యేసుక్రీస్తు అందరికి ప్రభువు
1.6K views
22 days ago
*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖* ╭┄┅┅─══════════════─┅┅┄╮ 🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯ *....నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను. యెషయా 60:15.* I will make thee an eternal excellency, a joy of many generatios..... Isaiah 60:15 *💥 మిమ్మల్ని బహు తరములకు సంతోషకారణంగా దీవించే దేవుడు💥* May God Bless You To Be A Source Of Joy For Many Generations *మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయనకు అసాధ్యమైనది ఈ లోకమందే గాని పరలోకమందే గాని ఏదియు లేదు ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడై యున్నాడు ఆయనను ప్రేమించి ఆయన మార్గములో నడిచే వారిని గురించి దేవుడు యెషయా భక్తుని ద్వారా ఈ మాటను పలికించాడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని శాశ్వత శోభాతిశయముగా చేసి బహు తరములకు సంతోషకారణముగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆ మాట ప్రకారంగా చాలా మంది భక్తులను ఆశీర్వదించాడు* 👉 ఉదాహరణకు :- అబ్రాహామును దావీదును దానియేలును పౌలును ఇలా చాలా మంది భక్తులను మనకు సంతోషకారణముగా చేసియున్నాడు వారి విశ్వాసం దేవున్ని వారు ప్రేమించిన విధానము చూడగా అది మనకు ఆశీర్వాదకారణంగాను ఆనందముగాను ఉంది *దేవుడు మనకు కూడ ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు.* నా ప్రియ స్నేహితులారా నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని బహు తరములకు సంతోషకారణముగా చేయాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ...నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను. " (యెషయా 60:15.) అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. లోబడుట మరియు ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడటం అనునవి మిమ్మల్ని శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేయును. ఆలాగుననే, మోయాబీయురాలైన రూతు కుటుంబం వ్యధతో నలిగిపోయింది. అయినప్పటికి ఆమె దేవుని పిలుపును విని అణుకువ గలిగి విధేయురాలైనందువలన దేవుని కృప చొప్పున తరతరముల వరకు ఆశీర్వదింపబడిన సంతానాన్ని దీవెనగా పొందింది (మత్తయి 1:5). నేడు దేవుడు మీ కుటుంబ జీవితంలో మీరు కూడ ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొనమని ప్రేమతో తెలియజేస్తున్నాడు. ఈ లోకపు ఆశీర్వాదాలు వీటిని మీకు అనుగ్రహించవు. దేవుని సత్యంతో కొలిచే వారే ఈ సమృద్ధియైన ఆశీర్వాదాలను పొందుకొనగలరుThose who worship God in truth recieve abundant blessings ఈ రోజు శాశ్వత శోభాతిశయముగా మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు పిలుస్తున్నాడు. మీరు చరిత్రను సృష్టించాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. మనము ఈ లోకాశాలను శరీరాశాలను విడిచి పెట్టి దేవుని వాక్యపు వెలుగులో కూర్చొని ఆయనను ప్రేమించి ఆయన మార్గములో నడిచేవారిగా ఉన్నట్లయితే, మీరు కూడ ఆయనను విశ్వసిస్తే, మీ పట్ల ఆయనకున్న ప్రేమను మీరు అనుభవిస్తారు. అది మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తుంది.