#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు ఇవ్వలేరు: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్‌రావు✌️🤩
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు ఇవ్వడం చట్టపరంగా కుదరదు అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్‌రావు స్పష్టంచేశారు. అసలు కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వలేకపోతుందని ఆయన తేల్చిచెప్పారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 160 సీఆర్‌పీసీ కింద సాక్షిగా మాత్రమే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రస్తుతం విచారణకు రాలేనని కేసీఆర్ సిట్ అధికారులకు తెలిపారని పేర్కొన్నారు. తాను ఎర్రవల్లిలో నివసిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి నోటీసులైనా అకడికే పంపించాలని, విచారణ కూడా ఎర్రవల్లిలోనే చేయాలని కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. 160 సీఆర్‌పీసీ చట్టం ప్రకారం 65 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎకడ ఉంటే అధికారులు అకడికి వెళ్లి విచారణ చేయాలని చెప్పారు. కేసీఆర్‌ను హైదరాబాద్ పరిధిలోకి రావాలి అని సిట్ అధికారులు చెప్పడం చట్ట వ్యతిరేకమే అవుతుందని అన్నారు. ఒకవేళ పోలీసులు విచారించాలంటే ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.💪