Video: సూపర్ క్యాచ్ పట్టిన శ్రేయస్ అయ్యర్..
తీవ్ర గాయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సూపర్ క్యాచ్ అందుకున్నారు. హర్షిత్ రాణా వేసిన బంతిని అలెక్స్ కేరీ గాల్లోకి ఆడగా.. శ్రేయస్ వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నారు. అయితే ఈ క్రమంలో కిందపడి నొప్పితో విలవిల్లాడారు. దీంతో మైదానాన్ని వీడారు. ప్రస్తుతం ఆసీస్ 34 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సిరాజ్, రాణా, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.
#💪భరత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది🏏