* జోనాతాన్ ఎడ్వార్డ్ అను ఒక దైవజనుడుండేవాడు. అతనిది చాలా పెద్ద కుటుంబం. ఆయనకు ఎక్కువ సంతానం ఆ పిల్లలందరూ చాలా మంచి గుణగుణాలు గలవారు. ఏ ఒక్కరూ దుష్ట మార్గాలలో నడువలేదు. వారిలో అధికులు దేవుని సేవించి సంఘంలో ఉన్నత స్థానాలలో ఉండిరి. ఈ కుటుంబంలోని వారందరు దేవుని చేత ఆశీర్వదింపబడి సంతోషంగా జీవించారు. అందుకు కారణం తల్లిదండ్రులు దేవుని పిలుపునకు విధేయులై జీవించారు. తమ పిల్లలను దేవుని పట్ల భయభక్తులు కలిగి యుండేలా పెంచారు. కాబట్టి, దేవుడు వారికి భక్తిగల మంచి గుణగుణములు గల పిల్లలను అనుగ్రహించాడు. మీ పూర్ణహృదయంతో దేవుని వెదకండి. రూతును ఆశీర్వదించిన దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీ దీనత్వంను తొలగించి, మిమ్మల్ని వినయ విధేయతలతో మార్చి, రాజుల యెదుట కూర్చుండబెడతాడు. జోనాతాన్ ఎడ్వార్డ్‌ను ఆశీర్వదించిన దేవుడు నేడు మీ తరములో కూడ ప్రకాశించే నక్షత్రాలను మీకు అనుగ్రహిస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుని పిలుపునకు మీరు లోబడినట్లయితే, మీ తరలాన్నిటికి ప్రకాశించే ఆయన యొక్క శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోష కారణముగాను ఆయన మిమ్మల్ని చేస్తాడు. కాబట్టి, మీరు లోకాశలను, శరీరాశలను, అవాంచిత స్నేహాలను నేడే తృణీకరించి శ్రేష్టమైన దివ్యమైన అనుభవాన్ని వెదకండి. మీదైనందిన జీవితంలో దేవునితో మీ సహచర్యంలో మీరు ఎన్ని వైఫల్యాలను ఎదుర్కొన్నారు? వీటిలో మీరు ఒక్కొక్కదానికి దూరమవండి. దీనికి మారుగా మీరు ఉత్సాహంగా దేవుని హత్తుకొనండి (యెహెజ్కేలు 18:9). ఆలాగుననే, నేడు రూతును ఆశీర్వదించిన దేవుడు తప్పక మీ సంతతిని ఆశీర్వాదిస్తాడు The God who blessed Ruth today will surely bless your descendants as well. మరియు దైవభక్తిగల వారినిగాను, ప్రతి విషయాలలోను ప్రసిద్ధి చెందేలా చేసి మిమ్మల్ని వర్థిల్లజేస్తాడు. *🛐ప్రార్థన:- అద్భుత, ఆశ్చర్యకరుడవైన మా దేవా ఈలోకమందు, పరలోకమందు మీకు అసాధ్యమైనది యేదియు లేదు, మీరు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు స్తోత్రం. నిన్ను ప్రేమించువారిని శ్వాశ్వతశోభాతీశయముగా చేయు తండ్రి స్తోత్రం. నిన్ను నమ్మిన భక్తులను సంతోషకారకులుగా చేసిన తండ్రి స్తోత్రం. సత్యముతో నిన్ను ఆరాధించేవారికి సమృద్ధియైన ఆశీర్వాదములను ఇచ్చు దేవా స్తోత్రం. జోనతాన్ ఏడ్వర్డ్ కుటుంబములో వారి పిల్లలని ఆశీర్వధించినట్లు, మా బిడ్డలని ఆశీర్వదించుము. మీ పిలుపునకు లోబడి ఈలోకాశలను, శరీరాశలను, అవాంచిత స్నేహలను తృణికరించి మీ శ్రేష్ఠమైన దివ్య అనుభవం వెదికే మనస్సు నివ్వండి. మీ సహవాసములో మేము పోగొట్టుకొన్నవి తిరిగి పొందుకొనే ధన్యత నిచ్చిన దేవా స్తోత్రం. రూతుని ఆశీర్వధించినట్లు మా సంతతిని ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమ తండ్రి ఆమేన్* *💓 *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* *ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!* ➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.* 👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.* 👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు *WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951* GOD SERVANT *దైవాశ్శీసులు!!!* 👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి. #christian #యేసయ్య #💖నా యేసయ్య ప్రేమ #teluguchristian #bible @యేసుక్రీస్తు అందరికి ప్రభువు