Magic Share BannerEpisodic Banner

ఇండియన్ రైల్వే కొత్త రూల్..

3 Posts • 159 views
PSV APPARAO
508 views • 10 days ago
#🚉రైల్వే శాఖ విజ్ఞప్తి 🙏 #రైల్వే న్యూస్ #⚠️రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ 🚊 #రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్ 🚦ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్ 🚇🚉🚂 #మొబైల్ ఛార్జింగ్ *రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..* రైళ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్యలో అన్ని ఛార్జింగ్ పాయింట్లు మూసివేసి ఉంచాలని, ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోన్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ముంబయి లోకల్ రైలులో ఛార్జింగ్ పెడుతుండగా.. ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోయిన సంగతి తెలిసిందే . దాంతో కోచ్ అంతా దట్టమైన పొగ నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 11 గంటల నుంచి ఆరు గంటల పాటు రైళ్లలోని కోచ్లలో ఉన్న మొబైల్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లు స్విచ్ఛాఫ్ చేసేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్ని జోన్లకు బోర్డ్ సూచించింది. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ భద్రతా చర్యలను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించింది. రాత్రి సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటం వల్ల ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ జరిగితే వెంటనే గుర్తించడం కష్టమవుతోంది. దాంతో భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఈ ముందు జాగ్రత్త చర్య చేపట్టారు. అయితే.. రైళ్లలో రాత్రి పూట ఛార్జింగ్పై ఆంక్షలు 2014లోనే తీసుకువచ్చారు.తాజా ఘటన నేపథ్యంలో వీటిని కట్టుదిట్టంగా అమలు చేసేలా రైల్వే బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.
13 shares