నేటి ప్రపంచంలో జరుగుతుంది ఇదే...😇
170 Posts • 6K views
👉పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.! భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.! సహజీవనాన్ని సంసారమంటున్నారు.! గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.! డూప్ ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు.! పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.! ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.! సరదాలను సంస్కృతి అంటున్నారు.! భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.! కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.! ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.! మందు పోయిస్తేనే... మిత్రుడు అంటున్నారు.! కట్నం తెస్తేనే... భార్య అంటున్నారు.! సొమ్ములు తెస్తేనే... సంసారం అంటున్నారు.! కాసులు తెస్తేనే... కాపురం అంటున్నారు.! నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.! సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.! అసత్యాలు మాట్లాడితే... బ్రతక నేర్చిన వాడంటున్నారు.! నిజం పలికితే... బ్రతక నేర్వని వాడంటున్నారు.! న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.! అన్యాయంగా బ్రతికినా... ఎంచక్కా ఉన్నాడంటున్నారు.! అన్యాయాన్ని ఎదిరిస్తే... అతనికెందుకు అంటున్నారు.! నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.! మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.! మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.! *టెక్నాలజీ పెరిగింది... *సౌకర్యం పెరిగింది... * విలాసం పెరిగింది... *విజ్ఞానం పెరిగింది... * కాలుష్యం పెరుగింది... * ఖర్చు పెరిగింది... *కల్తీ పెరిగింది... * రసాయన బంధం పెరిగింది... * అన్నీ పెరిగాయి... కానీ...పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు.. మన ఆయుష్ ప్రమాణం మాత్రం 40% పైగా తగ్గింది సర్వేజనా సుఖినోభవంతు* 🙏🙏🙏🙏🙏 #🗣️జీవిత సత్యం #sad reality of life😔 #నేటి ప్రపంచంలో జరుగుతుంది ఇదే...😇 #నేటి లోకం తీరు...!! #నేటి ప్రపంచం 😠
12 likes
6 shares
భరణం అనే ఈ ఒక్క పదం లేకుండా, కేవలం విడిగా బ్రతకమని కోర్టులు ఆర్డర్లు ఇవ్వటం జరిగితే,ఇన్ని డివోర్స్ కేసులు నమోదు అవుతాయా? పెళ్ళి అనేది ఒక వ్యాపారం అయితే,విడాకులు అనేది ఇంకొక వ్యాపారం అయింది.. పెళ్ళికి ముందు వరుడికి కట్నం,అత్తకు,ఆడబిడ్డలకు,మిగతా "సంత" కు లంచాలు అనే పదానికి పాలిష్ పెట్టి,నగిషీలు చెక్కి, లాంఛనాలు అనే పేరిట దోపిడీ చేసే ఫేజ్ ఒకటి అయితే,గృహ హింస,మెయింటైనన్స్,విడాకులు,భరణాలు లాంటివి ఇంకొక వ్యాపారం అయింది.. వరకట్నం ఇచ్చుకున్న రోజుల్లో అల్లాడిన అమ్మాయిల తల్లితండ్రులు ఎందరో...వారికి ఉపశమనంగా,భరణాలు,గృహహింసల పరిహారాల రోజులు వచ్చాయి.. అబ్బాయికి పెళ్ళి చేయటం అంటే,పిల్లాడి తల్లిదండ్రులు,తోడబుట్టిన వారూ వణికిపోతున్నారు..... వరకట్నం అనేది కొన్ని వందల సంవత్సరాలకు పైగా అమ్మాయిల తల్లితండ్రులకు అమ్మాయిని కన్నందుకు వేసిన శిక్ష.... ఇది ఇప్పుడే మొదలైన అబ్బాయిల కుటుంబాలకు లభిస్తున్న రిటర్న్ గిఫ్టులు...ఇది కూడా కొన్ని వందల సంవత్సరాలు అనుభవించి తీరాల్సిందే... అప్పుడు అమ్మాయిని కనటం,తమ స్థాయికి తగిన వాడిని వెతికి పెళ్ళి చేయాలనే ఆశ పడటం అమ్మాయి తల్లిదండ్రుల నేరం అయితే,ఇప్పుడు అబ్బాయిలను కనటం,వారికి పెళ్ళి చేయాలనుకోవటం నేరం... అప్పట్లో వరకట్నం అనే పేరుతో,పిల్లగాడు పుట్టిన నాటి నుంచి వాడికి వాడిన "డైపర్ ఖర్చుల" నుంచీ లెక్కలు రాసి పెట్టుకుని అమ్మాయి తండ్రి నుంచి వసూలు చేసుకున్నప్పుడు లేని సిగ్గు,ఇప్పుడు భరణం పేరిట వసూలు చేసుకోవటానికి ఎందుకు ఉండాలి? వరకట్నాలు తీసుకోవటం అప్పట్లో ట్రెండ్..విడాకులు,భరణాలు,గృహహింసల పరిహారాలు ఇప్పటి ట్రెండ్... నూటికి ఒకరో,ఇద్దరో ఆ రోజుల్లో కట్న కానుకలు లేకుండా తమ కొడుకులకు పెళ్ళిళ్ళు చేస్తే,నూటికి ఒకరో,ఇద్దరో నేడు విడాకులు భరణాలు అనకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది... సమాజంలో ఉన్నప్పుడు కొందరు చేసే దానికి అందరూ శిక్ష అనుభవించాల్సిందే..... 😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐😐 #💗నా మనస్సు లోని మాట #sad reality 💔 #sad reality of life😔 #నేటి ప్రపంచంలో జరుగుతుంది ఇదే...😇 #నేటి లోకం తీరు...!!
14 likes
13 shares