#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*గోరంట్ల మాధవ్.. అరవ శ్రీధర్ ఇద్దరు ఒక్కటేనా❗*
JANUARY 28, 2026🎯
ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపిన మహిళను బెదిరించి, విడాకులు తీసుకోమని దబాయించి, ఏడాదిన్నర పాటు లైంగికంగా వేధించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలు బయటకు రాగానే జనసేన నేతలు కొత్త రాగం ఎత్తుకున్నారు. వైసీపీ హాయంలో ఎంపీగా చేసిన గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చినందుకు ఎందుకు చర్య తీసుకోలేదు, ఆ రోజు ఆయన చేసినది తప్పు కాకపోతే మా ఎమ్మెల్యేది కూడా తప్పు కాదు అంటూ సమర్థించుకోవడం చూస్తుంటే జనాలకు గోరంట్ల మాధవ్ వీడియో నిజమే అనుకున్నా అక్కడ బాధితురాలు బయటకు రాలేదు. గోరంట్ల మాధవ్పై ఇప్పటికే తమ మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయంగా చేసిన కూటమి నేతలు ఆ విషయం మాత్రం బయటకు చెప్పరు. కానీ, జనసేన ఎమ్మెల్యే విషయంలో బాధితురాలు బయటకు వచ్చి తన ఆవేదన చెప్పుతుంటే ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికి గోరంట్ల మాధవ్ వల్ల తనకు అన్యాయం జరిగింది అని ఏ ఒక్క మహిళా బయటికి రాకపోయినా, నిందలు మాత్రం మాధవ్ మోస్తున్నారు.
నా దగ్గర ఎమ్మెల్యే చేసిన అరాచకాలు అన్ని ఉన్నాయి, ఎమ్మెల్యే వల్ల ఐదు సార్లు గర్భం దాల్చి, అబార్షన్ కూడా చేయించుకున్నాను మొర్రో అంటుంటే, బాధితులకు సపోర్ట్ చేయకుండా ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయడం చూస్తుంటే ఇంతకంటే అరాచకం మరొకటి ఉంటుందా అని ప్రజలు అనుకుంటున్నారు.
ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసిన బాధితులపై రివర్స్ కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వం, తాజాగా జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన బాధిత మహిళపై కూడా కేసులు పెట్టతామంటూ బెదిరించడం చూస్తుంటే అధికారంలో ఉన్న వారు ఏమి చేసినా ఎవరు మాట్లాడకూడదు అనే భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
నిన్న మాట్లాడినా జనసేన ఎమ్మెల్యే అయినా, ఆయన తల్లి అయినా, బాధిత మహిళ తమకు తెలియదు అని ఎక్కడ చెప్పడం లేదు. ఆమె మమ్మల్ని ఆరు నెలల నుంచి వేధిస్తోంది అని చెప్తున్నారు. మరి ఆరు నెలల నుంచి ఒక ఎమ్మెల్యేను ఒక చిరు ఉద్యోగి వేధిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉన్నట్లు. బర్త్డే రోజున కోడిని కోసుకున్న కేసులు పెట్టి, విధుల్లో నడిపిస్తూ వెళ్ళే వ్యవస్థలో మనం ఉంటే, ఒక ఎమ్మెల్యేను ఒక మహిళా వేధిస్తుందని నమ్మే అంత జనం ఉన్నారా అనేది కూడా ఆలోచించడం లేదు.
తప్పు జరిగినప్పుడు, తప్పు బయటకు వచ్చినప్పుడు, సీఎం చంద్రబాబు లాగా గంట వ్యవధిలోనే నిందితులపై చర్య తీసుకోవాలి. కాదు అంటే మాత్రం రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. గతంలో గోరంట్ల మాధవ్ విషయంలో లైట్ తీసుకోని వైసీపీ చాలా నష్టం కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంతు. టైం అయిపోయినా తర్వాత చర్య తీసుకున్నా, తీసుకోకపోయినా నష్టాన్ని ఎవరు పూర్చలేరు అని జనాలు అనుకుంటున్నారు.