📣సెప్టెంబర్ 16th అప్‌డేట్స్📰
716 Posts • 1M views
🇮🇳mahender📰🗞️🗞️
1K views 1 months ago
రోడ్లపై యాపిల్స్ను పడేస్తున్న రైతులు.. ఎందుకంటే? జమ్మూ కశ్మీర్ లో కురిసిన భారీ వర్షాలు అక్కడి యాపిల్ రైతులను పూర్తిగా దెబ్బతీశాయి. వర్షాల కారణంగా శ్రీనగర్-జమ్మూ హైవే మూతపడడంతో రైతులు వాటిని రవాణా చేయలేకపోతున్నారు. దీంతో ట్రక్కుల్లోనే యాపిల్ పండ్లు కుళ్లిపోతున్నాయి. మరోవైపు 2-3 రోజులుగా యాపిల్ క్రయవిక్రయాలు కూడా నిలిచిపోవడంతో రోడ్ల వెంట, మార్కెట్లలో పారబోస్తున్నారు. కాగా కశ్మీర్ నుంచే దాదాపు 80 శాతం యాపిల్స్ దేశం మొత్తానికి సరఫరా అవుతున్నాయి #📣సెప్టెంబర్ 16th అప్‌డేట్స్📰 #సెప్టెంబర్ 17th అప్‌డేట్స్📰 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
7 likes
10 shares
🇮🇳mahender📰🗞️🗞️
881 views 1 months ago
డెహ్రాడూన్లో క్లౌడ్ బరస్ట్.. 32cmల వర్షపాతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు 32.5cm వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. భారీగా వరద పోటెత్తడంతో షాపులు, కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు స్థానిక నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు దెబ్బతినగా రాకపోకలు నిలిచిపోయాయి. #📣సెప్టెంబర్ 16th అప్‌డేట్స్📰 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🌨️వాతావరణ అప్‌డేట్స్
6 likes
5 shares