🌸 ధనుర్మాసం - తిరుప్పావై - పాశురం 29 🌸 🪔 పాశురం శిట్రం శిఋ కాలే వందున్నై శేవిత్తు, ఉన్ పోట్రామరై అడియే పోట్రుం పొరుళ్ కేళాయ్, పెట్రం మేయ్‍త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు, ఇట్రై పఱై కొళ్వాననృ కాణ్ గోవిందా, ఎట్రైక్కుం ఏళ్ ఏళ్ పిఱవిక్కుం, ఉన్ తన్నోడు ఉట్రోమే యావోం ఉనక్కే నాం ఆట్చెయ్‍వోం, మట్రై నం కామంగళ్ మాట్రేలోరెంబావాయ్ 🪷భావం: ఓ స్వామీ! ఓ గోవిందా! మేము వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నీ పాదారవిందములకు మంగళాశాసనము చేయుటే మా పరమ ప్రయోజనం. పశువులను మేపి జీవించే అజ్ఞానులమైన మమ్ములను నీ అంతరంగ సేవకు అనర్హులమని నీవు వదలకూడదు. నీవు మా గొల్లకులములో జన్మించి మా కులమును ధన్యముగా చేసినవాడవు. ఈనాడు ‘పఱై’ పొందుటకై మేము రాలేదు, స్వామీ. అది వ్రతానికి ఒక నిమిత్తమే. ఏడేడు జన్మలవరకూ, ఈ కాలముండునంతవరకూ, నీతోడే ఉండి నీ దాస్యమునే చేయుటకై మేము వచ్చాము. మా హృదయములో ఇతర ఆశలు ఏవైనా ఉన్నచో వాటిని తొలగించి మమ్ము నీ సేవకే అంకితం చేయుము. ఇదే మా వ్రత ఫలం. ఇదే మా శరణాగతి. 🍀జీవన సందేశం: భక్తి పరిపక్వమైనప్పుడు అడుగులు ఆగుతాయి. కోరికలు కరుగుతాయి. సేవ మాత్రమే మిగులుతుంది. 🪔 ఇక మాకు ఏమీ కావాలి కాదు. నీవే కావాలి.🙏 #తిరుప్పావై పాశురాలు