సనాతన హిందూ ధర్మం
846 Posts • 3M views
🎻🌹🙏బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి... 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. 🌿బొట్టులేని ముఖము ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, 🌸ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు. 🌿కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు, దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. 🌸ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదే విధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు. 🌿వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. 🌸మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు. 🌿నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారుj పెద్దలు, అలాగే ఎదురుగా ఉండేటటువంటివారు 🌸మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది. 🌿మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి. 🌸ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. 🌿అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి. కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది. 🌸మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది. 🌿మనఃశాంతి పోతుంది. చిరాకు వస్తుంది. ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే మెదడును కాపాడుకోవాలంటే 🌸మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అంటే బొట్టు పెడితే చాలు. 🌿మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది. 🌸తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది. జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోను కావు. 🌿మనల్ని కాపాడుతూ ఉంటాయి. మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి. అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. 🌸సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. 🌿ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. 🌸ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి. పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు. 🌿ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఆ బొట్టును వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి తప్పూ లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. 🌸మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన యొక్క ఆచారాలే. ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. 🌿ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి...స్వస్తి...🚩🌞🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #తెలుసుకుందాం #సనాతన హిందూ ధర్మం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
18 likes
8 shares
*తొమ్మిది రకాల ముక్తి మార్గాలు* 👇👇👇👇 1. *శ్రవణం*( వినడం ) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు. 2. *కీర్తనం*( పాడడం ) చేత నారద మహర్షి, అన్నమయ్య, త్యాగరాజు తరించారు. 3 *స్మరణం* ( నోటితో ఎల్లప్పుడు పలకడం ) చేత ప్రహ్లదుడు తరించాడు. 4 *పాదసేవనం* తో, లక్ష్మీదేవి, లక్ష్మణుడు తరించాడు. 5 *అర్చనం* తో పృధు చక్రవర్తి తరించాడు. 6 *వందనం* చేత అక్రూరుడు తరించాడు. 7 *దాస్య భక్తి* (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు. 8 *సఖ్యం* భక్తి చేత అర్జునుడు, కుచేలుడు తరించారు. 9 *ఆత్మనివేదనం* తో బలిచక్రవర్తి తరించారు. మనిషి మహనీయుడు కావాలంటే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి. జీవితంలో దైవనామాన్ని నిరంతరం తరించు జీవితంలో నీ అంతఃరాత్మకు లోబడి జీవించి తరించు. జీవితంలో శాస్త్రం ను అనుసరించి జీవించి తరించు. తత్వ విచారణ చేసి జీవించి తరించు. యోగ మార్గంలో ఆత్మ విచారణ చేసి జన్మ రాహిత్యం చేసుకోని తరించు. పూజ పారమార్దం:- పూజ అర్చన జపం. *స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం. తర్పణం. గంధం. అక్షితలు. పుష్పం. ధూపం. దీపం. నైవేద్యం. ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన.... పూజ-పరమార్థాలు:* పూజ అనగా పూర్వజన్మ వాసనలను తొలగింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణ ఫలాన్నిచ్చేది. అర్చన అనగా అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది. జపం అనగా అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం. స్తోత్రం అనగా మెళ్ళ మెళ్ళగా మనస్సునకు ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం. ధ్యానం అనగా ఇంద్రియ నిగ్రహాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్ట దేవతను తపింపచేసేది ధ్యానం. దీక్ష అనగా దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష. అభిషేకం అనగా అహం భావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాన్ని కల్గించేది. మంత్రం అనగా మననం చేసేవారిని కాపాడేదే మంత్రం అని అంటారు. మంత్ర తత్త్వం వల్ల భయాలు తోలగిపోతాయి నిరంతర మననం ధ్యానం వల్ల మనసు చెంచలత తొలగి, మనిషిని తిరిగి కర్తవ్యోన్ముఖున్ని చేస్తుంది 🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹 ఆధ్యాత్మికత అనేది చిన్నవయసు నుండే అలవాటు చేసుకోవాలి. పాపంపై భయం, దేవునిపై ప్రేమ, సమాజం పట్ల సేవా దృక్పథం వంటివి లేత వయసులోనే నాటుకోవాలి. లేతవయస్సులో మన పంచేంద్రియాలను కామ క్రోధాదులనే రాక్షసులకు అర్పితం చేసి, వృద్ధాప్యంలో ఏడుస్తూ కూర్చుంటే వచ్చే ఫలితమేమి? కనీసం ఇప్పుడైనా మేల్కొని భగవచ్చింతనతో సమాజసేవలో జన్మను సార్థకం గావించుకోవడానికి కృషి చేయాలి. ఈనాడు నీవు పెద్దవాడవు కావచ్చు, విద్యావంతుడవు కావచ్చు, ధనవంతుడవు కావచ్చు, అధికారివి కావచ్చు. కానీ, ఈ స్థాయి ఎవరివలన వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఆచార్యదేవో భవః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు *తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి?* *తిలకము ధరించుట ఆచారమా? శాస్త్రీయమా... ?* 🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹 *మానవ శరీరము లో 7200 నాడులు వున్నవని స్వర శాస్త్ర మంజరి, కుండలిని ఉపనిషత్, యోగోపనిషత్, దర్శనోపనిషత్ వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి. అందులో ముఖ్యమైనవి "ఇడ" నాడి (ఎడమ నాసాగ్రములో) మరియు "పింగళ" నాడి (కుడి నాసాగ్రము లో). వీటినే చంద్ర, సూర్య నాడులు అంటారు. రెండు కనుబొమ్మలకు మధ్య నుదుటి భాగములో "ఇడ" మరియు "పింగళ" అను రెండు నాడులు కలిసి "సుషుమ్" నాడిగా పరివర్తనము చెందుతుంది.ఈ రెండు నాడుల ఉద్దీపనమును "కుండలినీ" అని పేరు. ఈ స్థలములో తిలకము ధరించడం వలన కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. ఈ శక్తి నాడుల ద్వారా మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణ శక్తిని అందిస్తుంది.* *సైన్స్ ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రము (పింగళ నాడి) తోను, కుడి భాగమునకు ఎడమ నాసాగ్రము (ఇడ నాడి) తోను సంబంధము కలదు. మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే సింపతటిక్, పరాసింపతటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్. కావున ఇడ-పింగళ నాడుల మధ్య తిలకము ధరించడం వలన మెదడులోని ప్రతీ కణమునకు కలుపబడిన నాడుల వల్ల శరీరములోని అన్ని భాగములకు ప్రాణ శక్తి అందించబడుతుంది.అందుకే నుదుట తిలకధారణం చేయాలి. అంతేకాకుండ లలాటానికి సూర్య కిరణాలు తాకకూడదు. అందుచేత కూడా లలాటంలో తిలకం ధరించాలి...