ShareChat
click to see wallet page

*వైకుంఠ ఏకాదశి* 🪺🪺🪺🪺🪺🍑🍑🍑🍑🪺🍑🪺 సర్వమూ కాలాధీనం. "కాలః కలయతా మహమ్" అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్స్వ రూపంగా నిరూపించింది. కాలము శ్రీమహా విష్ణువుయొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తూం దని పెద్దలు సూచించినారు. అనంతశక్తిమంతమైన కాలాన్ని సౌరం, చాంద్రం, సావనం, నాక్షత్రం - అని నాల్గు విధాలుగా సూచించి, గణించడం జరి గింది. దక్షిణాదిలో సౌర చాంద్రమానాలే గణనీయాలు. మనం చైత్ర వైశాఖాదిమాసాల్నీ పాడ్యమి (ప్రతిపత్), విదియ (ద్వితీయ), తదియ (తృతీయ), చవితి (చతుర్ది), మున్నగు తిథుల్నీ, చాంద్రమానం ప్రకారం గణిస్తున్నాము. పున్నమనాడు చంద్రుడున్న నక్షత్రాన్నిబట్టి గణించేవి చైత్రాదిమాసాలు. ఉదా॥ చిత్తానక్షత్రంలో పున్నమనాడు చంద్రు డుండటాన్ని లెక్కించి - చైత్రం అన్నారు. చంద్రుణ్ణి ఆధారంగా గణించే కాలమానం చాంద్రమానం. సూర్యుణ్ణి ఆధారంగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెలరోజులకూ ఆయా మాసంగా ఉదా|| మకరమాసం ఇత్యాదిగా గుణించడం సౌరమానం. (సూరః = సూర్యుడు, సరతి చరతీతి సూరః - అని వ్యుత్పత్తి, సంచరించువా డని అర్థం. సూరసంబంధమైనది సౌరం) సౌర మాసం మాసాలు ఆయా ఇంగ్లీషుతేదీలను పోలినవై ఎక్కువ శాతం ఆయా తేదీల్లోనే వస్తాయి. కనుకనే తమిళులకు ఏప్రిల్ ఒకటవ తేదీయే మేషమాసారంభమై సంవత్సరాది అవుతుంది. "రవే: సంక్రమణం - రాశౌ సంక్రాంతి రితి కథ్యతే" అనుటచే ఒక్కొక్క మాసమూ ఒక్కొక్క సంక్రాంతి అవుతుంది. కాగా మకర సంక్రాంతి జనవరి 14 నుండి కర్కాటక సంక్రాంతి జూలై 16. వరకు ఉత్తరాయణం, జూలై 17 నుండి, జనవరి 13 వరకూ దక్షిణాయనం అంటున్నాము. "అయనే దక్షిణే రాత్రి రుత్తరే తు దివా భవేత్" అని కపింజల సంహితావాక్యం దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. మానవులకు ఒక సంవత్సర కాలమైనది దేవతలకు ఒక అహోరాత్రమైన దినం. సూర్యుడు ధనురాశిలో ఉండే మాసం ధనుర్మాసం ఈ నెలలో ఉపఃకాలం చాలా ప్రాముఖ్యం! "ధనుస్సంక్రాంతి మారభ్య మాస మేకం వ్రతం చరేత్" అనుటచే ధనుర్మాసం నెలరోజులూ శ్రీహరిని విధిగా బ్రాహ్మీకాలంలో అర్చించాలి. ఇలా అర్చిస్తే కోదండస్డే సవితరి ప్రత్యూషః పూజయే ద్ధరిమ్ సహస్రాబ్జార్బనఫలం దినే నైకేన సిద్ధ్యతి". ధనుర్మాసంలో ఒక్కరోజు ఉషఃకాలంలో శ్రీహరిని అర్చిస్తే వెయ్యేండ్లు నిత్యమూ అర్చించిన ఫలం సిద్ధిస్తుంది. 30 రోజులూ అర్చించేవారికి 30 వేలేండ్లు అర్చించిన -- అంటే అనంతఫలం లభిస్తుంది. అనంతుణ్ణి అనంతంగా అర్చిస్తే అనంతఫలమే కదా. సిద్ధిస్తుంది! ధనుర్మాసం సౌరమానానుసారం రాగా, శుక్లపక్ష ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతిమాసంలోనూ రెండు ఏకాదశులు శుక్ల - బహుళ) వస్తాయి. (అధిక మాసంలో మరో రెండు అధికం). సంవత్సరానికి 24 ఏకాదశులు. ప్రతి ఏకాదశి కూడ ఎంతో పవిత్రమైనది. "గృహస్థో బ్రహ్మచారీచ ఆహితాగ్ని స్తథైవచ। ఏకాదశ్యాం న భుంజీత పక్షయో రుభయోరపి" బ్రహ్మచారి, గృహస్థుడు, నిత్యాగ్నిహోత్రుడూ ఎవడైనా కావచ్చు. - ఉభయ ఏకాదశుల్లోనూ భోజనం చేయరా దని శాస్త్రవాక్యం! ఇంతనిష్ఠతో కూడుకున్న ఏకాదశీదినం శ్రీమహావిష్ణువుకు మిక్కిలి ప్రీతియైనది. కనుకనే ఏకాదశిని "హరివాసరం" అన్నారు పెద్దలు. 24 ఏకాదశుల్లోనూ సౌరమానంలో ప్రశస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి" గా కీర్తిస్తున్నాము. దీన్నే "ముక్కోటి "ఏకాదశి" అని ఆంధ్రు లంటారు. సౌరమానం ధనుర్మాసం కాగా, అందువచ్చే 'వైకుంఠఏకాదశి' చాంద్రమానాను సారిణి. