మన భారతదేశంలో అప్పుడే పుట్టిన ఆడపిల్లలను,బాల బాలికలను ఆలయంలో దేవతకు దేవదాసిగా అర్పించేటటువంటి ఒక నీచమైన ఆచారం నుండి రక్షించడానికి దేవుడు పంపిన గొప్ప వీర వనిత.తల్లి లేని వారికి తల్లిగా మారి గొప్ప సేవ చేసిన సేవకురాలు ఎమీ కార్మైకెల్.
* ఎమీ కార్మైకెల్ 1867 లో ఐర్లాండ్ లో సంపన్న కుటుంబంలోని డేవిడ్ కార్మైకెల్ మరియు కాథరిన్ గార్లకు పెద్ద కూతురిగా జన్మించింది.
* ఎమీ నాన్నగారు కొన్ని ఫ్యాక్టరీలకు అధిపతి.అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో తన ఫ్యామిలీని బేల్ ఫాస్ట్ కు మార్చారు.అక్కడికి వెళ్ళిన రెండేళ్ల తరువాత ఎమీ నాన్నగారు చనిపోయారు.
* ఆ తరువాత వారు ఎన్నో ఇబ్బందులు పడసాగారు.కానీ ఏమీ కార్మైకెల్ ను దేవుడు నెమ్మదిగా తన సేవకై సిద్దపరిచారు.
* వారి ప్రాంతంలో చాలా పేదవారైన షాలిస్ మధ్య దేవుడు ఎమీని వాడుకోవడం ప్రారంభించారు.వీరికి సరైన ఆహరం మరియు చలి నుండి కాపాడుకోవడానికి టోపీలు కూడా ఉండేవి కాదు గనుక షాల్వాలు కప్పుకునేవారు.అందుకే వీరిని షాలిస్ అని పిలిచేవారు
* ఎమీ షాలీస్ వారికి దేవుని సువార్త చేసి రక్షణలో నడిపించింది.అక్కడ 500 మంది కూర్చునే ఒక చర్చ్ కట్టడానికి ఈమె ఎంతో కృషి చేసింది.
* ఎమీకి దేవుని కొరకు ఎదో ఒకటి చేయాలనే తపన చాలా
#GOD IS LOVE