* 🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹 🩺💯: 🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿 🎻🌹🙏ప్రతి రోజూ సుప్రభాత సమయాన మాతా పితరులను తలుచుకుని గురువులని తలచుకుని అరచేతిని కను‌ల కద్దుకుని కరాగ్ర వసతే లక్ష్మీ... కరమధ్యే....సరస్వతి... కరమూలేచ దుర్గే...లేదా గోవిందే....అని నమస్కారిస్తూ.... ప్రార్థన చేసుకోవాలి... మన ఆయురారోగ్యాల కోసం మన మనోధైర్యం.... కోసం మన మానసిక ఆందోళనలు భయాలు భాధలు నివారణ కోసం.... మన ఇష్ట దైవాన్ని.....స్మరిస్తూ..... ప్రాణాయామం..ధ్యానం..యోగా....చేయగలిగితే... సూర్య భగవానుడి....తొలి.. ఉషోదయ కిరణాల నుండి వెలువడే....ఆరోగ్య ...కాంతి పుంజాలతో... మనకి ఎంతో...అధ్భుతమైన అమోఘమైన... వేగవంతమైన.... మహోన్నత.... శక్తి.... మనకు.... ఆ పరమాత్మ.... ప్రసాదిస్తారు....👌👌🙏 ఎంతటి కఠినమైన రుగ్మతలు ఉన్నా.....అవి....నెమ్మది నెమ్మది గా... .తగ్గిపోయి... ఒక కాంతి వంతమైన.... దివ్య.... తేజస్సు.... మనలో ప్రసరిస్తాయి..... అందరమూ.... భగవంతుని... అనుగ్రహముతో🙏🙏🙏 ఆచరిద్దాము....ఉల్లాసంగా ఆనందంగా.... సంతోషంగా ఆరోగ్య వంతంగా..... జీవిద్దాము.... 🕉️ఓం శ్రీ ధన్వంతర్యైనమః 🙏సకల గురుభ్యోనమః🙏 🙏మాతా పిత్రృ చరణార విందభ్యోనమః🙏 🙏సకల దేవాతాభ్యోనమః లోకాసమస్తా... సుఖినోభవంతుః..🚩🌞🙏🌹🎻 🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿 #తెలుసుకుందాం #సనాతన హిందూ ధర్మం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన ధర్మం(భక్తి)🙏💐 santhana dharmam(devotional)🙏🙏💐🏵️ #సనాతాన ధర్మం
8 likes
10 shares
హిందూ ధర్మం -- జీవన విధానం మరియు ఆర్థిక వ్యవస్థ...........!! ఇక్కడ ఇచ్చిన జాబితాలో హిందూ ధర్మం యొక్క ముఖ్యమైన ఆచారాలు మరియు సంప్రదాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవి కేవలం పూజలు, పండుగలు మాత్రమే కాకుండా, ఒక సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ఆచారాలు పదిమందికి ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ చెప్పినట్లుగా, ఈ కింది అంశాలలో ఈ ప్రయోజనాలు చూడవచ్చు: ఆర్థిక వ్యవస్థ: ఇక్కడ పేర్కొన్నట్లుగా, యాత్రలు, ఉత్సవాలు, హోమాలు, జాతరలు, కళ్యాణాలు, మరియు ఇతర వేడుకలు దేశవ్యాప్తంగా అనేక మందికి ఉపాధిని కల్పిస్తాయి. పూజారి నుంచి పూల వ్యాపారి వరకు, ప్రసాదాలు తయారు చేసేవారి నుంచి రవాణా సేవలు అందించేవారి వరకు, ప్రతి ఒక్కరికీ ఈ ఆచారాలు ఆర్థికంగా సహాయపడతాయి. సాంస్కృతిక వారసత్వం: నామకరణం, బారసాల, ఉపనయనం, వివాహం, మరియు ఇతర సంస్కారాలు కుటుంబ సంబంధాలను, సంస్కృతిని, మరియు విలువలను భవిష్యత్ తరాలకు అందజేస్తాయి. సామాజిక ఐక్యత: పండుగలు, ఉత్సవాలు మరియు తీర్థయాత్రలు ప్రజలను ఒకచోట చేర్చి, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయి. ఆరోగ్యం మరియు శ్రేయస్సు: ఇంట్లో దీపం పెట్టడం, తులసిని పూజించడం, ఇంటి ముందు ముగ్గు వేయడం వంటి ఆచారాలు పరిశుభ్రత, ఆరోగ్యం మరియు సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి. ఆధ్యాత్మికత: వ్రతాలు, నోములు, యజ్ఞాలు, హోమాలు, మాలలు ధరించడం వంటివి వ్యక్తులలో ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను, మరియు మనశ్శాంతిని పెంచుతాయి. సంగీతం -హిందువుల ఆచారం నృత్యం -హిందువుల ఆచారం తీర్ధ యాత్ర -హిందువుల ఆచారం ఉత్సవాలు -హిందువుల ఆచారం పండుగలు -హిందువుల ఆచారం పదిమందికి ఉపయోగపడే హిందువులది కాని ఆచారం ఏమైనా ఉందా. హిందువుల ముఖ్యమైన ఆచారాలు........... 