Magic Share BannerEpisodic Banner

క్రియేటివిటి

1K Posts • 45M views
ప్రపంచం అంతా ఇక ఏఐ మాయజాలమే! లేదా రానున్నది ఏఐ విప్లవం - ఈ ప్రభావంతో ఏకంగా మానవ ప్రమేయం గణనీయంగా తగ్గుముఖం పట్టే ప్రమాదకరమైన పరిస్థితులు? ఇప్పుడు ప్రపంచం యావత్తు ఏఐ మాయజాలం వైపు కన్నెత్తి చూస్తున్నది అనే మాట సత్యదూరం కాదు.ఇక ఏఐ గురించి సూక్ష్మంగా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంటే కృత్తిమ మేధ,ఇది ఏకంగా మనుషుల సహజమైన మేధకు పోటీగా మారబోతుంది అనే ప్రమాద ఘంటికలు ప్రస్తుతం మ్రోగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఓక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అన్నిరంగాలలో అంటే ఆర్థికరంగం, ఆరోగ్యరంగం,ఈ - కామర్స్ రంగం,మార్కెటింగ్,టెలికం రంగం,వ్యవసాయ రంగం,పరిశ్రమల రంగం, భీమా రంగం, పర్యాటక అతిథ్య రంగాలు, మీడియా,వినోద రంగాలు ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని రంగాలలోని వారు కూడా (ఏఐ ) కృతిమ మేధ టెక్నాలజీని ఇప్పుడు ఉపయోగించుకునే పనిలో భాగంగా ఇప్పటికే చాలా బిజీగా పక్కా ప్రణాళికతో వున్నాయి అనే మాట అక్షర సత్యం.ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని అంటే వస్తువుల ధరల నిర్ణయాలు,డేటా విశ్లేషణ, ఆర్థిక సేవల మార్కెటింగ్, వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించడం,పనులను సులభతరం చేయడం,నష్ట నివారణ వ్యూహల రూపకల్పన వంటి అనేక అవసరాల కోసం బ్యాంకింగ్,ఆర్థిక సేవల రంగం ఏఐ టెక్నాలజీని బాగా వాడుకుంటున్నది. అదేమాదిరి ఆరోగ్యరంగం అయితే చికిత్స విషయంలో సత్వర నిర్ణయాల కోసం,రాబోయే రోగాలను పసిగట్టడానికి,మహమ్మారి వ్యాధుల నియంత్రణకు,క్లిష్టమైన శస్ర చికిత్సలలో, ప్రాణాపాయ పరిస్థితుల నివారణతో పాటు పలు ఇతర అవసరాల కోసం ఆరోగ్య వైద్య సేవల రంగం ఏఐ సాంకేతికతను బాగానే తమకు అనుకూలంగా వాడుకుంటున్నది. అలాగే ఈ - కామర్స్ రంగం అయితే ఆన్ లైన్ షాపింగ్ ను సులభతరం చేయడానికి,వినియోగదారుల అభిరుచుల్లో మార్పులను గుర్తించడానికి,మార్కెట్ లో వివిధ వస్తువుల గిరాకీని ముందుగానే అంచనా వేయడానికి వ్యాపార లావాదేవీల్లో నష్టాల ముప్పును నివారించడానికి ఈ - కామర్స్ రంగం ఏఐ సాంకేతికతను బాగా ఒడిసిపట్టుకొని మరీ వినియోగించుకుంటున్నది.ఇంకా చెప్పుకుంటూ పోతే మార్కెటింగ్ రంగం అయితే గిరాకీ పెరుగుదలపై ముందస్తు అంచనాలు,అందుకు తగినట్లుగా వస్తువుల సరఫరా,వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్తువుల తయారీలో మార్పులు చేయడం వంటి అవసరాల కోసం మార్కెటింగ్ రంగం ఏఐ సాంకేతికతను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నది.అలాగే టెలికాం రంగం అయితే తమ పరిధిలో నివసించే జనాభా,వారి ఆర్థిక స్థాయి,టెలికాం సేవల వినియోగంలో వారి అవసరాలు,అలవాట్లు వంటి లోతైనా విశ్లేషణ కోసమని 'జిని ' మెషిన్ ను వాడుకుంటున్నారు. ఇక వ్యవసాయ రంగం అయితే మట్టి పరీక్షలు, పంటల యజమాన్యం,రైతులకు రుణాల మంజూరు వంటి అంశాల్లో సత్వర నిర్ణయాలకు ఏఐని బాగానే వినియోగించుకుంటున్నారు.