గతమేంతో ఘనకీర్తి గల బనగానపల్లె నవాబుల బంగ్లా నేడు శితిలావస్థకు చేరుకున్న దయనీయ స్థితి!
లేదా
దాదాపు 400 ఏళ్ల గొప్ప చరిత్రకు,నవాబుల ఏలుబడికి ప్రత్యక్ష సాక్షం ఈ బనగానపల్లె నవాబుల కోట!
దాదాపు 400 సంవత్సరాల గొప్ప చరిత్ర గల నవాబుల దర్పానికి,తేజస్సుకు,రాజసానికి సాక్షిభుతంగా నిలిచిన నంద్యాల జిల్లాలోని ఈ బనగానపల్లె నవాబుల కోట నేడు ఆలన పాలన కరువు అయ్యి పట్టించుకునే వారు లేక ఈ నవాబుల కోట చివరకు శిథిలావస్థకు చేరుకోవడం అత్యంత బాధాకరమైన విషయం.ఎందుకంటే నంద్యాల జిల్లా లోనే ఓక అందమైన,అపురూప కట్టడంగా తన ప్రత్యేకతను,గుర్తింపును గత అనేక సంవత్సరాలుగా నిలుపుకుంటూ వస్తున్నది ఈ నవాబుల కోట.ఇది ఇలా వుంటే ఈ నవాబుల బంగ్లాకు సంబంధించి ఇప్పటికే బంగ్లా స్లాబ్ పై కప్పు సగానికి పైగా దెబ్బతినిపోయి మిగతా భాగం కూడా దెబ్బ తినేందుకు సిద్ధంగా ఉండటం అనేది ఓక అత్యంత దురదృష్టకరమైన విషయం.ముఖ్యంగా ఈ నవాబుల కోట యొక్క చరిత్రను ఒక్కసారి సింహాలోకనం చేసుకుంటే 1601లో భీజాపూర్ సుల్తాన్ ఇష్మాయిల్ అదిల్ షా ఈ బనగానపల్లె కోటను అప్పటి రాజానంద చక్రవర్తిని ఓడించి మరీ తన స్వాధీనం,వశం చేసుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని,కోటను విజయం సాధించిన సేనాపతి సిదు సంబల్ అధీనం లో 1665 వరకు ఉండేది.అయితే ఇప్పటికి ఆ కాలం నాటి నవాబుల వారసుల అధీనంలో ఈ చారిత్రాత్మిక కోట ఉన్నప్పటికీ వారు అత్యంత పేదరికం లో మగ్గుతుండటంతో వారు పొట్ట నింపుకునేందుకు మరియు దాని అభివృద్ధి కోసం అక్కడికి చూసేందుకు వెళ్లే ప్రతి మనిషికి 20 / - రూపాయలను వసూలు చేస్తుండటం అనేది ఆ నవాబుల కోటకు పట్టిన దుర్గతికి,దుస్థితికి, దిగజారిపోయిన నవాబుల వారసుల వారి ఆర్థిక స్థితిగతులకుకి ఓక కారణభూతంగా చెప్పవచ్చు. అలాగే ఆ బంగ్లా స్లాబుకు వాడిన ఇనుప గరండాలు తుప్పుపట్టి క్షిణించడం,టేకు తీర్లు పనికిరానివిగా మారిపోవడం ఆ బంగ్లా యొక్క దారుణ పరిస్థితికి అద్దంపడుతున్నది. అన్నింటికీ మించి ఈ అరుదైన నవాబుల బంగ్లా యొక్క ప్రత్యేకతను గురించి చెప్పాల్సి వస్తే సూపర్,డూపర్,బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ ' అరుంధతి ' సినిమా షూటింగ్ ను కొంత భాగం ఈ కోటలో తీయడం అనేది ఓక ప్రత్యేక,అమితాశక్తి కలిగించే విషయంగా చెప్పవచ్చు.అందుకే అప్పటి నుంచి ఈ నవాబుల కోట కాస్త ' అరుంధతి కోటగా ' ఆ ప్రాంతానికి సంబందించిన ప్రజలు పిలువడం జరుగుతున్నది.అదేవిధంగా ఆనాటి కాలంలోని ఈ నవాబుల బంగ్లా గురించి రెండు కథనాలు మనకు అందుబాటులో వున్నాయి.అందులో ఓకటి అప్పటి నవాబులు వేసవి విడిదిగా ఈ బంగ్లాను వాడుకునే వారని,మరొకటి నవాబు తన ప్రియురాలి కోసం ఈ బంగ్లా నిర్మించారని ఇప్పటికి చెప్పుకుంటూ వుంటారు.
ఏదిఏమైనా ప్రస్తుత తరాల వారు, రాబోయే తరాల వారు ఈ చారిత్రాత్మిక, ముగ్దమనోహరమైన,చూపరులను కనువిందు చేసే ఈ నవాబుల బంగ్లాను చూసి ఆనందించేందుకు, ఓక మధుర జ్ఞాపకంగా తమ మదిలో పదిలపరచుకునేందుకు ఈ గొప్ప అందమైన వారసత్వ సంపద దోహదపడుతుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. ఏమైనా నంద్యాల జిల్లాకు మకుటయనంగా, అత్యంత శోభాయానంగా నిలుస్తూ ఓక గొప్ప కీర్తి ని తన పేర లిఖించుకొని రాష్ట్రవ్యాప్తంగా వున్న అశేష ప్రజానీకం చేత విశేష స్థాయిలో ప్రశంసలు,శతకోటి నీరాజనాలు అందుకుంటున్న ఈ అతి సౌందర్య, సుందరమైన కోటకు మరోసారి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి, సొగసులు అద్ది తిరిగి పూర్వపు వైభవాన్ని సాక్షాత్కరించాల్సిన గురుతర బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వ భుజంస్కందాలపై ఎంతైనా వుంది. అలా చేస్తే ఈ నవాబుల బంగ్లా ఓక గొప్ప, చెప్పుకోదగ్గ టూరిస్ట్ స్పాట్ గా మారి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని ఆదాయాన్ని సమకుర్చిపెట్టడంతో పాటు యావత్తు నంద్యాల జిల్లా వాసులకు ఈ నవాబుల బంగ్లా ఓక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చి ఓక గర్వ కారణంగా నిలువడం తథ్యం!✍️✍️✍️🕌🕌🕌
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#tourist spots