Vande Mataram written by Bankim Chandra Chattopadhyay
6 Posts • 3K views
sai 😊
907 views 2 months ago
#Vande Mataram written by Bankim Chandra Chattopadhyay *వందేమాతరం- అమ్మ నీకు వందనాలు* వందేమాతరం అన్న పిలుపు "అమ్మ" అనే పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తిని కలగజేస్తుంది. వందేమాతరం గేయం ఇది కేవలం ఒక పాట కాదు,అది ఒక జాతిని మేల్కొలిపిన శక్తి.ఆధ్యాత్మిక వేత్తలు దీన్ని 'సాక్షాత్తు ఋషి వాక్కు'గా విశ్లేషిస్తే,దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న విప్లవమకారులు దీన్ని "పోరాట స్ఫూర్తి గేయం"గా పరిగణించారు. దేశమాతకు అంకితమైన "వందేమాతరం" గీతానికి నవంబర్ 7వ తేదీకి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు పూర్తి వందేమాతరం నేర్చుకుందాం. వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. *ఈనెల 7న ఉ.10 గంటలకు దేశ ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలని కోరింది.* వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ గీతాన్ని 1875లో బంకించంద్ర ఛటోపాధ్యాయ రచించారు. 2025 నవంబర్ 7న భారతదేశం వందేమాతరం గీతానికి 150 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నది. చారిత్రక ప్రాధాన్యం వందేమాతరం భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. 1896లో కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి ఈ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్య్ర సమరయోధులు దీనిని సమర నినాదంగా, ఐక్యత మరియు త్యాగానికి ప్రతీకగా ఉపయోగించారు. వందేమాతరం "ఆనందమఠ్" నవలలో భాగంగా రాయబడింది.1950 జనవరి 24న భారత రాజ్యాంగ పరిషత్తు వందేమాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించింది. వందేమాతరం గీతం మన భారతదేశ ప్రజలు, వారి ఐక్యత, జాతీయ గౌరవానికి అద్భుతమైన గుర్తుగా నిలుస్తోంది.
6 likes
16 shares