺🌻🌼🌸🌼🌻🌺🌹
77 likes
86 shares
చంద్ర శేఖర్
457 views 15 days ago
#@ మన సంస్కృతి @ *లక్ష్మీకి ఉన్నంత గౌరవం సరస్వతికి లేదేమిటి*? *శ్లో౹౹ కేయురాణి న భూషయంతి పురుషం, హారాన చంద్రోజ్జ్వలా,* *న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలంకృతా ముర్ధజా౹* *వాణ్యేకా సమలంకరోతి పురుషం, యా సంస్కృతాధార్యతే,* *క్షీయంతే ఖిల భూషణాని సతతం, వాగ్భూషణం భూషణం౹౹* భావం:- భర్తృహరి చెప్పిన సుభాషితం ఇది. ఒక వ్యక్తికి చంద్రుని కాంతి, అంటే వెన్నెలతో సమానమైనటువంటి బంగారు ఆభరణాలు, స్నానం చేసి, ఒంటికి లేపనాలు పూసుకోవటం, శిరోజాలు చక్కగా దువ్వుకోవడం ఇటువంటి వన్నీ అలంకరణలు కావు, ఇవన్ని కొద్ది రోజులలో నశించేవే, కానీ శాశ్వతమైన భూషణం, సంస్కారం కలిగిన మాట ఒక్కటే అని ఈ సుభాషితం యొక్క అర్ధం. మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్న అవి ధరించినప్పుడు మాత్రమే అందాన్ని ఇస్తాయి. విద్య అనే ఆభరణం మనిషికి సదా ఆభరణంగా ఉండే కీర్తిని గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. *ధనవంతుడు తన ఊరికే గొప్పవాడు* * విద్యావంతుడు దేశానికే గొప్పవాడు * ధనంతో ఫలం కొనగలం! కానీ ఫలితాన్ని కొనలేం! లక్ష్మీ దేవి సరస్వతి కి అత్తగారు అవుతుంది కదా! అత్తగారి అధికారం ఎంతటిడైన కోడలి అధికారం తక్కువదేమీ కాదు. ధనం ఏ కారణంగానైనా తగ్గిపోవచ్చు. విజ్ఞానం నానాటికీ పెరగడమే కానీ తరిగిపోవడం ఉండదు. ధనాన్ని దాయాదులు భాగం పొందవచ్చు. విద్యను ఎవరు భాగం పంచుకో లేరు, ఎవరు దొంగిలించ లేరు, ఏనుగు ఎంత పెద్దది అయినా తొండం చిన్నదైనా దేని విలువ దానిదే మరి అవును కదా! ధనకాముజగత్తులో ధనవంతుడి భగవంతుడు. కానీ వివేక ప్రపంచంలో విద్యావంతుడు సృష్టికర్త. విజ్ఞాన జగత్తులో ప్రజ్ఞావంతుడు పరమాత్మ. మదంతో మేధస్సు రాదు. ధనంతో విజ్ఞానం రాదు. ఈనాడు మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ మేధా వంతులు విజ్ఞానులు ప్రసాదించిన వే కానీ ధనవంతులు ఇచ్చినవి కాదు. ఈ మాత్రం జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా విద్యావంతుల కి నమస్కరించి గౌరవిస్తాడు. *జ్ఞాన శక్తికి మించిన మరొక శక్తి ఈ జగత్తులో లేదు*. ఏడంతస్తుల మేడ కట్టిన తాను ఉండబోయేది తనకు కావాల్సింది ఆరు అడుగుల స్థలం మాత్రమే కదా అన్న జ్ఞానం కలిగిన వాడు తపన పడి పోతాడు తల్లక్రిందులు అయిపోతాడు. తనకు తానే గులకరాయిలా కనిపిస్తాడు. ధనం క్షణం కనిపించే మెరుపుతీగ. విద్య తన వారందరికీ వెలుగు