గురువు..లభించడానికి.........!!
పౌర్ణమాస్యాం తథా దర్షే
న రాత్రౌ భోజనం చరేత్!
ఈ శ్లోక భావం ఏమిటి అంటే..
పౌర్ణిమ,అమావాస్యలలో రాత్రి పూట
భోజనం చేయకూడదు.
అలాగే జగద్గురువుల సాన్నిధ్యం లభించడానికి
పౌర్ణమి రోజున చేసే ధ్యానం అత్యుత్తమమైంది.
ఎందుకంటే, "పౌర్ణమి రోజు చంద్రుడు
గురు శిష్యుల ముఖ్య ముఖద్వారంగా వుంటాడు"
అని వేదాలు ఉద్భోధిస్తున్నాయి.
భూలోకంలో జీవించే జీవరాశులకు
సూక్ష్మశరీరం లోనూ,
మనోమయ శరీరంలోనూ,
ఆనందమయ శరీరంలోనూ
పౌర్ణమి రోజులలో విశ్వశక్తి అత్యంత అధిక పాళ్ళలో నిబిడీకృతం అవుతుంది.
పౌర్ణమి రోజున మనస్సు ధ్యానానికి అనుకూలంగా వుంటుంది.
అధిక సంఖ్యలో ధ్యానులు సామూహిక ధ్యానం చేస్తే ఊర్ధ్వలోకాలలోని పరమగురువులు సమాయత్తమయి ధ్యానసాధకులకు దివ్యశక్తినీ, దివ్యజ్ఞానాన్నీ అందిస్తారు.
ముఖ్యంగా చెప్పాలి అంటే పౌర్ణమిరోజు ధ్యానం
చేయడం వల్ల పూర్ణాత్మతో అనుసంధానం లభిస్తుంది.
(ఈ విషయంపై ప్రతీ ధ్యానసాధకుడు దృష్టి
సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది).
పౌర్ణమి- అమావాస్య రోజులలో ధ్యానం చేయడం వలన"దివ్యశక్తులు" మరియు"దివ్యసూక్తులు"
సాధకులు ఊర్థ్వలోకాల గురువుల నుంచి పొందటానికి చక్కటి సదవకాశం లభిస్తుంది.
ఈ రెండురోజుల్లో భూలోకంలోని ధ్యానసాధకుల ఊర్ధ్వలోకాలలోని గురువుల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయి.
#తెలుసుకుందాం #om sri gurubhyo namaha