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమ కన్ను కన్నులు వేర్వేరుగా నున్నా దృష్టి ఒక్కటే యైనట్లు. సూర్య చంద్రులు వేర్వేరుగా కన్పిస్తున్నా - కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్త్వాన్ని ఈ పండుగ సూచిస్తుంది. వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిరపుష్యమాసాల్లో వస్తుంది. రావణునిబాధలు తాళలేనిదేవతలు బ్రహ్మను వెంట బెట్టుకొని వైకుంఠం చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శన మిచ్చి, అభయ మొసగడం జరిగింది. కాగా దేవతల బాధానివారణానికి ఈ ఏకాదశియే మార్గం చూపింది. మరో వృత్తాంతం - మధుకైటభులను మహా విష్ణువు సంహరించినపుడు వారు దివ్యరూపాలు ధరించి, దివ్య జ్ఞానాన్ని పొంది, "దేవా! వైకుంఠంవంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశీపూజ గావించి, నిన్ను దర్శించి, నమస్కరించి, ఉత్తర ద్వారమార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీవైకుంఠప్రాప్తి కల్గించుమని" ప్రార్థించారు. స్వామి 'తథాస్తు' అని సంతోషంతో అనుగ్రహించారు. దీనికి 'మోక్షోత్సవదిన' మని కూడా పేరు. ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక "ముక్కోటి ఏకాదశి అని పేరు. (ముక్కోటి అనేది 33 కోట్లకు సంకేత మని అంటారు.) వైకుంఠ దర్శనం కల్గిస్తుంది కనుక "వైకుంఠ ఏకాదశి”. భగవద్దర్శనం గావించేది కనుక "భగవదవ లోకనదినం". మార్గశిరమందలి శుక్ల ఏకాదశి 'మోక్షదైకా దశి'. పుష్య శుక్ల ఏకాదశి 'పుత్రదైకాదశి'. సుకేతుడనే రాజు విశ్వేదేవతల ఉపదేశానుసారం పుష్య శుక్లఏకా దశీవ్రతాన్ని ఆచరించి, భగ వదను గ్రహం వల్ల పుత్రవంతుడైనాడని పద్మపురాణం పేర్కొంది. సకలపాపాలనుండి విముక్తి చెంది, శ్రీకైవల్య ప్రాప్తితో జన్మరాహిత్యం చెందడానికి వైకుంఠ ఏకాదశీ వ్రతాన్ని మించిన ప్రతాచరణ లేదు. దేవదానవులు ఈ యేకాదశి రోజు ఉపవాసంతో రాత్రిం బవళ్లూ శ్రమించి, క్షీరసాగరాన్ని మధించగా, ద్వాదశినాడు మహాలక్ష్మి సముద్రం నుండి వెలువడి వచ్చి, దేవతలకు ప్రత్యక్షమై, వారిని అనుగ్రహించింది. నాటినుండి ఏకాదశి. నాడు పగలు, రాత్రి ఉపవాసంతో ఉండి, జాగరణ చేసి, శ్రీహరిని స్తుతించినవారికి స్వామికృపవల్ల ముక్తి కరతలామలక మవుతుం దనేనమ్మకం ఏర్పడింది.. శుక్ల ఏకాదశినాడు సూర్యునినుండి వెలువడిన పద కొండవకళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్రమండలమునుండి పదకొండవకళ సూర్యమండలాన్ని చేస్తుంది. ఇలా రాకపోకలవల్లనే "ఏకాదశి" అనే పేరు సార్థక మయింది. "ఏకాదశ్యా ముపవసే న్న కదాచి దతిక్రమేత్" ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసంనాడు. "ఉపవాసః స విజ్ఞేయః, సర్వభోగవివర్జితః" - పాపకృత్యాలకు దూరంగా ఉండి, (చేయక) సకలభోగాలను వదలి, పుణ్య కార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట! ఇంద్రియ ప్రకోపాన్ని అణచి, 11 ఇంద్రియాలను (పంచకర్మేంద్రియ పంచజ్ఞానేంద్రియ మనస్సులు 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపజేయునదియే నిజమైన ఉపవాసం. ఏకాదశీ వ్రతం దశమిరాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు! ఎన్మిదేండ్లలోపు వయస్సున్న పిల్లలూ, ఎనభైయేండ్లు దాటిన వృద్ధులూ ఉపవాసం చేయాల్సిన పనిలే దని కాత్యాయనస్మృతి పేర్కొనింది. 🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏నేడే వైకుంఠ ఏకాదశి📿 #🙏వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు🕉️

4.2K వీక్షించారు