👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
557 views
1 days ago
MAAGHA PURANAM -- 7 మాఘపురాణం - ఏడవ అధ్యాయం మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ ఆరంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా! నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేను ఎంతయో సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టం నెరవేర్చెదను” అని పలికాడు. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని చేయమ’ ని ప్రార్థించాడు. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనెంచి “మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది. నీకు జయమగుగాక!” అని యముడు దీవించగా – “మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపుము” అని ప్రార్థించాడు. “అటులనే నీ కోరిక సఫలము అగుగాక” అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యాడు. #రధ సప్తమి # ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమో నమః #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