Failed to fetch language order
భజన
20 Posts • 10K views
S.HariBlr (Bangalore)
782 views 13 days ago
#😇My Status #భజన #భజన ఎందుకు చేయాలి భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి.. సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది.పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.. అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు.. పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.. భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది.. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.. చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, భగవంతుని కృపకు పాత్రులవుతాం..!!
10 likes
14 shares