చూపించి నడిపించే దారి దీపం. మెరుపు ఉన్నంత కాంతిదీపానికి ఉండదు. దీపానికి ఉన్న ప్రయోజనం మెరుపుకీ ఉండదు. డబ్బుతో మందులు కొనవచ్చు. వైద్యాన్ని కొనలేవు ఒకానొక సమయంలో వైద్యానికి కూడా కొనవచ్చు వైద్య విజ్ఞానని మాత్రం కొనలేవు. విజ్ఞానమే సరస్వతీమాత! ఎవరైనా భార్యను కొనగలరు తల్లిని మాత్రం కొనలేరు కదా! అజ్ఞాన వంతులు ఉన్నచోట సరస్వతి ఉండదు. అందుకే సరస్వతి మందిరాలు, సరస్వతి ఆలయాలు మనకు ఎక్కువగా లేవు. విద్యావంతుల హృదయమే సరస్వతి మందిరం ఆమెకు అదే తగిన స్థలం. 🙏🙏
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
15 likes
10 shares
చంద్ర శేఖర్
554 views 15 days ago
#@ మన సంస్కృతి @ *కుక్కలు కూడా ముట్టవని ఎందుకంటామో తెలుసా?* పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుండేవాడు. బ్రాహ్మణులు నిష్ఠాగరిష్టులై వేదాధ్యయనం చేస్తూ జనహితం కొరకు యజ్ఞయాగాలు తపాలు చేసేవారు. ఈ దేవశర్మ తద్విరుద్ధంగా ప్రవర్తించేవాడు. జూదం వ్యభిచారం మద్యపానం మాంసభక్షణ చేస్తూదుర్మార్గుల వెంట తిరుగుతూ భ్రష్టుడై సంచరించేవాడు. అటవిక వనితను పెండ్లాడి పిల్లలను కని వారి పోషణార్థం దొంగతనాలు చేసేవాడు. ఇలాంటి దేవశర్మ ఒకరోజు వేటకై అడవికి పోయినపుడు బాగా మదమెక్కిన ఏనుగు ఇతనిని తరమసాగింది. దానినుండి తప్పించుకోటానికి పారిపోయి ఓ మర్రిచెట్టు చాటున దాక్కొన్నాడు. ఆ బాగా ఊడలుదిగి మూడుయోజనాల వరకు వ్యాపించివుంది. ఎన్నో పశుపక్ష్యాదులు ఆ చెట్టు నీడన సేద తీరేవి. ఆ చెట్టుమీద నాడిజంఘముడనే పేరుగల కొంగ నివసించేది. నాడిజంఘముడు కొంగ అయినప్పటికి పూర్వజన్మ సుకృతంచేత మానవభాష అతనికి తెలుసు. విరుపాక్షుడనే రాజు ఈ కొంగకు మిత్రుడు. రోజు సాయంత్రం ఇద్దరు కలుసుకొని ఆధ్యాత్మిక చింతన చేసేవారు. నాడిజంఘమునికి పూర్వజన్మలో దేవేంద్రుడు మిత్రుడు కూడా. ఏనుగు భయంచే నక్కి వణికిపోతున్న దేవశర్మను నాడీజంఘముడు చూచాడు. సహజంగానే మంచివాడైన నాడీజంఘముడు ఆ బ్రాహ్మణుడి భయం పోగొట్టి ఆహారపానీయాలు ఇచ్చి యోగక్షేమాలు అడిగాడు. దేవశర్మ తాను తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నానని తన కష్టాలు తీరాలంటే ధనం కావాలని చెప్పాడు. నాడీజంఘముడు అతని పరిస్థితికి జాలిపడి రాజైన విరూపాక్షున వద్దకు వెళ్ళి తనపేరు చెప్పి కావాల్సినంత ధనం తెచ్చుకోమని చెప్పాడు. దేవశర్మ రాజును కలిసి తన పరిస్థితిని చెప్పుకొన్నాడు. దేవశర్మ అబద్ధాలు చెబుతున్నాడని ఆ రాజు సందేహించాడు. దేవశర్మను