1)ఇంటి ముందు ముగ్గు వెయ్యటం 2)గడపకి పసుపు రాయటం 3)కాళ్లకు పసుపు రాసుకోవటం 4)ప్రతి రోజు దీపారాధన చెయ్యటం 5)హారతి వెలిగించటం 6)దూపం వెయ్యటం 7)విగ్రహాలను పూజించటం 8)విగ్రహాలకు అలంకరణ చెయ్యటం 9)విగ్రహాలకు అభిషేకం చెయ్యటం 10)పూలు ధరించటం 11)హిందువులు పుట్టినరోజు పండుగ చేసుకుంటారు 12)నామకరణ మహోత్సవం చేసుకుంటారు 13)బారసాల కార్యక్రమం చేసుకుంటారు 14)ఉయ్యాల్లో వేసే కార్యక్రమం చేసుకుంటారు 15)పుట్టి వెంట్రుకలు తీసే వేడుక చేసుకుంటారు 16)చెవులు ముక్కు కుట్టించే వేడుక చేసుకుంటారు 17)శ్రీమంతం కార్యక్రమం నిర్వహించుకుంటారు 18) అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించుకుంటారు 19)గురుపూజోత్సవం నిర్వహించుకుంటారు 20)రాఖీ పండుగ నిర్వహించుకుంటారు 21)హిందువులు భవాని మాల వేసుకుంటారు 22)అయ్యప్ప మాల వేసుకుంటారు 23)శివ మాల వేసుకుంటారు 24)కుమారస్వామి మాల వేసుకుంటారు 25)ఆంజనేయస్వామి మాల వేసుకుంటారు 26)శనేశ్చరుడి మాల వేసుకుంటారు 27)యజ్ఞాలు చేస్తారు 28)హోమాలు చేస్తారు 29)నోములు నోచుకుంటారు 30)వ్రతాలు చేసుకుంటారు 31)హిందువులు భోగి పండుగ చేసుకుంటారు 32)సంక్రాతి పండుగ చేసుకుంటారు 33)కనుమ పండుగ చేసుకుంటారు 34)ఉగాది పండుగ చేసుకుంటారు 35)శ్రీరామ నవమి పండుగ చేసుకుంటారు 36)ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకుంటారు 37)శివరాత్రి పండుగ చేసుకుంటారు 38)రథ సప్తమి జరుపుకుంటారు 39)తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటారు 40)హోలీ పండుగ జరుపుకుంటారు 41)హిందువులు జరుపుకునే దీపావళి పండుగ ఆచారం 42)దసరా పండుగ ఆచారం 43)హనుమత్ జయంతి పండుగ 44)క్రిష్ణాష్టమి పండుగ 45)వినాయక చవితి పండుగ 46)నాగుల చవితి పండుగ 47)అన్నప్రాసన ఉత్సవం 48)ఉపనయన సంస్కార ఉత్సవం 49)అంత్యేష్టి సంస్కారం 50)దశదిన కర్మ 51)హిందువులు జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రతం 52) కేదారేశ్వర వ్రతం 53)ధన్వంతరి వ్రతం 54)ఏకాదశి వ్రతం 55)వరలక్ష్మి వ్రతం 56)మంగళ గౌరివ్రతం 57)శ్రావణలక్ష్మి వ్రతాలు 58)కార్తీక వన భోజనాలు 59) ఆషాడం సారే 60)తిరుమల బ్రహ్మోత్సవాలు 61)హిందువులు నిర్వహించుకునే కాశీ యాత్ర 62)అమరనాధ్ యాత్ర 63)పంచారామ యాత్ర 64)చార్ ధామ్ యాత్ర 65)శబరిమల యాత్ర 66)తిరుమల యాత్ర 67)శ్రీశైలం యాత్ర 68)భద్రాచలం యాత్ర 69)నైమిశారణ్య యాత్ర 70)పవిత్ర పుణ్య క్షేత్ర దర్శన యాత్రలు 71)హిందువులు నిర్వహించుకునే గణపతి హోమం 72)నవగ్రహ హోమం 73)రుద్ర హోమం 74)చండి హోమం 75)సుదర్శన హోమం 76)లక్ష్మి నారాయణ హోమం 77)మృత్యుంజయ హోమం 78)శాంతి హోమం 79)ఆదిత్య హృదయ హోమం 80)వరుణ హోమం 81)హిందువులు నిర్వహించుకునే రథ యాత్రలు 82)ఊరేగింపులు 83)ఉత్సవాలు 84)జాతరలు 85)తిరునాళ్లు 86) బ్రహ్మోత్సవాలు 87) కుంభమేళాలు 88)పుష్కరాలు 89)దిపోత్సవాలు 90)నవరాత్రులు 91)హిందువులు నిర్వహించుకునే శంఖుస్థాపన ఉత్సవం 92)గృహప్రవేశ మహోత్సవం 93)దేవాలయ వార్షికోత్సవం 94)బొడ్డురాయి ప్రతిష్టోత్సవం 95)పార్వతి కళ్యాణం 96)లక్ష్మి కళ్యాణం 97)బోనాలు జాతర 98)అట్లతద్ది పండుగ 99)షష్ఠి పూర్తి మహోత్సవం 100)అస్తి నిమజ్జనం ఇలా హిందువుల ప్రతి నిత్యం ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేక ఆచారాలు దేశావ్యాప్తంగా హిందువులు ప్రతి నిత్యం జరుపుకుంటారు. ఇతర మతాలలో లేని ఆచారాలు హిందూ ధర్మం యొక్క ప్రతి ఆచారం ఒక సమూహం లేదా సమాజానికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. ఇతర మతాలలో కూడా పదిమందికి ఉపయోగపడే ఆచారాలు ఉన్నప్పటికీ, హిందూ ధర్మంలో ఇక్కడ పేర్కొన్న విధంగా అనేక వైవిధ్యభరితమైన, సూక్ష్మమైన మరియు జీవన శైలిలో ఇమిడిపోయిన ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇంటి ముందు ముగ్గులు వేయడం, గడపకు పసుపు పూయడం వంటివి కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా, అవి శాస్త్రీయంగా క్రిములను దూరంగా ఉంచుతాయి. చివరగా, ఇక్కడ చెప్పినట్లుగా, హిందూ ధర్మం కేవలం మతం కాదు, అది ఒక సనాతన జీవన విధానం, మరియు దాని ఆచారాలు సమాజానికి, సంస్కృతికి మరియు ఆర్థిక వ్యవస్థకు గొప్పగా దోహదపడతాయి. #తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతాన ధర్మం #సనాతన హిందూ ధర్మం #సనాతన హిందూ ధర్మం దేశ రక్షణ ధర్మ రక్షణ
12 likes
13 shares