కనక దుర్గమ్మ
71 Posts • 498K views
ప్రతీ రోజు ఉదయం స్నానం చేయగానే ఈ సప్తశతి శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించండి. అమ్మవారి ఆశిస్సులతో మీ ఇంట్లో నిత్యం ఆనందం తాండవిస్తుంది. 🙏🏵️🙏దుర్గా సప్తశతి స్తోత్రం🙏🏵️🙏 శివ ఉవాచ దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని | కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః || దేవ్యువాచ శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ | మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే || ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః | ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా | బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || 1 || దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి | దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || 2 || సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే | శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || 3 || శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే | సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || 4 || సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే | భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || 5 || రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ | త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || 6 || సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి | ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || 7 || ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణం || #విజయవాడ కనక దుర్గమ్మ #శ్రీ కనక దుర్గ దేవి #కనక దుర్గమ్మ #కనక దుర్గ #🔱విజయవాడ కనక దుర్గమ్మ
12 likes
7 shares
శ్రీ దేవీ భాగవతము.........!! అనేక కష్టనష్టాలు,బాధలు, ప్రమాదకర పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, దిక్కుతోచని నిస్సహాయ స్థితి,,, ఇలా అనేక దుర్భర పరిస్థితులనుండి, శ్రీ కనకదుర్గా మాత యొక్క తక్షణ అనుగ్రహంతో బయటపడటానికి, సులభమైన మార్గం, శ్రీ దేవీ భాగవత పారాయణం. అయితే, అమ్మవారి యొక్క శ్రీదేవి భాగవత పారాయణం చేయటానికి కానీ, చేయించటానికి కానీ, చాలా నియమాలు ఉన్నాయి. అటువంటి నియమాలతో, శ్రీ దుర్గామాత యొక్క దేవీ భాగవత పారాయణం చేయగలిగినా లేక సమర్ధులైన వారిచేత చేయించ గలిగినా మంచిదే. కానీ, అటువంటి అవకాశం లేని వారికి కూడా, పరమ దయామూర్తులైన వశిన్యాది వాగ్దేవతలు, మనకు ఒక సులభమైన ప్రక్రియను, శ్రీ లలితా సహస్రనామంలో మనకు చెప్పారు. వశిన్యాది వాగ్దేవతా మాతలు చెప్పిన ఆ ప్రక్రియ అందరికీ చాలా సులభ సాధ్యమైనది మరియు నియమాలతో కూడిన శ్రీదేవి భాగవతం పారాయణ వల్ల కలిగే సమాన ఫలితాన్ని ఇవ్వగలిగినది. శ్రీ దేవీ భాగవతంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పదమూడు అధ్యాయాలకు, వశిన్యాది వాగ్దేవతలు మనకు శ్రీ లలితా సహస్రనామంలో, శ్రీదుర్గా మాతయొక్క 13 నామములు చెప్పారు. ఈ 13 నామాలకు, సమిష్టిగా ఇంకొక నామం చెప్పారు. అలా, 14 నామాలకు ముందు మరియు చివరలో, శ్రీ మాత్రే నమః అన్న నామము కలిపి, ఈ పదహారు నామాలను,శ్రీ కనకదుర్గా అమ్మవారి ముందు పఠించి, వీలైతే, శ్రీ కనకదుర్గ పాయసాన్నప్రియాయై కనుక, అమ్మవారికి పాయసాన్నమును నైవేద్యం పెట్టగలిగితే, శ్రీదేవీ భాగవత పారాయణ ఫలితం వెంటనే లభించి, శ్రీదుర్గా మాతయొక్క అనుగ్రహంతో వారి వారి యొక్క సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ఆ 13 నామములు ఇవే.! 1)మహారూపా 2) మహాపూజ్యా 3) మహాపాతక నాశినీ 4) మహామాయా 5) మహాసత్వా 6) మహాశక్తి 7)మహారతిః 8) మహాభోగా 9)మహేశ్వర్యా 10) మహావీరా 11) మహాబలా 12)మహాబుద్ధి 13)మహాసిద్ధి 14) మహాయోగీశ్వరేశ్వరి. శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమో నమః #🔱విజయవాడ కనక దుర్గమ్మ #విజయవాడ కనక దుర్గమ్మ #కనక దుర్గ #కనక దుర్గమ్మ #శ్రీ కనక దుర్గ దేవి
10 likes
21 shares