మీరు బాగా పూజలు చేస్తారు కదా మరి ఎక్కువ రోజులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీతో తీసుకెళ్తారా అని అడుగుతుంటారు, తీసుకుని వేళ్ళను నేను ప్రాణం గా పూజించుకునే విగ్రహాలు గడప దాటించి అక్కడ ఇక్కడ తిప్పను, ఎక్కడెక్కడో ఏవో పనులు కోసం వెళ్తుంటాము అక్కడంత మేము మహా భక్తులము అని షో చేయడానికా...
మరి విగ్రహాలకు రోజూ పూజలు చేయాలి అంటారు కదా మీరు వచ్చే వరకు పూజలు ఉండక పోతే ఎలా అని సందేహం
అవును నేను భగవంతుడు ని విగ్రహాలకు పరిమితం చేస్తే నాకు దేవుడు అందులో మటుకే ఉంటాడు కానీ నేను భగవంతుడు ని సర్వంతర్యామి గా చూస్తాను అన్నిటా అంతటా నిండి యున్న నా తల్లిని నా వెంటే ఉందని ద్యానించి జపించి ఆరాధిస్తాను కాబట్టి నా దైవానికి నిత్య పూజలు జరిగినట్టే
అలా అనుకున్నప్పుడు విగ్రహాలు ఎందుకు అబుకోవచ్చు
నా తృప్తి కోసం ఒక చక్కటి అందమైన ఆకారం లో ఆమెను కొలువు తీర్చి అభిషేకం అందంగా అలంకరణ అర్చన రకరకాలుగా ప్రసాదాలు పెట్టి తృప్తి పడటం కోసం ఆమె అడిగింది అనికాదు నా సంతోషం కోసం షోడసోపచారాలతో సేవ చేయడం కోసం... నాదగ్గర ఉన్న వనదుర్గ తల్లిని ఒక ప్లేట్ లో మెత్తగా వేపాకు పరిచి నిద్రపోమ్మని జోల పాడి ఉదయం మళ్ళీ నిద్రలేపి పసుపునీళ్లతో స్నానం చేసి పూజలు చేసేదాన్ని ఇది ఆమె అడిగిందా అలా నా తల్లితో ఆడుకొవడానికి నాతో వాళ్ళు అలా చేయించుకొవడానికి వచ్చిన రూపాలే ఈ విగ్రహాలు అంతే గాని వాళ్ళు విగ్రహం వరకే పరిమితం కాదు...
నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు నా వెంటే ఉంటారు....
ఎక్కడో హాస్పిటల్ లో ఉండే వారికి ఒక ఫోటో తీసుకుని ప్రాణశక్తి పూజలు చేస్తే నయం అవుతుంది అలాంటిది నేను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ధ్యానిస్తూ స్మరిస్తూ నా తల్లికి దగ్గర గానే ఉంటాను...
నేను ఆత్మ నా తల్లి పరమాత్మ ఈ రెండూ ఎప్పుడు ఒక్కటిగానే ఉంటాయి.. చనిపోతే దూరం ఐయ్యేది శరీరమే కానీ నా దైవం కాదు ప్రాణం అమ్మవాయితోనే తర్వాత అమ్మవారిలోనే ఉంటుంది... శరీరం తో ఉన్నప్పుడు నాలో ఉంటుంది శరీరాన్ని విడిచి పెట్టినప్పుడు తనలోకి తీసుకుంటుంది ఇది మా బంధం...
#dasara ammavaru #ammavaru #ammavaru #bhakthi & మహంకాళీ అమ్మవారు## songs.. #అమ్మవారు