INSTALL
Your browser does not support the video tag.
దాట్ల వెంకట సుబ్బరాజు
🌸 ధనుర్మాసం | తిరుప్పావై | పాశురం 30 🌸 🪔 పాశురం వంగక్కడల్ కడైంద మాదవనై కేశవనై, తింగళ్ తిరుముగత్తు చ్చెయిళైయార్ శెన్ఱిఱైంజి, అంగప్పఱై కొండవాట్రై, అణిపుదువై పైంగమలత్ తణ్‍తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న, శంగ త్తమిళ్ మాలై ముప్పదుం తప్పామే, ఇంగు ఇప్పరిశుఱైప్పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్, శెంగన్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్, ఎంగుం తిరువరుళ్ పెట్రు ఇన్బుఋవరెంబావాయ్ 🪷భావం: పాలసముద్రమును దేవతల కొరకు మథించి అమృతాన్ని ప్రసాదించిన ఈ మాధవుడు — కేశవుడు — బ్రహ్మ, రుద్రాది దేవతలకు అధిపతియైన నారాయణుడు… చంద్రముఖలైన గోపికలు అలంకారములతో కూడి ఆయనకు మంగళాశాసనము చేసి పఱై వ్రత ఫలమును పొందారు. ఆ దివ్యానుభవాన్ని శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన తామరమాలలను ధరించిన పెరియాళ్వార్ కుమార్తె — శ్రీ గోదాదేవి (ఆండాళ్ తల్లి) ద్రావిడ భాషలో తిరుప్పావైగా లోకానికి ప్రసాదించింది. ఈ ముప్పది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ శ్రద్ధతో అనుసంధించువారు నాల్గు భుజములుగల శ్రీమన్నారాయణుని ఉభయ విభూతి ఐశ్వర్యములతో కూడిన అవ్యాజ కృపను పొంది బ్రహ్మానందముతో జీవించగలరు. శ్రీ గోదా–రంగనాథుల అనుగ్రహమే ఈ తిరుప్పావై🍀జీవన సందేశం: సాధన వ్యక్తిగతముగా మొదలై, ఆశీర్వాదముగా లోకమంతా వ్యాపిస్తుంది. భక్తి చివరికి మన కోసమే కాదు — సర్వజన హితం కోసమే. 🪔 తిరుప్పావై — వ్రతం కాదు. వరము. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏 #గోదాదేవి తిరుప్పావై
1.8K ने देखा
6 दिन पहले
31
20
कमेंट
Your browser does not support JavaScript!