💥PAWAN KALYAN WAS FELICITATED BY THE GOLDEN DRAGONS ORGANIZATION WITH THE DISTINGUISHED TITLE "TIGER OF MARTIAL ARTS"🐅🥋🗡️
💥అత్యంత అరుదైన ఘనత సాధించిన జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.!❤️👌🏻🙏🏻🇮🇳
💥మూడు దశాబ్దాలకు పైగా సాగిన కఠిన సాధనకు గుర్తింపుగా జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో ప్రతిష్ఠాత్మకమైన ..‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం అందుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.!
💥డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' బిరుదుతో సత్కరించిన గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ.!
💥పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం.!
💥జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ గారు.!
💥మార్షల్ ఆర్ట్స్ – ఒక మనిషిని ఆయుధంగా కాదు, ఆదర్శంగా మార్చే కళ."దాదాపు మూడు దశాబ్దాల క్రితం, దిశలేని యువతలా ఓ 20 ఏళ్ల కుర్రాడు…నిరాశ, అసహనం మధ్య తన జీవితానికి అర్థం వెతుక్కుంటూ నిలబడ్డాడు.అప్పుడే మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గమయ్యింది.మార్షల్ ఆర్ట్స్ అంటే ఇతరులను ఓడించడం కాదు —
మన అహాన్ని జయించడం.మన ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం.
ఒంటరితనాన్ని, ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవడం.!
💥ఆ శిక్షణే కళ్యాణ్ కుమార్‌ను – మన పవన్ కళ్యాణ్‌గా మార్చింది.
సినిమాల్లోని ఫైట్స్‌లో కనిపించిన నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత
మార్షల్ ఆర్ట్స్‌ను కోట్ల మందికి చేరువ చేసింది.నిరంతరం నేర్చుకోవడమే మార్షల్ ఆర్ట్స్ తత్వం.అందుకే ఈరోజుకీ ఓ విద్యార్థిలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.!
💥తన తపనకు గుర్తింపుగా🗓 డిసెంబర్ 30, 2025 న
గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా“టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే అపూర్వ గౌరవం లభించింది.ఇక్కడ “టైగర్” అంటే హింస కాదు —
హింసను అదుపులో ఉంచే బలం.ఆయన నమ్మకం ఒక్కటే:
దేశ సంపద అంటే నదులు, ఖనిజాలు మాత్రమే కాదు…
కలలతో, క్రమశిక్షణతో ఎదిగే యువత.దృఢమైన శరీరం, చురుకైన బుద్ధి, బలమైన వ్యక్తిత్వాలతో భారత యువతను ముందుకు నడిపించడమే లక్ష్యం.!!
💥పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా మన్ననలు పొందుతున్నారు.!
💥మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్, ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.!
💥సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే మరియు సంబంధిత యుద్ధకళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్, చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి, సాంకేతికంగా మరియు తాత్వికంగా బలమైన పునాది ఏర్పరుచుకున్నారు. కాలక్రమేణా, శారీరక సాధనకే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, పరిశోధించి, అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు.!
💥మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమాల రూపంలోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ, వాటికి విస్తృత గుర్తింపు మరియు ప్రజాదరణ తీసుకొచ్చారు.!
💥మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపిన నిరంతర, దీర్ఘకాలిక అంకితభావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు, పవన్ కళ్యాణ్‌కు పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన 'సోగో బుడో కన్‌రి కై' నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది. అలాగే, జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై'లోని 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇది జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే గౌరవం. అంతేకాకుండా, గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదుతో సత్కారం కూడా జరిగింది.!
💥అధునాతన శిక్షణలో భాగంగా, భారతదేశంలో జపాన్ యుద్ధకళలలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'కెండో'లో సమగ్ర శిక్షణ పొంది, ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం మరియు లోతైన తాత్విక అవగాహనను సంపాదించారు.!
💥ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రం.. ఈ మూడింటినీ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యుద్ధకళ సాధకులు, అభిమానుల దృష్టిలో కెంజుట్సులో పవన్ కళ్యాణ్ ప్రవేశం అనేది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు.. క్రమశిక్షణ, వినయం, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబం. ఈ విలువలు మార్షల్ ఆర్ట్స్‌కు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిద్ధాంతాలకు కూడా లోతుగా అనుసంధానమై ఉన్నాయి.!
💥#Raja Comment : మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో అరుదైన అంతర్జాతీయ ఘనతను సాధించడం మన రాష్ట్రానికే గర్వకారణం.పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు' లో అధికారికంగా ప్రవేశం పొందిన వారి జిజ్ఞాస, నేర్చుకోవాలనే తపన నిజంగా అభినందనీయం.!
💥శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మనందరికీ తెలుసు సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో ‘పవర్ స్టార్’గా ఎదిగి, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.!
💥రాజకీయాల్లో పారదర్శకత, నిబద్ధతతో ప్రజల ఆదరణను చూరగొన్నారు.సినీ ప్రవేశానికి ముందే మార్షల్ ఆర్ట్స్‌లో వారు సాధించిన నైపుణ్యం విశేషమైనది. ఇప్పుడు ఈ వయసులో కూడా కొత్త విద్యను నేర్చుకోవాలనే వారి తపన స్ఫూర్తిదాయకం.!
💥ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవన్ కళ్యాణ్ గారి ఆరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తి.!
💥సామాజిక బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ నిరంతరం శ్రమిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.!!❤️🙏🏻
💐💐BIG BIG CONGRATULATIONS AP DEPUTY CM SHRI. KONIDELA PAWAN KALYAN SIR💐💐
#PKMartialArtsJourney❤️🙏🏻
#APDeputyCMPawanKalyan❤️🙏🏻
#JanaSenaParty❤️🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#జనసేన పార్టీ #❤I love my India❤ #జనసేన పార్టీ 🇵🇱🔯 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