Failed to fetch language order
జై ఆంజనేయ
242 Posts • 506K views
*ఆంజనేయుని పూజలు-ఫలితం* ఆంజనేయ స్వామి విష్ణు భక్తుడు, రుద్రాంశ సంభూతుడు, సాక్షాత్తు పరమశివుడే మహావిష్ణువుకి సేవ చేయుటకు ఆంజనేయునిగా జన్మించాడు బ్రహ్మ చే వరాలు పొందిన వాడు .శ్రీ ఆంజనేయస్వామి వారిని ప్రతి నిత్యం పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయ. హనుమ కు మంగళ,శని వరాలు అంటే ఎంతో ప్రీతిపాత్రము.. ఇ రెండు రోజులు శ్రద్ద తో స్వామి వారిని కొలిస్తే విశేషామైన ఫలితాలు లభిస్తాయి. యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును. ఆంజనేయుణ్ణి స్మరిస్తూ చేస్తున్నందువల్ల శరీర రోగం రానితనం, మనసుకు ఏవిధమైన జడత్వం(నిరాశ నిస్పృహ) లేనితనం, మనసు చురుకుగా ఉన్నందువల్ల మాటల్లో గట్టిదనం. ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుణ్ణి స్మరించినందువల్ల లభిస్తాయి. *ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం* *బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహమ్* హనుమంతుడు అంటేనే... బ్రహ్మ,విష్ణు, శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టిస్థితి లయకారకుడని, రామదూత అని పేర్కొంటారు. ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే... ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. *🙏అభిషేకాలు🙏* హనుమంతుడికి వేటితో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి. తేనె - తేజస్సువృధ్ధి చెందుతుంది ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు చేకూరుతాయి. ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి చేకూరుతుంది. ఆవునెయ్యి -ఐశ్వర్యం విబూధితో - సర్వపాపాలు నశిస్తాయి పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి పంచదార - దు:ఖాలు నశిస్తాయి చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి. గరికనీటితో - పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహనాదులను తిరిగి పొందగలుగుతారు. అన్నంతో అభిషేకంతో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది. నవరత్నజలాభిషేకం - ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది మామిడిపండ్లరసంతో - చర్మ వ్యాధులు నశిస్తాయి. పసుపునీటితో - సకలశుభాలు, సౌభాగ్యదాయకం నువ్వులనూనెతో అభిషేకిస్తే - అపమృత్యు నివారణ. సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం ద్రాక్షారసంతో - జయం కలుగుతుంది కస్తూరిజలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది *🚩హనుమంతుడికి ప్రియం సింధూరం🚩* ఒకసారి సీతమ్మ తల్లి నుదుటనే సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయస్వామి. అమ్మా దేనికమ్మా సింధూరం ధరిస్తున్నావు? అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు అమ్మవారికి. సింధూరం ధరించడం వలన శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అని చెప్పింది. ఇందులో శ్రీరామచంద్రునకు మేలు జరుగుతుంది అనే మాట ఆంజనేయస్వామి మనస్సులో నాటుకుపోయింది. వెంటనే ఆంజనేయస్వామని శరీరమంతా సింధూరం పూసుకుని సభకు వెళ్ళాడు. అది చూసిన సభాసదులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామిని దగ్గరకు పిలిచి విషయం అడిగాడు. స్వామి జరిగిన విషయం చెప్పాడు. శ్రీరాముడు ఆంజనేయస్వామికి తన పట్ల భక్తికి సంతసించాడు. వెంటనే ఒక వరం కూడా ఇచ్చాడు. హనుమా ! మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభీష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు. తమలపాకులు దండ హనుమంతుడికి తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అశోక వనంలో ఉన్న సీతమ్మ తల్లికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు.. అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతోనే ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేసినట్లు చెబుతారు. అందుకే హనుమంతుడికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ #jai hanuman #🙏జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయ 🙏🏹 #జై ఆంజనేయ #శ్రీ ఆంజనేయం #sri anjaneyam
42 likes
63 shares