సింహాచలం
25 Posts • 90K views
PSV APPARAO
621 views 5 days ago
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం #సింహాచలం దేవస్థానం 🙏🙏🙏💕💕 #విజయదశమి ప్రెస్ నోట్ శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం – సింహాచలం, విశాఖపట్నం జిల్లా శరన్నవరాత్రి ఉత్సవములు – విజయదశమి శమీ పూజా మహోత్సవము 30 సెప్టెంబర్ 2025 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీసింహాద్రి క్షేత్రములో ప్రతీ ఏటా జరిగే శరన్నవరాత్రి ఉత్సవములు ఈ సంవత్సరము 23-09-2025 నుండి 01-10-2025 వరకు విజయవంతంగా నిర్వహించబడుచున్నవి. ఈ శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా, 02-10-2025 (విజయదశమి) రోజున, శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా శ్రీరామ అలంకరణతో గోవిందరాజ స్వామి రూపంలో శోభాయాత్రగా కొండపై నుండి మెట్ల మార్గం ద్వారా గోవిందరాజ స్వామి సన్నిధి నుండి మధ్యాహ్నం 3.30 గంటలకు కొండ దిగువన గల పూలతోటకు వేంచేయబడును. అక్కడ సాయంత్రం ఘనంగా శమీ పూజా మహోత్సవము (జమ్మి వేట) నిర్వహించబడును. ఆ తరువాత స్వామివారి తీర్థప్రసాదములు భక్తులకు అందించబడును. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ పవిత్రమైన శమీ పూజ మహోత్సవములో పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదములను స్వీకరించవలసినదిగా భక్తులను ఆహ్వానించుచున్నాము. ప్రత్యేక సమాచారం: తేది 02-10-2025 (విజయదశమి) నాడు సాయంత్రం 6.00 గంటల నుండి స్వామివారి దర్శనాలు భక్తులకు లభించవు. తిరిగి 03-10-2025 ఉదయం 6.30 గంటల నుండి యథావిధిగా భక్తులకు దర్శనాలు ప్రారంభమగును. కావున పైన తెలిపిన వివరములు మీ దినపత్రికలు, టెలివిజన్ మరియు ఇతర మీడియా ద్వారా భక్తులకు తెలియజేయవలసినదిగా ప్రార్థన.
19 likes
10 shares
PSV APPARAO
717 views 1 months ago
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #సింహాచలం #సింహాచలం దేవస్థానం 🙏🙏🙏💕💕 శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం తేది: 08-08-2025 శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం నందు శ్రావణ మాసం సందర్భంగా శ్రావణమాస శుక్రవార విశేష పూజలు, శ్రావణమాసం మూడవ శుక్రవారమైన ఈ రోజు, శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష్మీ పూజ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో జంటలు పాల్గొని స్వామివారి కృప పొందారు. అలాగే, శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 5:00 గంటలకు అమ్మవారికి సహస్రనామార్చన నిర్వహించబడుతుంది. అనంతరం బేడా మండపం తిరువీధి కార్యక్రమం సాయంత్రం 6:30 వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడనుంది. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై అయ్యారు వారితోపాటు కార్యనిర్వాహణాధికా ఈవో త్రినాధ్ గారు పాల్గొని అమ్మవారి కృప పొందారు.
21 likes
11 shares