ఇక పారిశ్రామిక రంగం వారైతే వస్తుత్పత్తి ప్రక్రియను సులభతరం చేయడానికి, ఉత్పత్తుల నాణ్యతను నిశితంగా పరీక్షించడానికి, ఉత్పాదనకు ఉపకరించే యంత్ర పరికరాల స్థితిగతులను పర్యవేక్షించడానికి పలు పరిశ్రమలలో ఏఐ ని వినియోగించుకుంటున్నాయి. ఇక భీమా రంగం అయితే నష్టాల నివారణకు,రోజు వారీ ప్రక్రియలను సులభతరం చేసేందుకు ఆరోగ్య భీమా,ప్రమాద భీమా పొందిన వారి వ్యక్తిగత సమాచారాన్ని విశ్లేషించేందుకు భీమా సంస్థలు ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. అంతేగాకుండా పర్యాటక,అతిథ్య రంగాల విషయానికి వస్తే కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ రంగంలో ఏఐ వినియోగం విశ్వ వ్యాప్తంగా పెరిగింది, అందులో భాగంగా ప్రయాణం టిక్కెట్లు బుక్ చేసుకోవడం,హోటళ్ళలో గదులు బుక్ చేసుకోవడం వంటి పనుల కోసం ఈ ఏఐ ని ఓక ఆయుధంగా వాడుకుంటున్నాయి.ఇక మిగిలింది ప్రదానంగా మీడియా,వినోద రంగాలు, ఈ రంగాలు అయితే కథల తయారీ, వీడియో ఎడిటింగ్, కంటెంట్ ఎంపిక, పుస్తక ప్రచురణ,సంగీత సృజన, పాస్ వార్డ్ ల తయారీ తో సహ ఎన్నో అవసరాల కోసం మీడియా,సినీ నిర్మాణ సంస్థలు ఏఐ సాంకేతికతను వున్న ఫలంగా అందిపుచ్చుకుంటున్నాయి. ఏదిఎమైన మన పెద్దలు సెలవిచ్చినట్లు ' కీడు ఎంచి మేలు ఎంచడంలో తప్పులేదు ' అనే నీతి సామెత ప్రకారం ఆ విధంగా ఈ ఏఐ వినియోగం మూలాన పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి అని శాస్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే ఏఐ సాంకేతిక తయారీకి వినియోగించే పరికరాల వల్ల వాతావరణంలోకి చేరే కర్భాన ఉద్గారాల పరిమాణం ఏకంగా 80 శాతం పెరుగుతుందని తద్వారా సుస్థిర పర్యావరణ పరిరక్షణ చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వారు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.ఏమైనా అమెరికా సంస్థ 'బిల్డిన్ ' గత ఏడాది రూపొందించిన అంచనా ప్రకారం 2028 నాటికి ఏఐ కారణంచేత విశ్వవ్యాప్తంగా 44 శాతం ఉద్యోగాలకు ఎసరు వచ్చే ప్రమాదం పొంచి వుంది అని వారు ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు.అంతేకాదు ఏఐ టెక్నాలజీ పుణ్యమా అని సమీప భవిష్యత్ లో డీస్ పేక్, తప్పుడు సమాచారం తాకిడి బాగా పెరిగి,గొప్యతకు,మేధా సంపద హక్కులకు తీవ్ర భంగం వాటిల్లే పరిస్థితులు 48 శాతం మేరకు పెరుగుతాయని ' వినియోగదారుల గొప్యత ' పై ఈ ఏడాది నిర్వహించిన ' సిస్కో సర్వే - 2024' తేల్చడాన్ని బట్టి రాబోయే భవిష్యత్ ను ఏఐ టెక్నాలజీ శాసించే అవకాశాలే ఎక్కువగా,పుష్కలంగా కనిపిస్తుండటం ఎంతైనా యావత్తు మానవాళికి కాస్తంతా ఆందోళన కలిగించే విషయమే అనడంలో ఎలాంటి సందేహనికి తావులేదు. - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #ఏఐ క్రియేటివిటీ
11 shares