ShareChat
click to see wallet page

🙏🌺కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారు🌺🙏 🌺కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.ఈ ప్రదేశములో సతీదేవి నయనాలు పడ్డాయంటారు. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించనివారు చాలా అరుదుగా వుంటారేమో ఇంతమంది అనునిత్యం పూజించే శ్రీమహలక్ష్మికి మన దేశంలో విడిగా వున్న ఆలయాలు తక్కువే. లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమయినది.ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయంటారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం.ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు, మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు.🌺 🌺అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ప్రతి సంవత్సరం కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకు వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని దానికి కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట. మరొక కథనం ప్రకారం భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్లో వెలిశారని ఒక కధ. శంకరాచార్యులవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీ చక్రాన్ని స్ధాపించారు.తరువాత విద్యాశంకర భారతి ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతను గుర్తించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు. దత్తాత్రేయుడు ఇక్కడ ప్రతి రోజూ మధ్యాహ్నం భిక్ష చేస్తారని ప్రతీతి. దానికి చిహ్నంగా ఆయనకి ఇక్కడ ఉపాలయం వున్నది.🌺 🌺గర్భగుడిలో మహాలక్ష్మీదేవి విగ్రహం దక్షిణదిశాభి ముఖంగా వుంది. సుమారు 40 కిలోల బరువు వుండే ఈ అమ్మవారి విగ్రహం వజ్ర, వైఢూర్య, బంగారు, వెండి, ఆభరణాలతో మెరుస్తూ వుంటుంది. మహాలక్ష్మి వెనకాల సింహం శిల్పం వుంది. నాలుగు చేతులు వున్న ఈ దేవి ఒక చేతిలో ఖడ్గం, ఒకచేతిలో పండు, ఇంకొక చేతిలో నీళ్లకుండ, ఒకచేతిలో కమలం కనపడతాయి. సంవత్సరానికి 2, 3 సార్లు 3 రోజులపాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులోగల చిన్న కిటికీగుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఈ ప్రత్యేక దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ దేవాలయం మహాలక్ష్మీ దేవిది అయినా గర్భగుడిలో పూజలు చేయడానికి ఇక్కడ స్త్రీలను అనుమతించరు. ఇక్కడ ఒక వింత విషయం ఏమిటి అంటే కుంకుమపూజ, అభిషేక సమయాల్లో పురుషులు పట్టుపంచ కట్టుకొని గర్భగుడిలో కూచొని పూజచేయవచ్చు.🌺 🌺శ్రావణ మరియు అశ్వయుజ నెలలలో నవరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దేవి వూరేగింపు ఉత్సవాలు వుంటాయి. ఈ సమయంలో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. మహాలక్ష్మి దేవిని ఆరాధించే వారి పాపాలన్నీ తొలగిపోతాయని, వారి కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మహాలక్ష్మి ఆలయ సముదాయంలో ఏడు దీపస్తంభాలు ఉన్నాయి.ఈ దీప స్తంభాలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఈ దీప స్తంభాలలో వున్న దీపపు ప్రమిదలు వెలిగించినపుడు దేవాలయ ప్రాంగణమంతా కాంతితో నింపుతుంది. మహాలక్ష్మి సాన్నిధ్యంలో పూర్వం చాలామంది మునులు, ఋషులు, తపస్సు చేసి తరించారట.వశిష్ఠమహర్షి ఆధిపత్యంలో ఇక్కడ 88వేల మంది ఋషులు వుండేవారని, స్థలపురాణం తెలియజేస్తుంది.🌺 🌺మొదట ఒక్క మహాలక్ష్మినే ప్రతిష్టించారు. తర్వాత 11వ శతాబ్దంలో గండరాదిత్య హయాంలో మరమ్మత్తులు, ప్రదక్షిణబాట, మహాకాళీ, మహాసరస్వతి ప్రతిష్ట జరిగాయి. మూలవిరాట్ కి మహాకాళికి మధ్య మహలక్ష్మి యంత్రం స్ధాపించబడింది. దీనిపైన గాజుపలక వుండటంతో భక్తులు దర్శించుకోవటానికి వీలుగావుంటుంది. 🌺🌺🌺🌹శ్రీ మాత్రే నమః🌷🌺🌺🌺 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🛕కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారు🙏 #🛕కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారు🕉️

1.6K వీక్షించారు
1 రోజుల క్రితం