🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
391 Posts • 664K views
sivamadhu
998 views 3 months ago
#🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (03.10.2025) శ్రీవారి భాగసవారి ఉత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా సాయంత్రం బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ మలయప్ప స్వామి వారు, మరో బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ దేవి భూదేవి ఉత్సవర్ల పురిశైవారి తోటకు వేంచేపు చేశారు. అనంతరం దివ్య గోష్ఠి గానం అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారు అప్రదక్షిణంగా ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ దేవి భూదేవి అమ్మవార్లు ఆలయంకు చేరుకున్నారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
11 likes
6 shares
sivamadhu
961 views 3 months ago
#🔱తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు #📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన తొమ్మిదో రోజు (02.10.2025) ఉదయం శ్రీ వరాహ స్వామి వారి ముఖ మండపంలో స్నాన పీఠంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీ సుదర్శన చక్రాళ్వార్ ఉత్సవర్లకు బ్రహ్మోత్సవ స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
16 likes
11 shares