మాతృస్వరూపులైన స్త్రీలకోసం ఈ సూత్రాలు.........!!
శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలను విధించారు మన పెద్దలు.
భర్త అనురాగం పెరగటానికి
సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి
వ్యాధులు రాకుండా వుండటానికి
ఈనియమాలు పాటించి చూడండి.
౧. మంగళ సూత్రం లో పిన్నీసులు వుంచరాదు.
అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి వుంచుతారు .
మంగళ సూత్రం వేదమంత్రాల సహితంగా ప్రభావితము కాబడిన భర్త ఆయువు పట్టు మంగళ సూత్రము రూపములో హృదయం వద్ద చేరివున్నది.
ఇనుప వస్తువులు[పిన్నీసులు ,ఇనుముతో చేసినవి] దివ్యశక్తులను ఆకర్షించుకొను గుణముకలవి.
కనుక అవి మంగళ సూత్రములో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి .
భర్తకు అనారోగ్యం ,
భార్యాభర్తలపట్ల అనురాగం తగ్గటం
ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి.
కనుక వెంటనే ఈ అలవాటు సరి చేసుకోవాలి.
౨. స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలా మంచిది. .
ఈగాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక ,
వీని శబ్దము శుభాలను ,అనురాగాలను పెంచుతుంది.
౩.ఇంట్లో గుర్రం బొమ్మలు వుంచుట అంత క్షేమము కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం .
౪.సంపదలను ,ఎక్కువగా ప్రదర్షించటం వలన నరఘోష ఏర్పడుతుంది .
తద్వారా చెడు జరుగుతుంది.
కనుక [అలంకారాదులు] సాధారణం గా వుండేలా చూసుకోవటం సాధారణ జీవిత విధానాన్ని పాటింఛటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు..
౫. పిల్లలు తమ మాటవినలేదనేవారు ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి.
ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రదారం కుడిభుజమునకు కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి . అలాగే మగపిల్లలైతే ఆకుపచ్చదారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి గంధము నుదుట ధరించటం అలవాటు చేసి చూడండి పిల్లలు మీ మాటను శిరసావహిస్తారు.
౬.ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే ,
వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే
వారు పడుకునే దిండు క్రింద తులసి వేరు వుంచండి
వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు.
విరోధాలు తగ్గి.
౭. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి
వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి.
౮. పని మనిషి రానప్పుడు విసుగుచెంది కోపంతో బాధపడేకంటె ,పనిమనిషికంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను,వాల్లకంటె నేనైతే శుభ్రంగా వుంచుకోగలనని[ నిజాన్ని] మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీపనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి
అసలు పనిమనిషిని మానిపించాలనే అని పిస్తుంది మీకు.
౯.భర్త తాగి వచ్చి హింసపెడుతుంటే
ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత
ఒకచిన్నస్పూన్ [అంటె సుమారు అరగ్రాము] కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటి లో కలిపి త్రాగించండి.
ఇలా అరవై రోజులు చేస్తే వాళ్ళకు తాగుడు పై విరక్తి కలుగుతుంది.
కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది ,
నల్లవెంట్రుకలను కూడా తెల్లబరుస్తుంది .
మొదట దీనిని త్రాగనని మారాం చేస్తారు.
కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటూ చేయండి
ఈ ఔషధాన్ని.తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
౧౦.సుఖసంతోషాలు కరువైనవారు పసుపురంగుపూలు ధరించండి ,
క్రమేపీ స్థితి మెరుగవుతుంది.
౧౧.అప్పుల బాధ ఎక్కువగావుంటె తెలుపు పూలు ధరించటం వలన రుణబాధలు తగ్గుతాయి.
౧౨.ఆరోగ్యం సరిగాలేనివారు ,శరీరం నొప్పులు వున్నవారు మరువం ,మందారాలు కలిపి ధరించండి
ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
౧౩. పెల్లిచూపులప్పుడు ఎరుపు పూలు ,పసుపు పూలు కలిపి మాలకట్టి దరించండి
వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరం గా ఫలితాలొస్తాయి .
౧౪.మంచి తీర్ధం లో రెండు తులసి దలాలు వేస్తే
అవి మానససరోవర జలాలంత పవిత్రమవుతాయి.
౧౯.కూర్చునే పీఠమునకు శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి.
చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి .
౨౦.భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి .
మీకుడిచేతిని తాకి వెళ్లమనండి.
భర్తలకు ఆరోజు సంపాదనా ,
విజయము సంతోషము వెంటనుంటాయి .
ఆ……. ఇవన్నీ మూఢనమ్మకాలు .
అలా జరుగుతుందా ..
ఇలాఎందుకు జరుగుతుందనే సోమరిపోతువాదనలు చేయకండి.
ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి .
వీటిని పాటించటానికి మీకు ఖర్చేమీ కాదుకదా ?
కొంచెం శ్రద్ద .కావాలి అంతే .
ఇందులో మీరు నష్టపోయే విషయాలేవీ లేవు కనుక నిరభ్యరంతరంగా పాటించవచ్చు.
చెప్పటం మావంతు .
ఆచరించి ఫలితాలు పొందటం మీ ఇష్టం .
ఏదన్నా మీకు మేలు జరిగిందనుకుంటే మాకు చెప్పండి సంతోషిస్తాము . ఇదేమీ కార్పోరేట్ కౌన్సిలింగ్ కాదు కనుక మీరేమీ చెల్లించాల్సొస్తుందన్న భయం అక్కరలేదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏
#తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #😃మంచి మాటలు