యేసుక్రీస్తు అందరికి ప్రభువు
880 views
12 days ago
*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖* ╭┄┅┅─══════════════─┅┅┄╮ 🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯ నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. 2సమూయేలు 7:11. I will give you victory over your enemies and grant you peace.. 2 samuel 7:11 *♻️మీకు నెమ్మదిని, జయమును అనుగ్రహించే దేవుడు!♻️* The God who grants you peace and victory! నా ప్రియ స్నేహితులారా నేడు ఈ సందేశము చదువుచున్న మీ శత్రువుల మీద మీకు జయమిచ్చి నెమ్మదిని కలుగజేసియున్నాను అని 2 సమూయేలు 7:11వచనము ద్వారా దేవుడు మీ పక్షాన నేడు వాగ్దానము చేసియున్నాడు. మీ సమస్త శత్రువుల నుండి మిమ్మును విడిపించి రక్షించి వారిపై మీకు అధిక విజయాన్ని అనుగ్రహిస్తాడు. అది ఎలా సాధ్యం నాకు ఏవిధంగా విజయం వస్తాది అని నీవు అన్నట్లయితే, చాలా మంది నేడు చేసే పొరపాట్లు ఏమనగా తమ మీద తామే ఆధారపడటం నమ్మకం పెట్టుకోవడం మరియు ఇతరులపై ఆధారపడటం వారిని ఆశ్రయించడం ఇలా, దేవుడి నుండి తొలగిపోతున్నారు, సొంత ఆలోచనలు నిర్ణయాలతో జీవితాలను అస్తవ్యస్తంగా చేసుకుంటున్నారు. తమ చేతులారా తమని తామే పాడు చేసుకుంటున్నారు. నా ప్రియ స్నేహితులారా మీరు ఆలాగున వుండవద్దు బైబిల్ ఏమంటుందో చూడండి. "మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు." కీర్తనలు 118:8 అన్న వచనము ప్రకారం మనము నమ్ముకొనదగిన సహాయకుడు జీవముగల దేవుడని మనకు సెలవిస్తుంది, మనుషులు మనల్ని మోసగించవచ్చు. మన ఆశలను భంగపరచవచ్చు. దేవుడెన్నటికీ అలా చెయ్యడు. చూడండి "శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు." లూకా 10:19వచనము ప్రకారము మనకు ఏదీయు శత్రువైనను , సాతాను అయినను హాని చేయజాలదు. మీరు చేయవాల్సింది ఒక్కటే అది ఏమిటి అంటే ప్రభువును ఆశ్రయించడం నమ్మకం ఉంచడం ఆయనయందు విశ్వాసము ఉంచాలి. స్నేహితులారా నేడు ఈ సందేశము చదువుచున్న నీవు మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునందు నీవు విశ్వసించినట్లయితే ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపరచనియ్యడు నిన్ను పైవాడిగా ఉంచుతాడు గాని క్రిందవాడిగా ఉంచడు. మీ ప్రతి సమస్యయైన శత్రువైన మరి ఏదైనా సరే ప్రభువుకు అప్పగించడండి, వాటన్నింటి నుండి మీకు అధిక విజయాన్ని ఇచ్చి నీకు నెమ్మదిని కలుగజేసి తన సమాదానముతో నిన్ను నింపుతాడు. నిన్ను వర్ధిల్లజేస్తాడు. ఇశ్రాయేలీయులకు మరియు గాతువాడైన గొల్యాతు అను శూరుడైన ఫిలిష్తీయుల మధ్య జరిగిన యుద్ధము గురించి. 1సమూయేలు 17వ అధ్యాయము చూడండి. ఈ సందేశము ద్వారా తెలుసుకుందాం అయినను ఇది మీకు ముందుగానే తెలుసు. అక్కడ జరిగిన సంఘటనను ఇప్పుడు ద్వానించుదాము. ఇశ్రాయేలు రాజైన సౌలును, ఇశ్రాయేలీయుల సర్వసైన్యమును ఫిలిష్తీయుల వాడైన గొల్యాతును అతని సైన్యాన్ని చూసి యుద్ధం చేయడానికి ఎవరు కూడ ముందుకు రావడానికి సాహసించలేదు. ఎందుకు అంటే అతడు చాలా పెద్ద ఆకారం కలిగిన వాడు తన ఈటె చాలా పెద్దది మరియు పొడవాటివాడు ఫిలిష్తీయుల అందరిలో శూరుడు బలవంతుడు అతడు. ఇశ్రాయేలీయులందరు అతనిని అతని సైన్యాన్ని చూసి భయపడుచున్నారు. మరియు గొల్యాతు ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయుల దేవుడుని అనగా జీవముగల దేవుడునే సృష్టికర్తను అతడు తిరస్కరించాడు, తక్కువ చేసి మాట్లాడాడు. అక్కడ వింటున్న వారందరిలో దావీదు ఒకడు ఇతడు ముందుకు వచ్చాడు, కీలకమైన విషయం ఏమిటో వెంటనే గ్రహించేశాడు దావీదు. దేవుణ్ణెరుగని ఒకడి ముందు సజీవుడైన నిజ దేవుని ప్రజలు భయంతో ముడుచుకుపోవడం గొప్ప అవమానకరంగా అతనికి అనిపించింది. సౌలును అడిగాడు రాజా నేను వెళ్తాను అని. మొదట రాజు నిరాకరించిన అప్పటికి తరువాత ఆజ్ఞ ఇచ్చాడు వెళ్ళమని తన సొంత అన్నలు కూడ తన మీద పగ పట్టారు కోపపడ్డారు యుద్ధానికి వెళ్తాను అన్నప్పుడు, తన అన్న పగ గానీ అతడు చెప్పిన నిరుత్సాహకరమైన మాటలు గానీ దావీదు తన విశ్వాసాన్ని అడ్డుకోనివ్వలేదు. ఎంత మంది ఎన్ని అనిన దావీదు లెక్కచేయలేదు తను కలిగియున్న దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. గతంలో తను తన గొఱ్ఱెలను రక్షించుకొనుటకు సింహాలతో ఎలుగుబంటితో పోరాడి జయించి గొఱ్ఱెలను రక్షించుకున్న వాటిని కూడా తెలియజేశాడు వారికి, ఎందుకు అంటే గతంలో దేవుడు సహాయం చేసిన అనుభవాలు ప్రస్తుతం అతనికి నమ్మకాన్ని ఇచ్చాయి. దేవునిలో మాత్రమే దావీదు నమ్మకం పెట్టుకున్నాడు. ఎవరివో కవచాలు, ఆయుధాలు అతనికి అవసరం లేదు. వేరు సామర్థ్యాలున్న ఇతరుల పద్థతులను అనుసరించక దేవుడు తనకు ఇచ్చిన సామర్థ్యాలను బట్టి ముందుకు వెళ్ళేందుకు సిద్ధపడ్డాడు. ఓ చిన్న వడిసెల చేతపట్టుకు తిరిగే చిన్నపిల్లవాడు కాదు దావీదు. ఏ ఆయుధమూ లేకుండానే ఇంతకుముందు క్రూర మృగాలను అతడు మట్టుబెట్టాడు. దేవుని పేరట గొల్యాతును ఎదుర్కొని అతనిని వడిసెలతో ఒకే గురితో చంపాడు, ఇది చూసిన ఫిలిష్తీయుల సైన్యం పారిపోయింది. విశ్వాసంలో ఉన్న బలప్రభావాలు వేరు వేరు రకాలైన శత్రువులనుకూడా ఓడించగలవు. గొల్యాతు తన బలప్రభావాల మీద ఆధారపడ్డాడు కానీ దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు గనుక దేవుడు తన పక్షంగా ఉండి జయమిచ్చాడు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా బొత్తిగా విశ్వాసం లేకుండా ఉన్నారు ఇక్కడ కానీ దావీదు మాత్రం పూర్తిగా విశ్వాసంతో దేవుని మీద అనుకొనియున్నాడు దేవుని పక్షంగా నిలబడ్డాడు గనుకనే దేవుడే దావీదుకు ఈ యుద్ధంలో విజయం అనుగ్రహించాడు తనని ఘనపరిచాడు. నా ప్రియులారా నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా ఇశ్రాయేలీయుల సైన్యంలో వెనకడుగు వేసిన వారీగా ఉన్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దావీదు వలె ముందుకు రండి దేవుని పక్షంగా నిలబడండి, అప్పుడు ఆయన మీ పక్షంగా వహించి మీ ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నీవు దేవునియందు విశ్వాసము కలిగి జీవించినట్లయితే నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మరియు గొప్ప ఆశీర్వదాలను దేవుని నుండి పొందుకుంటాము. దావీదు వలె అట్టి విశ్వాసము బలమైన నమ్మకం గొప్ప విజయము మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక ఆమేన్. *🛐ప్రార్ధన:- ప్రభువా, నీవు నాకు నెమ్మదిని మరియు జయమును ఇచ్చు దేవుడవని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను. స్తోత్రం తండ్రీ. ఇతరుల ఆలోచనలపై గాని, నా స్వంత నిర్ణయాలపై గాని ఆధారపడక, సంపూర్ణంగా నీపై ఆధారపడి జీవించు కృపను నాకు అనుగ్రహించుము. నీపై ఆధారపడిన వారిని ఎప్పుడూ సిగ్గుపరచని దేవుడవు నీవని స్తుతిస్తున్నాను. నీ మీద నమ్మకముతో గోల్యాతును ఓడించిన దావీదును జ్ఞాపకము చేసుకొని తండ్రీ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా స్వంత బలమును బట్టి కాక, నీ కృప ద్వారానే శత్రువును జయించు కృపను మాకు అనుగ్రహించు తండ్రీ. నీవు మా పక్షమున ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యములు చేయగల ధన్యతను మాకు ప్రసాదించు దేవా. మా జీవతకాలమంతయు నీపై ఆధారపడి జీవిస్తూ, అనేక విజయాలను పొందుకొనే ధన్యతను మాకు దయచేయుమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొంటున్నాము మా పరమ తండ్రీ.* 💓 *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* hb *ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!* ➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.* 👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.* 👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు *WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951* GOD SERVANT *దైవాశ్శీసులు!!!* 👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి. #christian #prayer #teluguchristian #యేసయ్య #💖నా యేసయ్య ప్రేమ @యేసుక్రీస్తు అందరికి ప్రభువు