#😧రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు
ఏడ్చిన డైరెక్టర్ మారుతి.. ఓదార్చిన ప్రభాస్
అభిమానులకు వినోదాన్ని పంచాలనే కోరికతో 'రాజాసాబ్' సినిమాను తీసుకొస్తున్నట్లు దర్శకుడు మారుతి ప్రీరిలీజ్ ఈవెంట్లో తెలిపారు. ప్రభాస్ ప్రాణం పెట్టి నటించారని, అది చూసి ఓ అభిమానిగా తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. రీరికార్డింగ్ సమయంలో తాను ఎన్నోసార్లు ఏడ్చానని చెబుతూ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ప్రభాస్ స్టేజిపైకి వచ్చి మారుతిని ఓదార్చారు. డైరెక్టర్ మూడేళ్ల కష్టం ఇలా బయటకు వచ్చిందని అన్నారు.