#🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party #kcr తెలంగాణ వచ్చి తర్వాత బీఆర్ఎస్ హాయాంలో మీడియాను కేసీఆర్ వేధించలేదు. తొమ్మిదిన్నరేళ్ళల్లో ఏ ఒక్క వర్కింగ్ జర్నలిస్టును బీఆర్ఎస్ వేధించలేదు. అనేక పోరాటాలు త్యాగాలు, ఆత్మ బలిదానాల పునాదులు మీద ఏర్పడిన రాష్ట్రంలో కుట్రలు చేసినా మీడియా సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించారు..
.. అప్పుడే ఏర్పిడిన పసిపాప అయిన తెలంగాణ గొంతు పిసికేందుకు పని చేసిన సీమాంధ్ర మీడియా గుత్తాధిపత్యాన్ని కేసీఆర్ నిలువరించారు, కానీ ఏనాడు అణచివేత విధానాన్ని అమలు చేయలేదు. పసి గుడ్డు లాంటి తెలంగాణ రాష్ట్రం గొంతులో సీమాంధ్ర మీడియా వరి గింజలా పని చేసింది..అందుకు కేసీఆర్ సీమాంధ్ర మీడియా పట్ల అప్రమత్తంగా ఉండి, మళ్ళీ తెలంగాణ ను ఏపీలో కలిపేందుకు కుట్రలు చేస్తు కోరలు చాస్తున్న మీడియాను కేసీఆర్ కంట్రోల్ లో పెట్టారు.అంతేగానీ ఏనాడు అణచివేత ధోరణి ప్రదర్శించలేదు.
..అంతేకాదు తెలంగాణ వచ్చిన వెంటనే రాష్ట్రంలో పరిస్థితులు కొత్త ప్రభుత్వం తెలుకోక ముందే తెలంగాణ పట్ల ప్రభుత్వం పట్ల విషం చిమ్మే కుట్రలు చేసే మీడియాను టీఆర్ఎస్ ప్రభుత్వం కంట్రోల్ చేసింది..ఏ అవమానాలు, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ నేతల పట్ల నీ ఆంధ్రజ్యోతి ఏబీఎన్ అవమానకరంగా, అవహేళన రాస్తే తెలంగాణ ఉద్యమ కారుడిగా, తెలంగాణ ప్రజలను ఆరు దశాబ్దాలుగా హేళనగా చేసినా దానికి వ్యతిరేకంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజా ప్రతినిధులు కించపరిచి రాస్తే కఠినంగా వ్యవహరించారు.
.నీ బాబు సీమాంధ్ర రాజకీయ నేతలకు బానిసలుగా ఉంటూ ఆ బానిస బుద్ధిని తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానకరంగా, అవహేళనగా మాట్లాడితే కేసీఆర్ కఠినంగా వ్యవహరించారు.. తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు, శాసన, మండలిలో సభ్యులను తాగుబోతులు,పాచి కళ్లు తాగే మొఖాలు అని అహంకారంతో రాసినందుకు కేసీఆర్ ఏబీఎన్ ను బ్యాన్ చేశారు..ఒక్క ఏబీఎన్ మాత్రమే కాదు మరో చానల్ పై కూడా చర్యలు తీసుకున్నారు..
..అనేక త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో తెలంగాణ ఏర్పడితే కనీసం జీర్ణించుకోలేక అజీర్తి తో బాధ పడుతు, నీ యజమాని కళ్ళల్లో ఆనందం కోసం తెలంగాణపై విషం చిమ్మడమే ఏబీఎన్ బ్యాన్ కారణం కాదా..?.. తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ఏకంగా అసెంబ్లీనే తాగుబోతుల సమావేశం అన్నందుకు కదా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ని తెలంగాణ ప్రజలు బ్యాన్ చేసింది.. చరిత్ర మరిచిపోయావా రాధాకృష్ణ..?. నువ్వు గతాన్ని దాచి వర్తమానంలో నీతి వాక్యాలు చెపితే నమ్మడానికి తెలంగాణ ప్రజలేమి ఎర్రిపప్పలు కదా..చరిత్ర మొత్తం రికార్డు అయింది.. ప్రజలు మదిలో పదిలంగా ఉంది.. నువ్వు ఇవాళ ఏదో మీ బానిసకొక బానిస ముఖ్యమంత్రి గా ఉన్నాడని చిలుక పలుకులు చిల్లర కూతలు కూస్తే చరిత్ర చెరిగిపోదు.. కాగితాలు మరుగున పడి పాతపడినంత మాత్రానా నిజాలు అబద్ధాలు కావు.
