అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు హరికృష్ణ హరే రామ 🙏🙏🙏🙏
21 Posts • 13K views
S.HariBlr (Bangalore)
1K views 1 months ago
#😇My Status #అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు హరికృష్ణ హరే రామ 🙏🙏🙏🙏 *నేనెందుకు భగద్గీత చదవాలి?* *భగవద్గీత సర్వమంగళకారిణి. సర్వసంశయ నివారిణి* *భగవంతునితో తనకు గల సంబంధాన్ని మరచిపోవడమే మనిషి దుఃఖపరంపరలో చిక్కుబడడానికి కారణం. సర్వమంగళ కారిణి, సర్వసంశయనివారిణి, సర్వార్ధ ప్రదాయిని అయిన భగవద్గీత జీవన సమరంలో మనిషికి తోడుగా నిలిచి విజయాన్ని చేకూర్చడానికే అవతరించింది. అర్జునుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనము. మనిషికి మనస్సు దేహము ద్వారా ఇతర జీవుల ద్వారా, దైవికముగా ఎన్నో కష్టనష్టాలు ఎదురౌతుంటాయి. వాటిని నిజంగా పరిష్కరించుకోవడానికి భగవద్గీత యథాతథాన్ని అనుసరించడము తప్ప అన్యోపాయము లేదు, భగవద్గీత యథాతథమును అనుసరిస్తూ జీవనయాత్ర చేసే బుద్ధిమంతుడు. శ్రీకృష్ణభగవానుడే దేవదేవుడని తెలసికొనినవాడై ఆతనికి శరణుపొంది సుఖశాంతులతో జీవించి జీవన సార్ధకతను పొందుతాడు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు సందేహాలకు భగవద్గీతలోనే సమాధానాలు ఉన్నాయి. దానికి ఉదాహరణంగా ఇక్కడ కొన్ని ప్రశ్నలను, వాటికి సమాధానాలు లభించే భగవద్గీత శ్లోకాన్ని ఉదహరించాము.*
16 likes
8 shares