ఫ్రూట్స్
173 Posts • 104K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
716 views 1 months ago
అదరహో 'సీతాఫలం'.....* ---------------------- 🌷ప్రస్తుతం మార్కెట్‌లో సీతాఫలాలు విరివిగా దొరుకుతున్నాయి.సీతాఫలంలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. సీతాఫలంలో మూడు రకాలున్నాయి. సీతాఫలం, రామాఫలం, లక్ష్మణాఫలంగా వీటిని పిలుస్తారు. పోషక విలువల పరంగా చూస్తే ఈ పండులో ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా లభిస్తాయి. పండు తిన్న వెంటనే శక్తి లభిస్తుంది. 🌹100 గ్రాముల సీతాఫలంలో.. భోజ్యభాగం-45 శాతం, తేమ-68.6 గ్రాములు, కొవ్వు-1.6 గ్రాములు, కార్బోహైడ్రేట్లు -26.2 గ్రాములు, పీచు పదార్థాలు-2.4 గ్రాములు, కాల్షియం-398, పాస్ఫరస్-40, ఇనుము-0.3, విటమిన్ సి-16.థయామిన్-33, రైబోఫ్లోవిన్-44, నియాసిన్-1.3 మిల్లీ గ్రాములు ఉన్నాయి. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు, శస్త్ర చికిత్స జరిగిన తరువాత, గాయాలు మానుతున్న సమయంలో వీటిని తింటే ఎంతోమేలు జరుగుతుంది. సీతాఫలానికి చలువ చేసే గుణం ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మల బద్ధకాన్ని నివారిస్తుంది. వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. ఆజీర్తిని ఆరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. సీతాఫలాన్ని మిల్క్ ‌షేక్స్, ఐస్‌క్రీమ్, జ్యూస్ తయారీలో అధికంగా వినియోగిస్తారు. #తెలుసుకుందాం #🥗బలం & పోషక ఆహరం #ఫ్రూట్స్ #fruits #ఫ్రూట్స్
19 likes
7 shares