..ఇక పదేపదే కేసీఆర్ తన హయాంలో మీడియాపై కఠినంగా వ్యవహరించారని, జర్నలిస్టులను అరెస్టు చేశాని కొంత మంది వెధవలు తప్పుడు కూతలు కూస్తున్నారు.. నిజానికి ఏ వర్కింగ్ జర్నలిస్టును కేసీఆర్ టచ్ చేయలేదు..తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏనాడు మీడియాను నియంత్రించలేదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కుల మతాల మధ్య చిచ్చు పెట్టి, అప్పుడే పుట్టిన తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించే కుట్రలు చేసినా మీడియాను కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నియంత్రణ పద్ధతులు అమలు చేశారు.అసెంబ్లీని, ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ను తాగులంటూ తాగుబోతు సభలంటూ కించపరిచేలా మాట్లాడినందుకు ఏబీఎన్ ను బ్యాన్ చేశారు..ఇక మోజో టీవీ కుల మత జాతి పంచాయతీ పెట్టేలా డిబేట్ నడిపితే ఆ డిబేట్ వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు కేసు పెట్టారు, పోలీసులు నిర్వాహకులను అరెస్టు చేసింది అందులో ప్రభుత్వం పాత్ర గానీ కేసీఆర్ హిడెన్ ఎజెండా గానీ ఏమీలేదు..ఇది వాస్తవం.
.ఇక జగన్ పత్రిక స్వేచ్ఛ గురించి అరవడంలో వంద శాతం అర్థముంది.. తెలంగాణలో ప్రభుత్వం కూల్చడానికి ఏ విధంగా అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాతలు రాస్తు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేసిందో అక్కడ కూడా జగన్ కఠినంగా వ్యవహరించారు కానీ ఉన్నది ఉన్నట్లు రాసే మీడియాపై కఠినంగా వ్యవహరించలేదు.
.ఏ రాధాకృష్ణ 2014 నుంచి 2019 వరకు ఏపీలో చంద్రబాబు మీడియాను అణచివేయ లేదా..?. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సాక్షిని నిషేధించలేదా..?. ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకుండా అడ్డుకోలేదా..?. ఇప్పుడు 2024 నుంచి రెండేళ్లుగా ఏపీలో సాక్షిని నిషేధించలేదా...?. ఎంఎస్ఓలను, కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సాక్షి ప్రసారాలు ఆపలేదా..?..ఒక్క సాక్షి మాత్రమే కాదు ఎన్టీవీ ప్రసారాలను కూడా అధికారికంగా నిలిపివేశారు కదా..ఇప్పటికీ అనాధికారింగా కొన్ని అడ్డుకుఉటున్నారు కదా..?. ఇవాళ నువ్వేదో చిలుక పలుకులతో చిల్లర కూతలు కూస్తే చరిత్ర చెరిగిపోతుందా..?.
..కానీ తెలంగాణలో కేసీఆర్ ఏనాడు నీ ఆంధ్రజ్యోతి కి ప్రకటనలు ఆపలేదు కదా..?.ఏ రోజు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు రావొద్దని చెప్పలేదు కదా..?. ఇప్పుడు చెప్పు ఎవరు మీడియాను అణివేశారు.. చంద్రబాబా..? కేసీఆర్ రా...?. ఎవరు పత్రిక స్వేచ్ఛ ను హరించారు..?. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అవమానించి అసెంబ్లీ ని కల్లు మండపంలో పోల్చినందుకు కదా ఏబీఎన్ను బ్యాన్ చేసింది..ఆ చిల్లర కూతలు కూయకపోతే ఎందుకు బ్యాన్ చేస్తారు..?. తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినందుకు కదా చర్యలు తీసుకుంది..పత్రికా ముసుగులో చట్ట సభలను అందులో సభ్యులను ఏ విధంగా అయిన తూలనాడవచ్చా..?.ఇదేనా జర్నలిజం..?. ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తున్నావ్..