ShareChat
click to see wallet page

#🌘మహాలయ అమావాస్య 😲 #మహాలయ అమావాస్య విశిష్టత (భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం విశేష దినం) #🌑మహాలయ అమావాస్య Mahalaya Amavasya 2025 Tithi మహాలయ అమావాస్యను పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం వంటి కార్యాలు ఆచరించడం వల్ల పితృ దేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాలయ పక్షం 15 రోజులు పితృ దేవతలకు విశిష్టమైనది. ఈ 15 రోజులు చనిపోయిన వాళ్లు భూమి మీదకి వచ్చి వారి కుటుంబ సభ్యులను దర్శిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఏడాదిలో ఉండే 12 అమావాస్య ల్లో ఈ మహాలయ అమావాస్య విశిష్టమైనదిగా చెబుతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 21వ తేదీన సంభవించనున్న మహాలయ అమావాస్య వేళ పితృ దేవతల అనుగ్రహం కోసం ఆచరించాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం.. Mahalaya Amavasya September 2025 మహాలయ అమావాస్య సెప్టెంబర్‌ 2025(ఫోటోలు- Samayam Telugu) మహాలయ అమావాస్య వేళ పరిహారాలు ఈ మహాలయ అమావాస్య రోజు నువ్వులు కలిపిన నీటితో పితృ దేవతలకు తర్పణాలు వదలడం శ్రేష్టమైనది. పితృ దోషాలు వెంటాడుతున్న వాళ్లు బ్రాహ్మణుల సమక్షంలో తిల హోమం ఆచరించడం ద్వారా పితృ దోషాలను తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే.. ఈ మహాలయ అమావాస్య రోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ.. సూర్యభగవానుడి అర్ఘ్యం సమర్పిస్తే పితృ దోషం కారణంగా కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయట. అంతే కాకుండా పితృ దోషం పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజు గాయత్రీ మంత్రం 108 సార్లు జపించడం కూడా చాలా విశిష్టమైనది. ఈ దానాలు చాలా మంచిది పితృ దేవతలకు సద్గతులు కలిగి సుఖశాంతులు, వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజు దానాలు చేయడం శ్రేష్ఠమని పండితులు చెబుతారు. అలాగే.. అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పండి పెడితే మంచిది. అంతే కాకుండా మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి, వస్త్ర దానం చేయాలని.. స్థోమత ఉన్న వాళ్లు బంగారం, గోదానం వంటి చేయడం శుభప్రదం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు...!!💐🙏💐

4.5K ने देखा
4 महीने पहले