_*🪷🌹🔱🙏"అమ్మ అనుగ్రహం -ఆధ్యాత్మిక విజయం" శివలోకం మీ కోసం....*_
🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱
సమస్త విశ్వానికి కారణమై, చాలకమై ఉన్న పరతత్వాన్ని 'పరమేశ్వరుడు' అని సనాతన ధర్మం పేర్కొంది. ఆ పరమేశ్వరుడొక్కడినే సృష్టి, స్థితి, లయలు అనే మూడు క్రియల్లో బ్రహ్మ విష్ణు రుద్రులుగా చెబుతారు. ఆ పరమేశ్వరుడు ఏ శక్తితో ఈ విశ్వ గమనాన్ని నిర్వహిస్తున్నాడో దాన్నే పరాశక్తి, ఆదిశక్తి, జగన్మాత... అని వేదానిశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. నిజానికి పరమేశ్వరుడికి, ఈ శక్తికి భేదం లేదు- సూర్యుడికి కాంతి లాగా, చంద్రుడికి వెన్నెల లాగా. అందుకే ఈ శక్తిని కూడా 'పరమేశ్వరి' అంటారు.
🌹ఈశ్వరుడు త్రిమూర్తులు అయినట్లే, శక్తి సైతం ముగ్గురమ్మలుగా వ్యక్తమైంది. ఈ మూడు రూపాలే కాక- అన్నప్రదాయిని అన్నపూర్ణగా, కాలశక్తి కాళిగా, రక్షణ శక్తి దుర్గగా, గ్రామాలను ఏలే గ్రామ దేవతలుగా, ఉగ్రశక్తి చండిగా, సౌమ్యశక్తి భవానిగా... ఎన్నో రూపాలతో వ్యక్తమవుతోంది. ఎన్ని 'పేర్లతో, రూపాలతో ఉన్నా శక్తి ఒక్కటే. శరన్నవరాత్రుల్లో ఈ శక్తినే వివిధ క్షేత్రాల్లో వేర్వేరు దేవతలుగా ఆరాధించడమే కాక, చాలామంది గృహాల్లోనూ ఉత్సవాలుగా అర్చన చేస్తారు. నవమి పూజ అయ్యాక, సాయంకాలం దశమి తిథి ఉన్నప్పుడు 'విజయదశమి' ని ఆచరిస్తారు. శరత్కాలం ఆశ్వయుజ శుద్ధదశమి కలిగిన సంధ్యాకాలాన్ని 'విజయ దశమి' అంటారు.
🌹 జయ, విజయ, అజిత, అపరాజిత... అనే నాలుగు రూపాలతో 'విజయశక్తి' ప్రకాశిస్తుంది. అంతర్గత, బహిర్గత శత్రువులపై గెలుపునే జయ, విజయ- అని నిర్వచించవచ్చు. ఎక్కడా ఓటమినెరుగని శక్తినే అజిత అపరాజిత అనే రెండు నామాలుగా చెబుతారు.
🌹ఈ విజయం అసురశక్తులపై దేవత్వం సాధించినది.. విజయం దివ్యత్వానికే సిద్ధించాలి. ప్రకృతి హితం లోకక్షేమం, సత్యం, అహింస, శౌచం, నీతి, నిగ్రహం, సామరస్యం, సౌమనస్యం... ఈ దివ్య భావాలకు ప్రతిష్టు లభించడమే విష్యత్వ సిద్ధి, విశ్వ నిర్వహణ శక్తి దేవతల పక్షాన యుద్ధం చేసి, దుష్టులను శిక్షించడంలో సంకేతమిదo వ్యక్తిలో, సమాజంలో అసురవృత్తులు తొలగి, దైవీ ప్రవృత్తులు నెలకొనాలనే సంకల్పమే ఈ ఉత్సవాల పారాయణలకు, పూజలకు, హోమాలకు పరమార్థం, ఆసేతు శీతాచలం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిలో ఈ దేవీ పూజలు నిర్వహిస్తారు.
🌹 కలశంలో, విగ్రహంలో, పుస్తకాల్లో దేవిని ఆవాహన చేసి అర్చించడం సంప్రదాయం. జ్ఞానశక్తి సరస్వతిగా, ఐశ్వర్యశక్తి లక్ష్మిగా ఆర్తత్రాణశక్తి గౌరిగా... ఈ మూడూ ఏకమైన మూలశక్తినే జగదాంబగా కొలుచుకుంటారు. అనేక దేవాలయాల్లో మూల విగ్రహానికి రోజుకొక దేవీ ఆకృతిగా అలంకరణ చేస్తారు. పదిరోజుల పది ఆకృతులు ఒకే తల్లివి.. అనే భావన ఇందులో గోచరిస్తుంది. దేవీ పురాణాల ప్రకారంగా రామకథ, కృష్ణ-పాండవ గాథ కూడా ఈ పర్వంతో ముడివడి ఉన్నాయి. లోక కంట శక్తుల అపజయం, క్షేమంకర శక్తుల విజయం 'రామలీల' వంటి ఉత్సవాలుగా పలుచోట్ల నిర్వహిస్తారు.
🌹తొమ్మిది రాత్రులు పూర్ణత్వానికి ప్రతీకగా, సంపూర్ణశక్తి అనుగ్రహాన్ని కలిగించే పండుగగా దేశ సంస్కృతిలో ముఖ్యమైనదిగా భాసించడం విశేషం. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు అనేక శక్తిపీఠాలతో అలరారే భారతావనిలోని శక్తిక్షేత్రాలన్నీ ఉత్సవార్చనలతో కళకళలాడుతుంటే, భక్తజనుల హృదయాలే శక్తి - పొందుతాయి.కేంద్రాలై అమ్మవారి స్మరణతో ధన్యతను పొందుతాయి.
🪷🌹🙏🪷🌹🙏🪷
మీ... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