🚩ఏడుకొండల వాస🚩
36 Posts • 356K views
🙏💐 తిరుమల - పవిత్ర పుణ్యక్షేత్రం 💐🙏🌿 _________________________________________ తిరుమల ఏడు కొండలు ఎక్కడమంటే శరీర ప్రయాణం కాదు. ఇది ఒక ఆత్మ ప్రయాణం. అహంకారం నుండి ఆనందం వైపుకు సాగే మార్గం. ఇవి సాధారణ కొండలు కావు. అవి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీకలు. ఏడుకొండలు దాటడం అంటే మన అంతరంగం లోని ఏడు చక్రాలను అధిగమించడం. ఆ తర్వాత లభించేది ఆనందానుభూతి. ఇదొక ఆనందనిలయం బ్రహ్మ స్థానంలో వుంటుంది. అందుకే స్వామి వారు ఏడుకొండలపై వెలిశాడు. ఈ ఏడుకొండలకి ఒక్కొక్క అంతరార్థం వుంది. మహర్షులే పర్వతాలుగా అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. తిరుమలలోని చెట్లు , పుట్టలు , పక్షులు కూడా మహర్షుల అంశమే అని నమ్మకం. 🌿🙏💐🌳💚 మొదటగా మనం కొండమీదకు వెళ్ళేటప్పుడు మొదటి కొండ పేరు నీలాద్రి. దీనినే నీలాంబరి అని కూడా అంటారు. నీలాంబరి మొదటగా తలనీలాలు సమర్పించారు. అహంకార విసర్జన తలనీలాలకు ప్రతీక. 💐🌳💚🙏🌿💐🍀 (2) వృషభాద్రి :--- అంటే వృషభుడు (ఎద్దు) వేద ప్రమాణానికి సంకేతం. వేదమే ప్రమాణమని అంగీకరించిన వారు ఈ కొండ ఎక్కగలరు. 🍀💐🌿 (3) గరుడాద్రి:----- గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేసిన ఫలితంగా ఈ కొండ ఏర్పడింది. ఉపనిషత్తుల జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవడమే గరుడాద్రి భావం. 🌿💐🍀🙏💚🌳💜 (4) అంజనాద్రి :--- అంజనం అంటే కంటికి కాటుక. చూసే ప్రతి దానిలో బ్రహ్మాన్ని దర్శించడం. ఇదే అంజనాద్రి తత్వం. అంజనాదేవి తపస్సు ఫలితంగా హనుమంతుడు జన్మించాడు. 💜🌳💚🙏🍀💐🌿 (5) శేషాద్రి:---- సప్తగిరుల్లో ప్రధానమైన కొండ ఇది. శేషాద్రి అంటే బ్రహ్మము అని అర్థము. రాగ ద్వేషాలు లేని , భయము లేని స్థితి 🌿💐🍀🙏💚🌳 (6) వెంకటాద్రి:------ పాపాన్ని హరించేది అని అర్థం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన పవిత్రమైన కొండ. స్వామి సమక్షంలోనే సర్వ పాపనాశనం జరిగేది ఈ కొండపైనే .💚🙏🍀💐🌿❤️ (7) నారాయణాద్రి :----- నారాయణ మహర్షి తపస్సు చేసిన పర్వతం కావున ఈ నామం వచ్చింది. 🌿💐🍀🙏💚 _________________________________________ HARI BABU. G. ________________________________________ #✌️నేటి నా స్టేటస్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🚩ఏడుకొండల వాస🚩
9 likes
15 shares