fire accident
17 Posts • 11K views
Dundigalla Venu Guptha
1K views 2 months ago
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విహారి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి హైదరాబాద్ బీరంగూడ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కొండాపురానికి విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు NL 01 B 3250 బయలుదేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాగానే బస్సు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును పక్కకు ఆపాడు. బస్సులో మంటలు వ్యాపిస్తుండగానే కేకలు వేస్తూ ప్రయాణికులు బస్సు నుండి ప్రాణాలతో బయట పడ్డారు. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులు తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయట పడ్డారు. #accident #fire accident #news
10 likes
7 shares
Dundigalla Venu Guptha
1K views 2 months ago
బ్రేకింగ్‌ మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఆర్టీసీ బ‌స్సులో ప్రమాదం విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం ఉదయం 7.45 కు ఆంధ్రా-ఒడిశా ఘాట్‌రోడ్డులో ప్రమాదం డ్రైవర్‌ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో తప్పిన ప్రాణనష్టం. ఘటనాస్థలికి చేరుకొని బస్సులో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది #accident #bus accident #fire accident #news #వార్తలు
16 likes
14 shares