అనుమానించినప్పటికి ప్రాణమిత్రుడి మాట కాదనలేక అతను మోయనంత ధనాన్ని ఇచ్చి పంపాడు. కపట బ్రాహ్మణుడు మోయగలినంత ధనాన్ని తీసుకొని మిట్టమధ్యాహ్నానికి మర్రిచెట్టు వద్దకు చేరాడు. ఆ సమయంలో నాడీజంఘముడు విశ్రాంతి తీసుకొంటున్నాడు. దేవశర్మ ప్రయాణబడలికతో అలసిపోయి బాగా ఆకలిమీద ఉన్నాడు. తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని అటుఇటు చూచాడు. నిద్రపోతున్న కొంగతప్ప ఇతరాలు కనబడలేదు. అంతట ఆ బ్రాహ్మణుడు నాడీజంఘముడి మెడవిరచి చంపి కాల్చుకొని తిని ఆకలి తీర్చుకొన్నాడు. ప్రతిరోజు సాయంత్రం తన వద్దకు రావాల్సిన నాడీజంఘముడు రాకపోయేసరికి విరూపాక్ష మహరాజుకు అనుమానం వచ్చింది. కారణం కనుక్కొని రమ్మని భటులను పంపాడు. భటులు మర్రిచెట్టు వద్ద చిందరవందరగా పడివున్న కొంగఈకలను గుర్తించి ప్రమాదం జరిగిపోయిందని గ్రహించారు. అందుకు కారణాన్ని ఊహించి ప్రయాసపడుతూ ధనాన్ని మోసుకుపోతున్న దేవశర్మను బంధించి రాజు ముందర హజరుపరిచారు. దేవశర్మ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దేవశర్మను బంధించి వేటకుక్కలకు ఆహారంగా పడవేశాడు. దేవశర్మ మిత్రద్రోహి, కృతఘ్నుడని ఆ కుక్కలు గ్రహించి ఆకలిగా వున్నప్పటికి వాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విరూపాక్షుడు, కొంగకు కర్మకాండలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈకలను మిగిలిపోయిన ఎముకలను తెప్పించి చితిమీద పేర్చి నిప్పు అంటించాడు. అయినా నిప్పు అంటుకోలేదు. కర్మకాండల పూజకొరకు తెప్పించిన గోవును అక్కడ అప్పటికే వుంది.లేగదూడ తల్లి వద్ద పాలు త్రాగసాగింది. దూడమూతికి అంటిన పాల నురగ చితిపైనున్న ఈకలు ఎముకలపై పడింది. అమృతతుల్యమైన పాలనురగ పడగానే నాడీజంఘముడు లేచాడు, బ్రతికాడు. రాజు, పరివారం ఎంతో సంతోషించారు. మిత్రులిద్దరు గోమాతకు ప్రదక్షిణచేసి నమస్కరించారు. జరిగిన సంఘటనను తెలుసుకొని నాడీజంఘముడు ఆ బ్రాహ్మణుని క్షమించాడు. పరివర్తన చెందిన దేవశర్మ విద్యపై దృష్టినిలిపి వేదవేదాంగాలు చదివి నేర్చుకొని శిష్యసమేతంగా ఆ మర్రిచెట్టు సమీపంలో ఆశ్రమం ఏర్పాటుచేసుకొని బాటసారులకు అన్నార్తులకు సాయపడసాగాడు. కుక్కలు కూడా ముట్టవని మనం ఎందుకు అంటున్నామో అర్థమైంది కదా! అందుకే మిత్రద్రోహం చేయరాదు. చేసిన మేలును మరచి కృతఘ్నులుగా మారరాదు. చేసిన మేలును మరచిపోనివాడు కృతజ్ఞుడు. చేసిన మేలు మరచువాడు కృతఘ్నుడు.
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
15 likes
7 shares