ShareChat
click to see wallet page

#వైరల్ వీడియోస్ 📽 *25 లక్షల లైకుల వైరల్ ఇన్‌స్టా పోస్ట్… ఇంతకీ ఏముందీ ఇందులో..⁉️* January 21, 2026🎯 ఓ సాదా సీదా ఇన్‌స్టా వీడియో బిట్… ఆ ఖాతాలో పెద్ద లైకులు కూడా ఉండవ్ పోస్టులకు… కానీ హఠాత్తుగా 2.5 మిలియన్ల వ్యూస్, 76 వేలకు పైగా లైకులు… 320 కామెంట్లు… ఫుల్ వైరల్… ఆ ఖాతా టీనా శ్రావ్య అనే మహిళది… కొమరవెల్లి మల్లన్న ట్యాగ్ లైన్ ఉంటుంది… కానీ ఈ వైరల్ వీడియో మాత్రం మేడారం బెల్లం తూకం బాపతు… ఇక్కడ ఆమె తన పెంపుడు కుక్కను కాటాలో పెట్టి తూస్తోంది… దానికి సమానమైన బరువైన బంగారం అనగా బెల్లాన్ని దేవతలకు మొక్కు చెల్లించడానికి… ఆ ఖాతాలోనే మరో మహిళ వీడియో కూడా కనిపిస్తోంది, పెంపుడు కుక్క తూకం బాపతు… రెండు పెంపుడు కుక్కలూ ఒకటేనా..? వేర్వేరా తెలియదు గానీ, ఆ వీడియోను జనం ఎవరూ దేకలేదు… కానీ ఈ వీడియో మాత్రం వైరలైంది… పదండి కొన్ని వివరాల్లోకి వెళ్దాం… కొందరు కామెంట్లలో అభినందిస్తున్నారు… సొంత పిల్లల్లాగానే పెంపుడు కుక్క (కుక్క అనొద్దట, జస్ట్ పెట్ అనాలట… పేరు మారిస్తే కుక్క కుక్క కాకుండా పోతుందా) నిలువెత్తు బంగారాన్ని దేవతలకు అర్పించడం కొందరి దృష్టిలో అభినందనీయం… కానీ కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు… అది ధర్మవిరుద్ధం అంటున్నారు… అవమానించడం అంటున్నారు… కానీ ఈ గుడ్డి వ్యతిరేకతే కరెక్టు కాదు… సమాజంలో పెట్స్‌ను సొంత పిల్లల్లా ప్రేమించేవాళ్లు బోలెడు మంది… సో, ఇక్కడ ఆమె అభిమానాన్ని, ప్రేమను తప్పుపట్టాల్సిన పనేముంది..? కాకపోతే ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ తెలిసిందే కదా… ఏదైనా సరే, రచ్చ చేయడమే..! తను ప్రేమించే పెట్ బాగుండాలని కోరుకుంటే అందులో దేవతల మీద విశ్వాసమే కదా కనిపించేది..! గుళ్ల దగ్గర కోతుల్ని ఎవరూ కొట్టరు… గానుగాపూర్ వెళ్లండి… ఆవులు, కుక్కలు ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరుగుతాయి, ఎవరూ కొట్టరు… కుక్కలయితే గుడి లోపలకు కూడా వస్తుంటాయి… దత్తాత్రేయుడి అనుచరగణంగానే వాటినీ భావిస్తారు భక్తులు… తప్పు కాదు… ఆవులకు అరటి పండ్లు తినిపిస్తుంటారు కూడా అక్కడే… అసలు జంతురూపాల్ని కూడా పూజించేది హిందూ ఆధ్యాత్మిక ధర్మం… దశావతారాల్లో మత్స్యం, వరాహం, సింహం తదితర కొన్ని అవతారాలతోపాటు గరుత్మంతుడు, హనుమంతుడు, గణేషుడు తదితర దేవుళ్లు కూడా మన దేవుళ్లే కదా… ఎటొచ్చీ విశేషం ఏమిటంటే..? లక్షల కోళ్లు, మేకలు, పందుల బలి, నైవేద్యం జరిగే చోట ఓ పెంపుడు శునకం బాపతు బంగారం మొక్కు చెల్లించబడటమే ఆ విశేషం...!! అవునూ, ఓ డౌట్... కుక్కను ప్రేమించే ఈమె అందరిలాగే ఓ కోడిని కోసి, పొతం చేసి నైవేద్యం ఇచ్చి ఉంటుందా..?!

782 ने देखा
9 घंटे पहले