Kasula Venkatesh Goud
1K views • 3 months ago
#🌻" తొలి ఏకాదశి శుభాకాంక్షలు "🌻 #🔱🕉తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు 🕉 #తొలి ఏకాదశి శుభాకాంక్షలు #తోలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏
తొలి ఏకాదశి :
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు వైకుంఠంలో శేషతల్పంపై శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి నాలుగునెలల పాటు అంటే కార్తిక శుద్ధ ఏకాదశి వరకు శ్రీహరికి యోగనిద్రాకాలమే. అన్ని భువనాలకూ పోషకుడు అయిన శ్రీహరి నాలుగు నెలలపాటు నిద్రపోతుంటే... ఆ బాధ్యతలను ఎవరు నెరవేరుస్తారు అన్న అనుమానం తలెత్తుతుంది. తపస్సులను సక్రమంగా నెరవేరుస్తూ... తమ తపస్సుల ఫలాన్ని శ్రీహరికి ధారపోయగలిగినవారికే ఆయన తన బాధ్యతలను బదలాయిస్తాడు.
ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనిస్తాడు. దీనినే తొలి ఏకాదశి అంటారు. శ్రీమన్నారాయణుడు ఈ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశినాడు మేలుకొంటాడు. నెలలో రెండు ఏకాదశుల్లోనూ ఉపవాసం చేయడం వల్ల శారీరక, మానసిక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. దేహం శక్తిమయం, ఉత్సాహభరితం అవుతుంది. ఉత్తరాయణానికి ముఖద్వారం ముక్కోటి ఏకాదశి అయితే, దక్షిణాయనానికి తలగుమ్మం తొలి ఏకాదశి. ఉత్తరాయణంలో దైవకార్యాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరచింతనతో, మోక్షసాధనతో దేవరుణాన్ని తీర్చుకునే యజ్ఞయాగాదులకు ఉత్తరాయణం శ్రేష్ఠం. ఉత్తరాయణంలో మరణించినవారు సూర్యమండలాన్ని ఛేదించుకుని పునర్జన్మ లేని ముక్తిని పొందుతారు. పురాణగాథ ప్రకారం నారాయణుడు మురాసురునితో చాలాకాలం యుద్ధం చేస్తూ అలసిపోయాడు. ఒక గుహలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ సమయంలో ఆయన దేహంలో నుంచి ఒక కన్య ఉద్భవించి, స్వామికి శ్రమ లేకుండా ఆ రాక్షసుణ్ణి సంహరించింది. మేలుకున్న మహావిష్ణువు సంతోషించాడు. ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. యుగయుగాల ప్రజలందరి నోళ్లలో నిలిచేటట్లు నీకు ఇష్టమైనది ఏమైనా ఇమ్మని ఆమె ప్రార్థించింది. అప్పుడు నారాయణుడు, ‘‘నాకు ఇష్టమైన తిథి ఏకాదశి. దక్షిణాయనానికి ముందు వచ్చే ఏకాదశినాడు అందరూ నిన్ను తలచుకునేట్లు వరమిస్తున్నాను’’ అన్నాడు. అదే తొలి ఏకాదశి అయింది.
8 shares

